Bakasura Restaurant Movie Review: బకాసుర రెస్టారెంట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: కమెడియన్ ప్రవీణ్, హర్ష చెముడు, శ్రీకాంత్ అయ్యంగార్, షైనింగ్ ఫణి, గురుడ రామ్, వివేక్ దండు, షైన్ రమ్య, ప్రాచీ థాకేర్ తదితరులు
దర్వకత్వం: ఎస్‌జే శివ
నిర్మాతలు: లక్ష్మయ్య చారి, చారీ జెన్నీ
బ్యానర్: ఎస్‌జే మూవీస్
సినిమాటోగ్రఫి: బాల సరస్వతి
మ్యూజిక్: వికాస్ బడిస
ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్
ఆర్ట్స్: శ్రీరాజా సీఆర్
రిలీజ్ డేట్: 2025-08-08
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే పరమేశ్ (కమెడియన్ ప్రవీణ్) తన జాబ్ విషయంలో అసంతృప్తిగా ఉంటాడు. నలుగురు స్నేహితులతో కలిసి హైదరాబాద్ నగర శివారులోని బోల్లారంలోని ఓ రూమ్‌లో జీవితాన్ని గడుపుతుంటాడు. డబ్బు సంపాదించి రెస్టారెంట్ పెట్టాలనే కోరికతో ఉంటాడు. అందుకు డబ్బు సంపాదించేందుకు ఓ ప్లాన్ చేసి యూట్యూబ్ వీడియోలను క్రియేట్ చేయాలనుకొంటారు. ఆ క్రమంలో తన ఇంటిలోకి వచ్చిన నిమ్మకాయ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. తీరా ఆరా తీస్తే.. నిమ్మకాయలో ఆత్మ ఉందని తెలుస్తుంది.

పరమేశ్ ఉద్యోగం విషయంలో ఎందుకు అసంతృప్తిగా ఉంటాడు? రెస్టారెంట్ ఎందుకు పెట్టాలనుకొంటాడు? నిరుద్యోగంతో బాధపడే తన స్నేహితులకు ఎలా అండగా నిలుస్తాడు. బక్క సూరి (వైవా హర్ష) బకాసురగా ఎందుకు మారాడు? నిమ్మకాయంలో ఆత్మ ఎందుకు ఉంది? నిమ్మకాయలో ఉండే ఆత్మ ఎవరిది? తమ వెంట పడిన ఆత్మను పరమేశ్ ఫ్రెండ్స్ ఎలా సంతృప్తి పరిచారు అనే ప్రశ్నలకు సమాధానమే బకాసుర రెస్టారెంట్ సినిమా కథ.
బకాసుర రెస్టారెంట్ అనే టైటిల్ అనగానే.. ఫుడ్, ఎమోషన్స్ అనే విషయాలు గుర్తుకు వస్తాయి. అయితే అందుకు తగినట్టుగానే ట్రైలర్, ప్రమోషన్స్ కూడా అలాంటి ఫీలింగ్‌ను కలుగ జేశాయి. కామెడీ టచ్ ఉండే మూవీ అని తొలుత అర్ధమవుంతుంది. ఇక థియేటర్‌లో అడుగుపెట్టిన తర్వాత అదే ఫీలింగ్‌తో జర్నీ మొదలువుతుంది కూడా. అయితే ఎస్‌జే శివ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు బాగుంటాయి. కొన్ని ఫర్వాలేదనిప్తాయి. మరొకొన్ని ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేస్తే బాగుండేది. మరికొన్ని సీన్లు కథకు అడ్డుపడుతున్నాయనే మిక్స్‌డ్ ఫీలింగ్‌తో సాగుతాయి. అయితే సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌తో ఎమోషన్స్ పడించిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఆ ఎమోషన్స్‌ను గ్రిప్పింగ్‌గా కొనసాగించలేకపోవడం కొంత అసంతృప్తిని కలుగచేస్తుంది. కానీ మంచి క్లైమాక్స్‌తో అసంతృప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకొన్న ప్రయత్నం కనిపిస్తుంది.
ఇందులో నటించిన ప్రవీణ్, హర్ష, షైనింగ్ ఫణి తదితరులు కమెడియన్లుగా పాపులారిటీ సాధించిన వారే. కానీ కామెడీని కాకుండా ఎమోషనల్ కంటెంట్‌ను కూడా పండించడంలో తామేమీ తక్కువ కాదని ఈ సినిమాలో నిరూపించుకొన్నారు. ప్రవీణ్, వైవా హర్ష ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్పిన పనిలేదు. ఎమోషనల్ సీన్లను నేచురల్ చేశారు. వారి పాత్రల్లో ఒదిగిపోయి చాలా బాగా చేశారు. ఫణి, కేజీఎప్ గరుడ ఇతరులు పర్వాలేదనిపించారు. బాలసరస్వతి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. వికాస్ మ్యూజిక్ హుషారుగా సాగింది. మార్తాండ్ వెంకటేష్ అనుభవం ఈ సినిమాకు బాగా పనికి వచ్చింది. ఆర్ట్ వర్క్ నీట్‌గా ఉంది. లక్ష్మయ్య చారి, చారీ జెన్నీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
బకాసుర రెస్టారెంట్ మూవీ కేవలం ఫన్ మూవీ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే డిఫరెంట్ పాయింట్. దర్శకుడు కొత్తవాడైనా బాగా డీల్ చేశాడు. కొన్ని చోట్ల అనుభవరాహిత్యం కనిపిస్తుంది. నటీనటులంతా ఈ సినిమాను ఫీల్ గుడ్‌గా మార్చారు. ఈ వారం ఫీల్ గుడ్‌తో సాగే చిన్న సినిమాలను చూడాలనుకొనే వారు.. అంచనాలు లేకుండా వెళ్తే.. బకాసుర రెస్టారెంట్ ఎంటర్‌టైన్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











