Babu: No.1 Bullshit Guy Review బిగ్‌బాస్ అర్జున్ కల్యాణ్.. కుషిత కల్లపు మూవీ ఎలా ఉందంటే?

Rating: 2.5/5

నటీనటులు: అర్జున్ కల్యాణ్, కుషిత కల్లపు, రవివర్మ, లక్ష్మణ్ వర్మ, సోనాలి పాణిగ్రాహి, కమెడియన్ భద్రం, జబర్దస్త్ అప్పారావు తదితరులు
దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ
నిర్మాత: దండు దిలీప్ కుమార్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డీ లక్ష్మీ నారాయణ (బుజ్జి)
బ్యానర్: డీడీ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి: పీఎస్ మణికర్ణన్
ఎడిటర్: డీ వెంకట ప్రభు
మ్యూజిక్: పవన్
రిలీజ్ డేట్: 2024-03-08

Babu  No 1 Bullshit Guy

సంపన్న కుటుంబానికి చెందిన కార్తీక్ (అర్జున్ కల్యాణ్) అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చే సరికి కోవిడ్ పరిస్థితులు బలంగా ఉంటాయి. దాంతో తమకు సంబంధించిన ఫామ్ హౌస్‌లో ఉండమని తండ్రి (రవివర్మ) సలహా ఇస్తాడు. దాంతో తన లవర్ కుషిత (కుషిత కల్లపు)తో కలిసి ఆ ఫామ్ హౌస్‌లో ఉండాలని డిసైడ్ అవుతారు. ఆ క్రమంలో ప్లంబర్ సోంబాబు (లక్ష్మణ్ వర్మ) వారిద్దరిని బంధిస్తాడు.

విల్లాలో కార్తీక్ బాబు, కుషిత లవ్ లైఫ్ ఎలా సాగింది? ప్లంబర్ రూపంలో వచ్చిన సోంబాబు ఎవరు? వారిద్దరిని ఎందుకు బంధించాడు? సోంబాబుకు కార్తీక్ బాబు మధ్య ఉన్న వైరం ఏమిటి? సోంబాబు కిడ్నాప్ వ్యవహారం కార్తీక్, కుషిత నుంచి ఎలా బయటపడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానమే బాబు: నెం 1 బుల్ షిట్ గయ్ సినిమా కథ.

లాక్ డౌన్ సమయంలో కార్తీక్ బాబు, కుషిత విల్లాలో రొమాంటిక్ లైఫ్‌తో మూవీ సరదాగా సాగిపోతుంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సరదా సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. ప్లంబర్ రూపంలో సోంబాబు వచ్చిన తర్వాత కథలో ట్విస్టు చోటు చేసుకొంటుంది. కుషిత, కార్తీక్‌ను కిడ్నాప్ చేసి బంధించడంతో ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సోంబాబు కిడ్నాప్ వ్యవహారాన్ని డీల్ చేయడంలో దర్శకుడిగా లక్ష్మణ్ వర్మ పరిణతి చూపించాడని చెప్పవచ్చు. కొంత అనుభవరాహిత్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది.

బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అర్జున్ కల్యాణ్ తన పాత్రకు న్యాయం చేశాడు. నటన పరంగా బెటర్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. ఇంకా యాక్టింగ్ పరంగా ఈజ్ చూపించాల్సిన అవసరం ఉంది. కుషిత బబ్లీగా క్యూట్‌గా కనిపించింది. గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. సోంబాబు పాత్రలో దర్శకుడు లక్ష్మణ్, సోనాలి పాణిగ్రహి, రవివర్మ తమ పాత్ర పరిధికి తగినట్టు కనిపించాడు. కమెడియన్ భద్రం, జబర్దస్త్ అప్పారావు కామెడీని పండించారు.

లాక్‌డౌన్ పరిస్థితులను చక్కగా వాడుకొని దర్శకుడు లక్ష్మణ్ వర్మ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కథగా విస్తరించిన తీరు, అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ అంశాలను జోడించి తీరు బాగుంది. కొత్తవాడైనప్పటికీ.. సినిమాను డీల్ చేసిన విధానం ఒకే అనిపించేలా ఉంది. దండు దిలీప్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు, మణికర్ణన్ సినిమాటోగ్రఫి బాగుంది. పవన్ మ్యూజిక్ బాగుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X