Baby Review (బేబీ రివ్యూ) గుండెను పిండేసే ప్రేమ కథ.. ఆనంద్, వైష్ణవి, విరాజ్ టాప్ క్లాస్..!
Rating: 3/5
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, ప్రభావతి లిరీష తదితరులు
కథ, దర్శకత్వం: సాయి రాజేశ్
నిర్మాత: ఎస్‌కేఎన్
కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
సినిమాటోగ్రఫి: ఎమ్ఎన్ బాల్ రెడ్డి
కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని
రిలీజ్ డేట్: 2023-07-14
బస్తీలో పేదరికం మధ్య పుట్టి పెరిగిన ఆనంద్ (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య) బాల్య స్నేహితులు. ఒకే స్కూల్‌లో చదివిన ఈ ఇద్దరు ఒకరినొకరిని విడదీయలేనంత ప్రేమలో ఉంటారు. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆటో నడుపుతూ ఆనంద్ జీవితం కొనసాగిస్తుంటే.. వైష్ణవి ఇంటర్ పాసై ఇంజనీరింగ్‌లో చేరుతుంది. (Baby Telugu Movie Review) ఇంజనీరింగ్ కాలేజీలో తన క్లాస్‌మెట్ విరాజ్ (విరాజ్ అశ్విన్)తో పరిచయం ఏర్పడుతుంది. కాలేజ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌గా ట్రీట్ చేసే విరాజ్‌తో వైష్ణవి 31 రోజులు డేటింగ్ చేయాల్సి వస్తుంది.
వైష్ణవితో ఆనంద్ ప్రేమ ఎలా మొదలైంది. స్కూల్‌లో వైష్ణవి, ఆనంద్ బంధం ఎలా బలపడింది? కాలేజీలో విరాజ్‌తో పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? బస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవి ఫ్యాషన్స్‌కు, పబ్ కల్చర్‌కు ఎలా అలవాటు పడింది? విరాజ్ లవ్ ప్రపోజల్‌ను వైష్ణవి ఎందుకు రిజెక్ట్ చేసింది? వైష్ణవిలో మార్పు వల్ల ఆనంద్ ఎలాంటి బాధకు గురయ్యాడు? ఆనంద్ ప్రేమ కోసం వైష్ణవి తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఎలాంటి శిక్షకు గురిచేసింది? వైష్ణవి ప్రేమను ఆనంద్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? వైష్ణవి, ఆనంద్, విరాజ్ ట్రాయంగిల్ లవ్ స్టోరికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే బేబీ సినిమా కథ. (Baby Telugu Movie Review)

ఆనంద్ విషాదకరమైన జీవితానికి సంబంధించిన సీన్లతో మొదలుపెట్టి.. కథలోకి తీసుకెళ్లిన తీరు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆనంద్, వైష్ణవి మధ్య స్కూల్ ఎపిసోడ్ ఎంటర్‌టైనింగ్, ఫీల్‌గుడ్‌గా సాగుతాయి. వైష్ణవి కాలేజీలో చేరడం, విరాజ్‌కు చేరువ కావడంతో కథలో ఓ మలుపుతో ఊపందుకొంటుంది. ఆనంద్, వైష్ణవి మనస్పర్ధలతో కథ కొంత క్రిటికల్‌గా మారుతుంది. ఇక పబ్‌లో ఓ ఎమోషనల్, హైడ్రామా ఎపిసోడ్‌తో ఫస్టాఫ్‌ను ఎమోషనల్‌గా ముగించడమే కాకుండా సెకండాఫ్‌పై అంచనాలు పెంచడంలో దర్శకుడు సాయి రాజేష్ సక్సెస్ అయ్యాడనిపిస్తుంది.
ఇక సెకండాఫ్‌లో విరాజ్, వైష్ణవి డేటింగ్ వ్యవహారం కథను మరో మలుపు తిప్పుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. వైష్ణవి చేసిన ఓ తప్పు ఆనంద్‌కు తెలిసిన తర్వాత ముగ్గురి మధ్య డ్రామా పీక్స్‌కు చేరుకొంటుంది. (Baby Telugu Movie Review) ప్రీ క్లైమాక్స్‌లో వైష్ణవికి సంబంధించిన ఓ కీలకమైన ఎపిసోడ్, ఆనంద్ తల్లి మరణం తర్వాత సినిమాను సాగదీసినట్టు అనిపిస్తుంది. అయినా కథలో భావోద్వేగాలు పట్టుతప్పకుండా చేశాయి. ఇక ట్రికీగా ఉండే క్లైమాక్స్ ప్రేక్షకుడిని ఆలోచనల్లో పడేస్తుంది.
దర్శకుడు సాయి రాజేశ్ రాసుకొన్న పాయింట్ అద్బుతంగా ఉందని చెప్పవచ్చు. ముగ్గురి మధ్య ప్రేమ కథను పొరలు పొరలుగా విస్తరించిన తీరు.. ఎక్కడా పట్టు తప్పకుండా కథను నడిపించిన తీరుతో దర్శకుడిగా ఫుల్ మార్కులు కొట్టేశాడనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఆనంద్ దేవరకొండ కోసం రాసిన మూడు సిన్లు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయనిపిస్తుంది. (Baby Telugu Movie Review) వైవా హర్షతో బర్త్ డే సీన్, తల్లి మరణించిన సీన్, బ్రిడ్జి సీన్ సినిమాకు అల్టిమేట్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్ విషయంలో ఎక్కువగానే అంతర్మథనం పడటం, తడబాటు పడినట్టు అనిపిస్తుంది. దర్శకుడిగా కథను, పాత్రలను బ్యాలెన్స్ చేయడంలో సాయి రాజేష్ ఫుల్ మెచ్యురిటీని చూపించాడని చెప్పవచ్చు.
ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఆనంద్ దేవరకొండ మరోసారి అద్బుతంగా నటించాడు. సెకండాఫ్‌లో తన నటన విశ్వరూపమే చూపించమే కాకుండా గుండెను పిండేసేలా పెర్ఫార్మ్ చేశారు. ఇక విరాజ్ అశ్విన్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్. స్టెయిల్‌గా, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. తన క్యారెక్టర్ వరకు విరాజ్ పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి.
ఇక సినిమాకు బ్యాక్ బోన్ వైష్ణవి చైతన్య. ఎవరూ ఊహించని విధంగా, పాత్ర పరిధిని దాటి ఊహకు అందని విధంగా ఫెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. హీరోయిన్‌గా తొలి చిత్రంతోనే సినిమా భారాన్నంతా తన భుజాలపై మోసిందనే చెప్పాలి. డ్యాన్సులతో అదరగొట్టింది. కళ్లతోనే హావభావాలను ప్రదర్శించింది. పాత్రలో ఉన్న వేరియేషన్స్‌ను సులువుగా పండిచిందని చెప్పాలి. నాగబాబు, వైవా హర్ష, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. బేబీ సినిమాను హిట్ జోన్‌లోకి చేర్చింది విజయ్ బుల్గానిన్ మ్యూజిక్. ఒకే ఒక పాటతో బ్లాక్ బస్టర్ ఫీలింగ్‌ను తీసుకొచ్చాడు. ఓ రెండు ప్రేమ మేఘాల పాట మాత్రమే కాకుండా.. బీజీఎంతో పలు చోట్ల హృదయాన్ని పిండేశాడు. (Baby Telugu Movie Review) పలు సీన్లను కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఫీల్‌గుడ్‌గా మార్చాడు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చెక్కినట్టు చూపించాడు. విప్లవ్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఓ 10, 15 నిమషాలు ఎడిట్ చేసి ఉంటే ఇంకా మంచి ఫీలింగ్ ఉండేదనిపిస్తుంది. ఎస్కేఎన్, ధీరజ్ పాటించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉన్నాయి.
(Baby Telugu Movie Review) లవ్, ఎమోషన్స్‌తోపాటు ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ పుష్కలంగా ఉన్న చిత్రం బేబీ. పరిస్థితులను బట్టి జీవితంలో ఓ సారి గుండె బలంగా పగులుతుందేమో. కానీ మూడు గంటల బేబీ సినిమాలో పలు మార్లు గుండె కోత తప్పదు. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ఒకరిని మించి ఒకరు ఫెర్ఫార్మ్ చేశాడు. సాయి రాజేష్ టేకింగ్ అద్బుతంగా ఉంది. కథను నిర్మాతగా ఎస్కేఎన్ నమ్మిన తీరుకు హ్యాట్సాఫ్. గత పదేళ్లలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథా చిత్రాల్లో బేబీ ఒకటని చెప్పవచ్చు. పాత్రలతో ప్రేమలో పడేలా.. భావోద్వేగానికి గురయ్యేలా చేస్తుంది. గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం బేబీ. ఫ్యామిలీ, యూత్, కుర్రకారుకు విశేషంగా ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా. థియేటర్‌లోనే చూసి ఆనందించండి.


Click it and Unblock the Notifications











