Bad Newz Review బ్యాడ్ న్యూస్ హిందీ సినిమా రివ్యూ! త్రిప్తి డిమ్రి శృంగారం ఎలా? ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating:
3.0/5

రివ్యూ: బ్యాడ్ న్యూస్ (Bad Newz)
నటీనటులు: త్రిప్తి డిమ్రి, వికీ కౌశల్, అమీ విర్క్, నేహా దుపియా, శీభా చద్దా, నేహా శర్మ, అనన్య పాండే తదితరులు
దర్శకత్వం: ఆనంద్ తివారీ
రచన: ఇషితా మోయిత్రా, తరుణ్ దుడేజా
నిర్మాత: కరణ్ జోహర్, హిరూ యష్ జోహర్, అపూర్వ మెహతా, ఆనంద్ తివారీ, అమ్రిత్ పాల్
సినిమాటోగ్రఫి: దేబోజిత్ రే
ఎడిటింగ్: షాన్ మహ్మద్
మ్యూజిక్: రోచక్ కోహ్లీ, విశాల్ మిశ్రా, కరణ్ ఔజా, అభిజీత్ శ్రీవాస్తవ
బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా, అమెజాన్ ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్: 2024-07-19

సలోని బగ్గా (త్రిప్తి డిమ్రీ) ప్రముఖ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటుంది. అయితే తన రంగంలో అత్తుత్తమ స్థాయికి ఎదిగి మెరాకీ అవార్డును అందుకోవాలనుకొనే లక్ష్యంతో ఉంటుంది. అయితే ఓ పెళ్లి ఫంక్షన్‌లో పరిచయమైన అఖిల్ చద్దా (వికీ కౌశల్) ప్రేమలో పడి పెళ్లి చేసుకొంటారు. అయితే ఓ విషయంలో డైవోర్స్ తీసుకోవాలని విడిపోతారు. అయితే సలోనితో విడిపోయిన తర్వాత అఖిల్ వేరే అమ్మాయిలతో జల్సా చేయడం చూసి.. గుల్బీర్ అనే కొత్త బాస్‌తో శృంగారంలో పాల్గొంటుంది. అదే రాత్రి తప్పు తెలుసుకొని వచ్చిన అఖిల్‌తో కూడా ఓ బలహీనమైన క్షణంలో శృంగారానికి పాల్పడుతుంది. దాంతో సలోని ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే పుట్టబోయేది కవలలు.. గుల్బీర్, అఖిల్ కణాలతో పుడుతున్నారనే విషయం తెలుస్తుంది.

Bad Newz Movie Review in Telugu  Tripti Dimri sizzles on Screen with Performance too

ప్రేమించి పెళ్లి చేసుకొన్న అఖిల్, సలోని ఎందుకు విడిపోవాలని అనుకొన్నారు. తన కొత్త బాస్ గుర్బీర్‌కు ఎందుకు చేరువైంది? సలోని కడుపులో పెరుగుతున్న గుర్బీర్, అఖిల్ బిడ్లలని ఎలా తెలిసింది? ఇద్దరు వ్యక్తుల కణాలతో బిడ్డలు ఎలా పుట్టబోతున్నారు? కోట్లాది మందిలో ఒకరికి జరిగే ఈ వింతకు కారణం ఏమిటి? ఇద్దరి పిల్లల విషయంలో అఖిల్, గుల్బీర్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సలోని ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది? చివరకు సలోని పిల్లల సంరక్షణ ఎవరు తీసుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే బ్యాడ్ న్యూస్ సినిమా కథ.

వైద్య చరిత్రలో అరుదైన సంఘటనతో సెలబ్రిటీగా మారిపోయిన సలోని జీవిత కథను తెరకెక్కించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఆ సినిమాలో సలోనిగా నటించే అనన్య పాండే.. సలోని కథను తెలుసుకోవాలనే ఉత్సాహంతో కలుస్తుంది. అలా కథ చాలా వైబ్రంట్‌గా మొదలవుతుంది. వికీ కౌశల్, త్రిప్తి ఇద్దరి మధ్య రొమాన్స్‌ను అర్బాటంగా, అడల్డ్ మూవీకి ఏ మాత్రం తీసిపోని విధంగా మొదలవుతుంది.

Bad Newz Movie Review in Telugu  Tripti Dimri sizzles on Screen with Performance too

అయితే వికీ, త్రిప్తికి వెంటనే పెళ్లి జరిగిపోవడం కథకు సంబంధించిన సమస్యలోకి వెళ్లిపోవడంతో సినిమా మరో జోన్‌లోకి వెళ్తుంది. అఖిల్, గుర్బీర్ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఫన్ క్రియేట్ చేసేలా ఉంది. కానీ ఫస్టాఫ్‌కు పూర్తి భిన్నంగా ఫ్యామిలీ జోన్‌లోకి, ఎమోషనల్ జోన్‌లోకి వెళ్లడంతో డ్రామా ఫుల్ రేంజ్‌లో సాగుతుంది. సెకండాఫ్‌లో కొంత బోర్‌గా, సాగదీసినట్టు ఉంటుంది. కానీ క్లైమాక్స్‌కు సర్దుకొని జోష్‌తో ముగుస్తుంది.

సలోనిగా త్రిప్తి డిమ్రి గ్లామర్‌తోనే కాకుండా యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీసింది. ఫుల్ లెంగ్త్ రోల్ కావడంతో యానిమల్‌ను మించి అందాల ఆరబోతతోపాటు ఫ్యామిలీ డ్రామాలో నటనను కూడా ప్రదర్శించింది. ఫస్టాఫ్‌లో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయిన ఈ భామ.. సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ సీన్లలో ఆకట్టుకొన్నది. వికీ కౌశల్, ఆమీ విర్క్ ఇద్దరు పోటాపోటీగా నటించారు. అనన పాండే, నేహా శర్మ అతిథి పాత్రల్లో మెరిసి అభిమానులకు జోష్ పుట్టించారు.

Bad Newz Movie Review in Telugu  Tripti Dimri sizzles on Screen with Performance too

ఇక ఈ మూవీకి మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. పాత హిందీ పాటలను రీమేడ్ చేసి మళ్లీ సంగీత అభిమానులను ఆకట్టుకొన్నారు. అలాగే ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలోని పాటలను సన్నివేశాలకు అనుగుణంగా పెట్టి ఉత్సాహపరిచారు. ఇక దెబోజీత్ రే సినిమాటోగ్రఫి బాగుంది. ఫారిన్ లొకేషన్లను అందంగా చూపించారు. ధర్మ ప్రొడక్షన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

గ్లామర్, ఎమోషన్స్ కలబోసిన ఫ్యామిలీ డ్రామా బ్యాడ్ న్యూజ్. కడుపులో పెరిగే కవలల పిల్లలకు ఇద్దరు తండ్రులుంటే ఏంటి పరిస్థితి అనే కొత్త పాయింట్ చుట్టు అల్లుకొన్న కథకు గ్లామర్, రొమాన్స్ బాగా దట్టించారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ బ్యాలెన్స్ చేసేలా సినిమాను తీర్చిదిద్దారు. త్రిప్తి డిమ్రీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను థియేటర్‌లో తప్పకుండా చూడాలనిపించేలా ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ ఓ సారి ఈ సినిమాపై లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X