Bagheera Movie Review: బఘీర మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. ప్రశాంత్ నీల్ కథ మెప్పించిందా?

Rating: 2.75/5
నటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, ప్రకాశ్ రాజ్, రంగయాన రఘు, అచ్యుత్ కుమార్, రామచంద్ర రాజు తదితరులు
దర్శకత్వం: డీఆర్ సూరి
రచన: ప్రశాంత్ నీల్, సూరి
నిర్మాతలు: విజయ్ కిరగందూర్
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫి: ఏజే శెట్టి
ఎడిటింగ్: ప్రణవ్ శ్రీ ప్రసాద్
బ్యానర్: హోంబలే ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2024-10-31

పోలీస్ ఆఫీసరైన తండ్రి (అచ్యుత్ కుమార్)ను సూపర్ హీరోగా భావించి వేదంగ్ (శ్రీమురళి) కూడా ఐపీఎస్ అధికారిగా పోలీస్ ఉద్యోగంలో చేరుతాడు. అయితే తాను పోలీస్ ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టిన మంగళూరులో పోర్టు మాఫియా గ్యాంగ్ అరాచకాలు శృతి మించి పోతాయి. ఆ క్రమంలో రాజకీయ, ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా తాను ఏం చేయలేకపోతాడు. ఆ క్రమంలో భగీర అనే అపరిచితుడు రంగంలోకి దిగి మాఫియా గ్యాంగ్, గ్యాంగ్‌స్టర్ల అంతు చూస్తుంటాడు.

Bagheera Movie Review in Telugu  Sri Murali action drama of Prashanth Neel s Mass elements

మంగళగిరిలో ఉద్యోగంలో చేరిన వేదంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని పరిష్కరించే విషయంలో ఎలా విఫలమయ్యాడు? అన్యాయాలు, అక్రమాలను ఎదురించడానికి వచ్చిన భఘీరా ఎవరు? వేదంగ్‌కు బఘీరాకు సంబంధమేమిటి? బఘీరా పోలీస్ శాఖకు, ఉన్నతాధికారి (ప్రకాశ్ రాజ్)కు ఎలా ఛాలెంజ్‌గా నిలిచాడు. తాను ప్రాణంగా ప్రేమించిన లవర్ డాక్టర్ (రుక్మిణి వసంత్)‌ను ఎందుకు దూరం చేసుకొన్నాడు? బఘీరా దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో కర్ణాటక పోలీస్ శాఖ సఫలమైందా? నేరస్థులకు చెక్ పెట్టే విషయంలో బఘీరా సక్సెస్ అయ్యాడా? అనేది ఈ సినిమా కథ.

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ అందించిన ఇండియన్ సూపర్ హీరో కథను పూర్థిస్థాయి మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మార్చడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు సూరి. అయితే సింగిల్ పాయింట్ ఎజెండాతో కథను నడిపించడం వల్ల బోర్‌గా, రొటీన్‌గా అవుతుంది. కానీ అత్యంత హింసాత్మకంగా బఘీరా హత్యలు చేయడం మాస్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం కనిపించింది. అయితే కథలో వేరియేషన్, సైడ్ ట్రాక్ లేకపోవడం, శ్రీ మురళి, రుక్మిణికి మధ్య రొమాన్స్, లవ్ ట్రాక్ స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచన చేయకపోవడం మైనస్‌ అనిపిస్తుంది. అలాగే తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఊచకోత కోయడం అతిగా అనిపిస్తుంది.

ఇక సూపర్ హీరో క్యారెక్టర్‌లో వేదాంగ్‌గా శ్రీ మురళీ మాస్ ఎలివేషన్స్‌తో అదరగొట్టాడనే చెప్పాలి. యాక్షన్ ఎపిసోడ్స్‌లో కేక పెట్టించే బాడీ లాగ్వేంజ్ చూపించాడు. ఇక బఘీరాగా ట్విస్ట్ ఇచ్చి సినిమా భారాన్నంతా తనపైనే మోశారు. రుక్మిణి వసంత్ తనకు లభించిన స్పేస్‌ను చక్కగా వినియోగించుకోవడమే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. ప్రకాశ్ రాజ్, అచ్యుత్ రొటీన్ క్యారెక్టర్లకే పరిమితమయ్యారు. రామచంద్ర రాజు విలన్ రానాగా భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆయన లుక్, పెర్ఫార్మెన్స్ కారణంగా శ్రీ మురళీ కూడా విజృంభించే అవకాశం దక్కింది.

Bagheera Movie Review in Telugu  Sri Murali action drama of Prashanth Neel s Mass elements

బఘీరాకు సాంకేతిక అంశాలు కూడా బలంగా కనిపించాయి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, ఏజే శెట్టి సినిమాటోగ్రఫి సినిమాను నిలబెట్టేలా చేశాయి. యాక్షన్, ఎమోషనల్ ఎపిసోడ్స్‌కు అజనీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ప్రమాణాలకు అనుగుణంగా విజయ్ కిరంగదూర్ పాటించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో మాస్, యాక్షన్, థ్రిల్లర్‌, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం బఘీరా. ఈ సినిమా ఎమోషన్స్ పూర్తి స్థాయిలో పండకపోవడం.. కథలో బలం లేకపోవడం వల్ల చాలా వరకు ఈ మూవీ తేలిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మాస్ ఆడియెన్స్ కావాల్సిన అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. శ్రీమురళీ పెర్ఫార్మెన్స్, రుక్మిణి వసంత్ గ్లామర్ మెప్పించేలా ఉంటుంది. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X