Balagam movie review గుండెను పిండేసే ఫ్యామిలి ఎంటర్‌టైనర్.. వేణు దర్శకత్వం ఎలా ఉందంటే?

Rating: 3/5

నటీనటులు: ప్రియదర్శి పులికొండ, కావ్య కల్యాణ్ రామ్, రచ్చ రవి, AK47 సత్యం, టిల్లు వేణు, మురళీధర్ తదితరులు
దర్శకత్వం: టిల్లు వేణు యెల్దండి
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి
మ్యూజిక్: బీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫి: ఆచార్య వేణు
బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2023-03-03

బలగం కథ ఏమిటంటే?

బలగం కథ ఏమిటంటే?

వయసు పైబడిన గాజుల కనకయ్య (సుధాకర్ రెడ్డి) మాటల్లో చిలిపితనం, రొమాన్స్ ఏ మాత్రం కొదువ ఉండదు. ఊర్లో చిన్న పిల్లల నుంచి వయసున్న మహిళలతో సరదాగా పరాచకాలు ఆడుతుంటాడు. పైకి సంతోషంగా కనిపించినా జీవితంలో ఏదో వెలితి కారణంగా మనో వేధనకు గురయ్యే కనకయ్య ఉన్నట్టుండి చనిపోతాడు. జీవితంలో ఏనాడు పెద్దగా పట్టించుకొని కనకయ్య కొడుకులు అయిలయ్య, మొగిలయ్య (మైమ్ మధు), కూతురు లక్ష్మీ కుటుంబాలు కలిసి కనకయ్య అంత్యక్రియలు చేస్తారు.

బలగం సినిమాలో ట్విస్టులు

బలగం సినిమాలో ట్విస్టులు

అయితే కనకయ్య మరణం తర్వాత మూడొద్దులు, ఐదొద్దులు సమయంలో పిండాలను పిట్ట ఎందుకు ముట్టలేదు? తండ్రికి పిండం పెడితే.. కాకి ముట్టకపోతే ఆ కుటుంబంలో ఏం జరిగింది? తండ్రికి కూతురు లక్ష్మీ ఎందుకు దూరంగా ఉంది? తండ్రి మరణం తర్వాత అన్నదమ్ములు, చెల్లెలు మధ్య ఎందుకు అభిప్రాయబేధాలు తలెత్తాయి. అయిలయ్య కొడుకు సాయిలు ఎందుకు అప్పుల పాలయ్యాడు? తాత మరణాన్ని కష్టాల నుంచి గట్టెక్కడానికి ఏం చేశాడు.

తన అత్త లక్ష్మీ కూతురు సంధ్యను ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని సాయిలు (పులికొండ ప్రియదర్శి) పరిష్కరించేందుకు ఏం చేశాడు? చివరకు కనుకయ్య పిండాలను పిట్ట ముట్టిందా? అనే ప్రశ్నలకు సమాధానమే బలగం సినిమా కథ.

బలగం ఫస్టాఫ్‌ ఎలా సాగిందంటే?

బలగం ఫస్టాఫ్‌ ఎలా సాగిందంటే?

కనకయ్య క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త సమయం ఎక్కువగా తీసుకోవడం ద్వారా బలగం సినిమా స్లోగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. కనుకయ్య ఆకస్మిక మరణంతో మనవడు సాయిలుకు రకరకాల కష్టాలు తెచ్చిపెడుతుంది.

కనకయ్య పెద్ద కొడుకు అయిలయ్య, చిన్న కొడుకు మొగిలయ్య, కూతురు లక్ష్మీ, అల్లుడు నారాయణ (మురళీధర్), మనవరాలు సంధ్య (కావ్య కల్యాణ్ రామ్) క్యారెక్టర్లు ఎంట్రీ ఇవ్వడం, అంత్యక్రియల వ్యవహారాన్ని చాలా డిటైలింగ్‌తో, అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను వివరంగా చెప్పడంతో కొంత డాక్యుమెంటరీగా అనిపిస్తుంది. రకరకాల భావోద్వేగాలతో కథ సాగుతూ.. మంచి ఎమోషనల్ పాయింట్‌తో ఫస్టాఫ్ ముగించి సెకండాఫ్‌పై ఆసక్తిని రేపడంలో దర్శకుడు వేణు సక్సెస్ అయ్యాడు.

బలగం సెకండాఫ్ భావోద్వేగంగా

బలగం సెకండాఫ్ భావోద్వేగంగా

అయితే సెకండాఫ్ మొదలైన తర్వాత కూడా కథ స్లోగా, క్యారెక్టర్ల మధ్య పోట్లాటలు, పిండాలను పిట్ట ముట్టకపోవడం లాంటి అంశాలు ఓ వైపు హాస్యాన్ని పండించేలా, మరో వైపు భావోద్వేగాలను పండించేలా కథ, కథనాలు రాసుకోవడంలో దర్శకుడు వేణు తన ప్రతిభను చాటుకొన్నాడు. చివరి 20 నిమిషాలు మాత్రం వేణు గుండెను పిండేసేంత పనిచేశాడు. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకుడు భారంగా బయటకు వచ్చేలా చేయడంలో గొప్ప అనుభవం ఉన్న దర్శకుడిలా వేణు కనిపిస్తాడు.

 దర్శకుడు వేణు టేకింగ్

దర్శకుడు వేణు టేకింగ్

కనకయ్య పాత్ర ఉండేది కాసేపైనా.. సినిమా మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలోను, ఆ పాత్ర చుట్టూ కథ తిరగడంతో ఆ పాత్రను వేసిన నటుడిపైనే ఫోకస్ ఉంటుంది. ఇక అయిలయ్య, మొగిలయ్య, నారాయణ పాత్రల మధ్య సంఘర్షణను వేణు అద్బుతంగా పండించాడు. చావు అనే ఒక విషాదం చుట్టూ వినోదాన్ని కూడా చాలా సెన్సిబుల్‌గా పుట్టించాడు. బలగం సినిమా చూస్తే.. తొలి చిత్ర దర్శకుడు తీశాడంటే ఎవరూ నమ్మరంటే నిజం అనిపిస్తుంది.

ప్రియదర్శి ఫెర్ఫార్మెన్స్

ప్రియదర్శి ఫెర్ఫార్మెన్స్

సాయిలు పాత్రలో కనిపించిన ప్రియదర్శి పలు రకాల ఎమోషన్స్, ఫెర్ఫార్మెన్స్‌కు పూర్తి స్థాయిలో స్కోప్ ఉన్న చిత్రంలో నటించాడు. కథ భారాన్ని మొత్తం ప్రియదర్శి తన భుజాలపై మోశాడు. వినోదం, సెంటిమెంట్, ఎమోషన్స్ రకరకాల కోణాల్లో అద్బుతంగా నటించాడు. కావ్య కల్యాణ్ రామ్ పాత్ర పరిధి తక్కువైనా కథకు బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కావ్య తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారని చెప్పవచ్చు.

బలగంగా బలంగా నిలిచిన క్యారెక్టర్లు

బలగంగా బలంగా నిలిచిన క్యారెక్టర్లు

మిగితా పాత్రల్లో విషయానికి వస్తే.. నారాయణ పాత్రలో కనిపించిన మురళీధర్ గతంలో డీజే టిల్లులో తండ్రి పాత్రతో మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ బలగం సినిమాలో ప్రధానమైన పాత్రలో ఇతర నటీటనులుతో పోటాపోటీగా నటించాడు. చాలా సహజత్వంతో మన ఇంట్లో మామ, బాబాయ్‌లా కనిపించేలా తన పాత్రను మురళీధర్ పోషించాడు. ఇక రచ్చ రవి మరోసారి కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించాడు.

కథను ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మార్చడంలో రచ్చ రవి విజయ్ పాత్రలో అంతర్లీనంగా బలమైన పాత్రగా కనిపిస్తాడు. మరోసారి ఫుల్ లెంగ్త్ పాత్రలో రచ్చ రవి మంచి ఎమోషన్స్ పలికించాడు. లక్ష్మీ, అయిలయ్య, ఇతర పాత్రలతోపాటు ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు అద్బుతంగా తెరపైన రాణించారు.

బలగం మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి

బలగం మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే... బలగం సినిమాకు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో వెన్నుముకగా నిలిచాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రేమే కాకుండా అద్బుతమైన పాటలతో ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచాడు. పాటల్లో కూడా భావోద్వేగాన్ని నింపి ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు.

ఇక సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు తెలంగాణ నేటివిటినీ, పాత్రల భావోద్వేగాలను కెమెరాలో బంధించిన తీరు అమోఘంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో మాటలు, ఎమోషనల్ సీన్లను తూకం వేసినట్టు ప్రతీ ఫ్రేమ్‌లో దట్టించడంలో వేణు సక్సెస్ అయ్యాడు.

క్లైమాక్స్‌లో వేణు పాడిన పాట ప్రతీ ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా ఉంటుంది. రామ్ మిరియాల పాడిన పాటలు కూడా ఆడియోపరంగానే కాకుండా తెర మీద కూడా అద్బుతంగా ఉన్నాయి

బలగం ఫైనల్‌గా ఎలా ఉందంటే?

బలగం ఫైనల్‌గా ఎలా ఉందంటే?

చావును కూడా పండుగలా చేసే తెలంగాణలోని మట్టి వాసనను, మట్టి మనుషుల ఎమోషన్స్‌ను చెప్పే సినిమా బలగం. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో చావు సమయంలో ఆచరించే సంప్రదాయాలు, సంస్కృతి తదితర అంశాలు కళ్లకు కట్టినట్టుగా సజీవంగా తెరపైన కనిపిస్తాయి. చరిత్రలో కనిపించకుండా పోతున్న ఒగ్గు కథ, ఒళ్లు పట్టే సీన్లు తెలంగాణ వాసులను తమ జీవితానికి సంబంధించిన గతంలోకి లాక్కెలుతాయి.

ప్రతీ పాత్ర మన ఊర్లో పక్కింటిలో కనిపించే మనుషుల్లో ఉండే సహజత్వంతో, భోళాతనం, మొండితనం, పట్టింపులు వాస్తవాలను గుర్తు చేస్తాయి. బలగం సినిమా చూస్తున్నంత సేపు కొన్నేళ్ల క్రితం మన ఊరిలో, మన కుటుంబంలో జరిగిన విషయాలను తిరిగి దర్శనం చేసుకొన్నట్టు అనిపిస్తుంది. పక్కా తెలంగాణ ఎమోషన్స్ పలికించే సినిమా ఆంధ్రాలో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా అనే ప్రశ్న వినిపించడం ఖాయం.

కాకపోతే ఎమోషన్ ఎవరికైనా ఎమోషన్. తెలుగు ప్రజల గుండెను తట్టిలేపే సినిమా బలగం. సినిమా కాదు.. కొన్ని జీవితాలను చూసిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా బలగంతోపాటు వెళ్లి చూడదగిన సినిమా ఇది. డోంట్ మిస్. మస్ట్ వాచ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X