Bad Boy Karthik First Review: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ ఫస్ట్ రివ్యూ

గత కొద్దికాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీ ద్వారా విధి యాదవ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, వెన్నెల కిషోర్, వీకే నరేష్, శ్రీదేవీ విజయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రమేష్ దేసెన దర్శకత్వం వహించారు. శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో ఈ సినిమా క్రేజీగా మారింది. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జయరాజ్, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా కోటగరి వెంకటేశ్వరరావు నిర్వర్తించారు. ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఈ చిత్రానికి లభించిన ఫీడ్ బ్యాక్ ఏంటి? అలాగే ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? అలాగే ఈ మూవీ రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Bad Boy Karthik Censor Review

బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా కథ విషయానికి వస్తే.. సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌, దూకుడు స్వభావం ఉండే యువకుడు కార్తీక్ (నాగ శౌర్య) ఏ విషయంలోను రాజీ పడడు. అన్యాయం జరిగితే అంతు చూసే వరకు వెనక్కి తగ్గడు. అలాంటి యువకుడి కుటుంబాన్ని, సిస్టర్‌ను కొందరు కెలికితే ఎలా చెలరేగిపోయాడు. కుటుంబం కోసం ప్రాణాలకు తెగించి వారికి తగిన శాస్తి చేశాడు అనేది ఈ మూవీ కథ. కార్తీక్‌గా నాగశౌర్య వయోలెంట్, ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. మాస్ అవతారంలో తన పాత స్టార్ ఇమేజ్‌‌ను సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఫ్యామిలీ ఎమోషన్స్, బాండింగ్‌తో సాగే కుర్రాడి లైఫ్ నేపథ్యంగా సాగే బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ చిత్రంలోని హింసాత్మక సన్నివేశాలు, కొన్ని అనుచితమైన డైలాగ్స్‌ గురించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే సెన్సార్ బోర్డు అధికారుల సూచనలు, సలహాలను చిత్ర యూనిట్ స్వీకరించి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

మార్పులు చేర్పుల అనంతరం ఈ చిత్రాన్ని వీక్షించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ అనుసరించి ఈ చిత్రాన్ని 16 ఏళ్లకుపైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ సినిమాను తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

కథ పరంగా ఈ సినిమా స్టోరి లైన్‌లో కొత్తగా ఏమీ కనిపించకపోయినా.. మేకింగ్, స్క్రీన్ ప్లే, టెక్నికల్ వాల్యూస్‌పై చిత్ర యూనిట్ నమ్మకం పెట్టుకొన్నాయి. నాగశౌర్య ఎదుర్కొంటున్న ఫెయిల్యూర్స్ అధిగమించడానికి ఈ సినిమాలోని సన్నివేశాలను చాలా ఇంటెన్స్ లుక్, యాక్షన్ సీన్లను డిజైన్ చేశారు. దాంతో ఈ సినిమాను సాగదీయకుండా పరిమితమైన నిడివితో అంటే 2 గంటల 22 నిమిషాల మేర అంటే 152 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా ఫైనల్‌గా హీరో నాగశౌర్యకు అత్యంత ఛాలెంజ్‌గా నిలిచే చిత్రంగా మారింది. తన ఫెయిల్యూర్స్‌కు అడ్డుకట్ట వేసి ఈ సినిమాను సక్సెస్‌గా మలుచుకొంటారా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందనే విషయం ప్రస్తుతం సినీ వర్గాలకు ఆసక్తిగా మారింది. ఈ చిత్రం గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించిన వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X