twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.0/5
    ఏం బ్యాక్ బెంచ్ లో కూర్చునే వాళ్లు, క్లాసులో ఫెయిలయ్యే వారు జీవితంలో ఎదగలేరా...పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఫెయిలయినట్లు కాదు.. అని ఫెయిల్యూర్ బ్యాచ్ కి ధైర్యం చెపుతూ వచ్చిన చిత్రం 'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్' . కాలేజీ ప్రేమ కథలు, ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే వాటిని ఎలా చెప్పి మెప్పించామన్నది ముఖ్యం. 'స్నేహగీతం', 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' దర్శకుడు మధుర శ్రీధర్ తాజాగా 'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్' అంటూ అదే తరహా కథతో ముందుకు వచ్చారు. రొటీన్ స్టోరీలైన్ తో పాటు అంతకన్నా పరమరొటీన్ మలుపులతో సినిమాను నడిపే ప్రయత్నం చేసాడు. మ్యూజిక్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేదు. దాంతో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంతా పూనుకుని గెలిపించాల్సిన పరిస్దితి కనపడుతోంది.

    పదహారు సబ్జెక్టుల్లో ఫెయిలై, ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోతే, రెండోసారి ప్రేమలో పడ్డ కుర్రాడి జీవితంలోకి తిరిగి మొదటి ప్రేమికురాలు వస్తే ఏం జరిగిందనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. వైజాగ్ గీతాంజలి కాలేజీ ఇంజనీరింగ్‌ విద్యార్థి కార్తీక్‌ (మహత్‌ రాఘవేంద్ర). చదువులో వెనకపడ్డ కార్తీక్.. ఎథికల్ హ్యాకింగ్ లో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ లోగా కాలేజీలో ప్రియాంక (అర్చనా కవి)తో పరిచయం... కామన్ గా ప్రేమగా మారుతుంది. నాలుగో సంవత్సరం పూర్తయ్యేసరికి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పుతాడు. అదే సమయంలో ప్రియాంక అమెరికా వెళ్లి ఎం.ఎస్ చేయాలని నిర్ణయించుకుని, ఆ విషయమై విభేదాలు రాగా వదిలి వెళ్లిపోతుంది. కార్తీక్‌ నిరాశలో ఉన్న సమయంలో చైత్ర (పియా బాజ్‌పాయ్‌) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఇద్దరి ప్రేమాయణం సాగుతున్న సమయంలో ప్రియాంక మళ్లీ కార్తీక్‌ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది మిగిలిన కథ.

    అబ్దుల్ కలాం స్టేట్ మెంట్... "ది బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ది నేషన్ మే బి ఫౌండ్ ఆన్ ది బ్యాక్ బెంచస్ ఆఫ్ ది క్లాస్ రూం," ఆధారంగా చేసానని చెప్తున్న ఈ సినిమా కథకు ప్రెడిక్టుబులిటీ( ఊహకు అందటం) పెద్ద సమస్యగా మారింది. రాబోయే పదో సైతం ప్రేక్షకుడు ఈజీగా ఊహించే విధంగా స్క్రీన్ ప్లే రెడీ చేసారు. దానికి తోడు మధుర శ్రీధర్ సైతం కథకి తగిన రేంజిలోనే తన ప్రతిభను చూపి సినిమాను బ్యాక్ బెంచ్ కు తోసేసాడు. ఇక కామెడీ కోసం బ్రహ్మానందం మీద పెట్టిన సీన్స్ ఏమీ పేలలేదు సరికదా ఆ ట్రాక్ లేపేస్తే బాగుండను అనిపించింది. ఇలాంటి సన్నటి థ్రెడ్ తో నడిపే కథలకు చాలా జాగ్రత్తగా కథనం రచిస్తేనే వర్కవుట్ అవుతుంది. ఆ యాంగిల్ లోనే దర్శకుడు మరింత కృషి చేయాలనిపిస్తుంది. డైలాగులు ఓకే అనిపిస్తాయి కానీ అవి పెద్దగా పేలలేదు. పేరుకి కాలేజీ బ్యాక్ డ్రాప్ అయినా ఆ తరహా ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కనపడకపోవటంతో నిరాస కలుగుతుంది.

    మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    హీరో తమిళం వాడైనా చక్కటి ఈజ్ తో చేయటంతో లుక్ వైజ్ బాగుండి.. ఐడింటిఫై చేసుకునేలా ఉన్నాడు. అయితే డాన్స్ ల్లో ఈజ్ చూపకపోవటం.. డబ్బింగ్ సరిగ్గా చెప్పించకపోవటం జరిగింది.

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    ఇలాంటి యూత్ ని టార్గెట్ చేసే సినిమాలకు వారిని ఆకట్టుకునే యు.ఎస్.పి ఎలిమెంట్ ఏదో ఒకటి ఉండాలి.. అదే ఈ సినిమాలో మిస్తైంది.

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    సినిమాలో ఏకైక ఆకర్షణ.. పియా బాజ్ పాయ్.. ఆమె ఉన్నంతసేపూ మరొకరిపై దృష్టి మరలనివ్వదు.

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    మరో హీరోయిన్ అర్చనా కవి.. మహత్ కి జోడిలాగ ఉంది. అయితే ఆమె తన పాత్రకు మాత్రం న్యాయం చెయ్యలేకపోయింది. గ్లామరూ లేదు.. నటనా లేదు..

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    బ్రహ్మానందంని పెట్టుకోవటం వల్ల శాటిలైట్ వాల్యూ ఏమైనా పెరగవచ్చేమో కానీ... సినిమాకు మాత్రం ఏ మాత్రం ప్లస్ కాదు.

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    సాప్ట్ వేర్ కంపెనీ మేనేజర్ గా అలీ... డీసెంట్ గా బాగా చేసారు.

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    టెక్నికల్ గా చెప్పాలంటే.. సునీల్ కాశ్యప్ సంగీతం బాగుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేయలేకపోయింది. ప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది.

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    లక్ష్మి భూపాల్ డైలాగులు యావరేజ్ గా ఉన్నాయి.. అక్కడక్కడా ఇంప్రెస్ చేస్తాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ చేయాలి. ముఖ్యంగా బ్రహ్మానందం ట్రాక్ బాగా ఎడిట్ చేయాలి. దర్శకుడుగా మధుర శ్రీధర్ ఏ విభాగం నుంచి సరైన అవుట్ పుట్ ఇవ్వలేకపోయారు.

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    సెకండాఫ్ బాగా డ్రాగ్ అవటం సహన పరీక్షగా మారటం.. సినిమాకు మైనస్ గా మారింది.

    వెరీ పూర్... ('బ్యాక్‌ బెంచ్ స్టూడెంట్' రివ్యూ)

    సమర్పణ: మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్
    సంస్థ: షిర్డీ సాయి కంబైన్స్‌
    నటీనటులు: మహత్‌ రాఘవేంద్ర, పియాబాజ్‌పాయ్‌, అర్చనా కవి, అలీ, బ్రహ్మానందం, శరత్‌బాబు, ప్రగతి, ఇన్సీ గుత్తా, చిన్మయి తదితరులు.
    మాటలు: లక్ష్మీభూపాల్‌,
    సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌.జి.కె,
    సంగీతం: సునీల్‌కాశ్యప్‌,
    కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధుర శ్రీధర్‌.
    నిర్మాత: ఎమ్‌.వి.కె.రెడ్డి
    విడుదల: మార్చి 15, 2013 (శుక్రవారం.)

    రొటీన్ సినిమాలను ఇష్టపడేవారికి.. కథలో పెద్ద ఆసక్తిని కోరుకోని వారికి.. ధియోటర్ లో నిద్రపోవాలని ఫిక్సైనా వారికి... ఈ సినిమా మంచి ఆప్షన్.

    English summary
    Back Bench Student (BBS), is all set to hit the screens on today with divide talk. BBS is produced by M.V.K. Reddy on the Shirdi Sai Combines banner and presented by Multidimension Entertainments. The protagonist (Mahat Raghavendra) fails in at least 16 subjects in his course, and the story is about how this student’s life turns out to be. “Failure in exams is not failure in life” is the message.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X