Bad Newz First Review: బ్యాడ్ న్యూజ్ ఫస్ట్ రివ్యూ, బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ.. త్రిప్తి డిమ్రి సూపర్ స్టార్.

యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన త్రిప్తి డిమ్రీ నటించిన తాజా చిత్రం బ్యాడ్ న్యూస్. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో వికీ కౌశల్, ఆమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందే హాట్ కంటెంట్‌తో ఆకట్టుకొన్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించగా.. ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కరణ్ జోహర్, హీరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ తదితరులు నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 19వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా క్రిటిక్ రివ్యూలోకి వెళితే..

బ్యాడ్ న్యూస్ సినిమా రిలీజ్‌కు ముందు ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్స్ ఈ మూవీపై భారీగా బజ్ క్రియేట్ చేశాయి. త్రిప్తి డిమ్రీ, వికీ కౌశల్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీపై యూత్‌ను కనెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. త్రిప్తి డిమ్రి క్రేజ్‌తో ఓపెనింగ్స్ భారీగా నమోదు అయ్యాయి.

Bad Newz First Review  Umair Sandhu says Sure Shot Paisa Vasool Movie

సలోని బగ్గా (త్రిప్తి డిమ్రి) ఒకే రాత్రి ఇద్దరి పురుషులు అఖిల్ చద్దా (వికీ కౌశల్), గుర్బీర్ పన్ను (ఆమీ విర్క్) తో శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తుంది. ఆ తర్వాత ఆమె గర్బవతి అవుతుంది. వైద్యురాలు పరిశీలించిన తర్వాత కవల పిల్లలను కనబోతున్నట్టు చెబుతుంది. అయితే ఇద్దరు పురుషుల ద్వారా ఇద్దరు బిడ్డలు పడుతున్నారు. అందుకు కారణం హెటెరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ అనే అరుదైన ప్రక్రియ కారణంగా జరుగుతుంది అని చెబుతుంది.

అయితే ఈ అరుదైన ప్రక్రియ ఏంటి? కవల పిల్లలు పుట్టబోతున్నారనే విషయం తర్వాత సలోని పరిస్థితి ఏమిటి? ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులనే విషయంతో ఏం జరిగింది? ఒకే గర్బంలో ఇద్దరు పిల్లలకు ఇద్దరు తండ్రులా? అనే ప్రశ్నలకు సమాధానం ఏమిటి? అనేది ఈ సినిమా కథ.

Bad Newz First Review  Umair Sandhu says Sure Shot Paisa Vasool Movie

బ్యాడ్ న్యూస్ సినిమా గురించి క్రిటిక్ ఉమేర్ సంధూ ఫస్ట్ రివ్యూను అందించారు. ఈ సినిమాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు ప్రీమియర్ వద్ద చూశాను. ఈ చిత్రం బ్యూటీఫుల్ రొమాంటిక్ కామెడీ. మీకు గిలిగింతలు పెట్టడమే కాకుండా మీ మనసులను దోచుకొంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తూ.. వారికి ఏం కావాలో అది అందించేస్తుంది. ఈ సినిమా పక్కా పైసా వసూల్ అని ఆయన తన రివ్యూను అందించాడు.

ఇక బ్యాడ్ న్యూస్ సినిమాతో త్రిప్తి డిమ్రి హిందీ పరిశ్రమలో సూపర్ స్టార్ అయిపోయింది. ఆమె టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. రానున్న కాలంలో బాలీవుడ్‌ను ఏలుతుంది అని జోస్యం చెప్పారు. అయితే ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. కొన్నిసార్లు గొప్పగా ఉన్నాయని చెప్పిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాంబులా పేలాయి. బాగా లేవు అనే చెప్పిన చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేశాయి. కాబట్టి అతడి రివ్యూలను పట్టించుకోకుండా టాక్ ఆధారంగా సినిమాను చూడాలని అంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X