twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Review అఖండగా బాలకృష్ణ నట శివ తాండవం.. బోయపాటి టేకింగ్ అదుర్స్!

    |

    Rating:
    3.0/5
    Star Cast: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, సాయికుమార్
    Director: బోయపాటి శ్రీను

    నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్‌ సిద్ధమైంది. టీజర్లు, ట్రైలర్లు భారీ హైప్ సాధించాయి. దాంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బోయపాటికి, బాలకృష్ణకు హ్యాట్రిక్ లభించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలను సమీక్షించాల్సిందే...

    అఖండ సినిమా కథ ఇలా

    అఖండ సినిమా కథ ఇలా


    రాయలసీమలో ఫ్యాక్షన్‌ వ్యవహారాలకు ముగింపు పలికేందుకు కంకణం కట్టుకొని, శాంతి స్థాపన కోసం ప్రయత్నించే అనంతపురం జిల్లాకు చెందిన రైతు మురళీ కృష్ణ (బాలకృష్ణ). రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రాణాలకు లెక్క చేయకుండా ఆదుకొంటాడు. అదే జిల్లాకు కలెక్టర్‌గా శరణ్య (ప్రగ్యా జైస్వాల్) వస్తుంది. మురళీకృష్ణ చేసే మంచిపనులు చూసి అతడిని ఇష్టపడుతుంది. మురళీకృష్ణపై ఇష్టం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్తుంది. ఆ క్రమంలో మురళీకృష్ణ, శరణ్య దంపతులకు చిన్నారి కూడా పుడుతుంది. ఈ నేపథ్యంలో అక్రమంగా గనుల తవ్వకాలతో మాఫియాగా ఎదిగిన వరదరాజన్ (శ్రీకాంత్)‌ అరాచకాలకు మురళీకృష్ణ అడ్డుగా నిలుస్తాడు. అయితే ఆ ప్రాంతంలో రాజకీయ పలుకుబడి ప్రభావంతో ఓ కేసులో మురళీకృష్ణను అరెస్ట్ చేస్తారు. స్రవణ్యపై సస్పెన్షన్ వేటు వేస్తారు. ఇక మురళీకృష్ణ కూతురును చంపడానికి ప్రయత్నిస్తారు.

    అఖండ మూవీలో ట్విస్టులు

    అఖండ మూవీలో ట్విస్టులు

    అఖండ సినిమా కథలో అఖండ ఎవరు? అఖండ అఘోరాగా మారడానికి కారణం ఏమిటి? అనంతపురం జిల్లాకు అఖండ రావడానికి కారణం ఏమిటి? కష్టాల్లో ఉన్న మురళీకృష్ణ కుటుంబాన్ని, కూతురును ఎవరు కాపాడారు? మురళీకృష్ణకు అఖండకు సంబంధమేమిటి? వరదరాజన్‌ అక్రమాలకు, అరాచకాలకు అఖండ ఎలా ముగింపు పలికాడు? వరదరాజన్‌కు మురళీకృష్ణకు వైరం ఎందుకు ఏర్పడింది? ఇక జగపతిబాబు, సాయికుమార్, ప్రభాకర్ తదితర పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు తెరపైన సమాధానం అఖండ సినిమా కథ.

    హీరో ఎలివేషన్ సీన్లతో ఫస్టాఫ్

    హీరో ఎలివేషన్ సీన్లతో ఫస్టాఫ్


    అఖండ పుట్టుక గురించిన ఓ ఎమోషనల్ సీన్‌తో అసలు కథ మొదలవుతుంది. రైతులకు అండగా నిలిచే మురళీకృష్ణ సన్నివేశంతో హీరో ఎలివేషన్ గ్రాండ్‌గా లాంచ్ అవుతుంది. ఆ తర్వాత మురళీకృష్ణ, శరణ్య లవ్ ట్రాక్‌‌తో సినిమా ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు యాక్షన్ సీన్లు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంతో అఖండ బ్లాక్ బస్టర్‌ వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక అఖండ ఎంట్రీతో ఇంటర్వెల్ బ్యాంగ్‌ అదిరిపోయినట్టు కనిపిస్తుంది. హీరోయిజం, హీరో ఎలివేషన్ షాట్స్, శివ నామస్మరణ, హిందూ సంప్రదాయాలతో కూడిన సన్నివేశాలు రోమాలు నిక్కపొడిచేలా చేస్తాయి.

    సెకండాఫ్‌లో మితిమీరిన హింస

    సెకండాఫ్‌లో మితిమీరిన హింస

    అఖండ సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశంలోనే అఖండ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయం స్పష్టమవుతుంది. ప్రతీ పది నిమిషాలకు యాక్షన్ సీన్లు, సెంటిమెంట్, శివుడికి సంబంధించిన ఎమోషనల్ సీన్లు సీన్ సీన్‌కు హైలెట్‌ అవుతూ కథ ట్రావెల్ అవుతుంది. వరదరాజుల అక్రమ వ్యవహారాలకు చెక్ పెట్టిన తర్వాత కథ ముగిసిందనుకొనే ప్రేక్షకులకు మరో భావోద్వేగమైన ఎపిసొడ్‌తో గుండెను పిండేసే సీన్లు వస్తాయి. అయితే సెకండాఫ్‌లో హింస మితిమీరినట్టు కనిపిస్తుంది.

    దర్శకుడు బోయపాటి శ్రీను గురించి

    దర్శకుడు బోయపాటి శ్రీను గురించి

    దర్శకుడు బోయపాటి విషయానికి వస్తే.. నందమూరి అభిమానులకు పంచభక్ష పరమాన్నం పంచిపెట్టేలా అఖండ కథను అల్లుకొన్నాడు. ప్రతీ పది నిమిషాలకు బోయపాటి తన మార్క్ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో సినిమాను లేపుకొంటూ వెళ్లాడనిపిస్తుంది. కథను పట్టించుకోకుండా హీరోయిజంపైనే ఆధారపడినట్టు కనిపిస్తుంది. ఫార్మర్ మాత్రమే కాదు.. రిఫార్మర్ లాంటి పిడుగుల్లాంటి డైలాగ్స్ కోకొల్లలు. సినిమా అంతా డైలాగుల వర్షమే కనిపిస్తుంది. హీరోయిజానికి పరాకాష్టగా అఖండ పాత్ర కనిపిస్తుంది. నందమూరి అభిమానులకు ఏం కావాలో అలాంటి కథను ఫుల్ మీల్‌లా పెట్టాడనిపిస్తుంది. అఖండ పాత్ర కోసం చేసిన రీసెర్చ్‌తోనే బోయపాటి సక్సెస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది.

    వెండితెరపై సరికొత్త బాలయ్య ఆవిష్కరణ

    వెండితెరపై సరికొత్త బాలయ్య ఆవిష్కరణ

    బాలకృష్ణ రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీన్లలో శివతాండవం చేశాడనిపిస్తుంది. అఖండకు ముందు బాలకృష్ణ ఒక ఎత్తు.. అఖండ తర్వాత బాలయ్య మరో ఎత్తు అనే విధంగా తెరపైన నట విన్యాసాలు చేశాడు. కథ నుంచి డీవియేట్ కాకుండా పాత్ర మాత్రమే కనిపించే విధంగా బాలయ్య నటన ఉంటుంది. అఖండ పాత్రలో తెర మీద సరికొత్త బాలయ్యను చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది.

    అందం, అభినయంతో ప్రగ్యా జైస్వాల్

    అందం, అభినయంతో ప్రగ్యా జైస్వాల్

    జిల్లా కలెక్టర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అందం, అభినయాన్ని ప్రదర్శించింది. ఎమోషనల్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఒదిగిపోయింది. ఇక వరదరాజులుగా శ్రీకాంత్ డిఫరెంట్ పాత్రలో విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన శ్రీకాంత్ అసలే కనిపించడు. పాత్ర మాత్రమే కనిపించేలా శ్రీకాంత్ యాక్టింగ్ చేశాడు. మిగితా పాత్రలు చాలా ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా కథకు అత్యంత బలంగా మారుతాయి. సుబ్బరాజు పాత్ర చిన్నదైనా ఆకట్టుకునేలా ఉంటుంది. బాహుబలి ప్రభాకర్‌కు పోలీస్ ఆఫీసర్‌గా మంచి పాత్ర లభించింది.

    మ్యూజిక్‌తో అదరగొట్టిన తమన్

    మ్యూజిక్‌తో అదరగొట్టిన తమన్

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అఖండ సినిమాకు అత్యంత బలం తమన్ మ్యూజిక్. జై బాలయ్య, అడిగా అడిగా పాటలు బాగున్నాయి. పాటల కంటే ప్రతీ సీన్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రచ్చ రంబోలా అని చెప్పవచ్చు. ఇక సీ రాం ప్రసాద్ సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ సీన్లు రోమాలు నిక్కబొడిచేలా షూట్ చేశారు. అఖండగా బాలయ్య పాత్ర ఎమోషన్స్‌ను చక్కగా కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా ఏం రత్నం డైలాగ్స్ బాంబుల్లా పేలాయి. కోటిగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రూపొందించారనేది ప్రతీ సన్నివేశం తెలియజేస్తుంది. కథ డిమాండ్ మేరకు అద్బుతంగా సెట్స్ రూపొందించారు. పాత్రలకు తగినట్టుగా నటీనటులు ఎంపిక సినిమాపై నిర్మాతకు ఉన్న అభిరుచి కనిపిస్తుంది. ఈ సినిమాలో ఉన్నత ప్రొడక్షన్ వ్యాల్యూస్ కనిపిస్తాయి.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    నందమూరి అభిమానులకే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా నచ్చే అంశాలతో రూపొందిన చిత్రం అఖండ. మితి మీరిన హింస, యాక్షన్ సీన్లు, ఫైట్స్ కథను డామినేట్ చేసినట్టు కనిపిస్తాయి. కథలో కొత్తదనం కనిపించదు. కానీ డైరెక్టర్ టేకింగ్‌ కారణంగా సినిమా ఫ్యాన్స్‌కు పండుగలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ తీసుకొన్న క్రియేటివ్ లిబర్టీ కారణంగా కొన్ని సీన్లలో అతి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. రక్తం మరక అంటని పాత్ర దాదాపు కనిపించదు. విపరీతమైన రక్తపాతం సినిమాకు కొంత మైనస్‌గా మారింది. విచక్షణ లేకుండా అఖండ మారణహోమం చేయడం వల్ల భావోద్వేగ అంశాలకు అడ్డుకట్ట వేసినట్టు అనిపిస్తుంది.
    అయితే అఖండ క్యారెక్టర్‌ను డిజైన్, బ్యాలెన్స్ చేసిన విధానం బాగుంటుంది. అలాగే క్లైమాక్స్‌లో పాపతో చేయించిన హై ఇంటెన్స్ సీన్లు హృదయాన్ని పిండేస్తాయి. ఓవరాల్‌గా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లస్ పాయింట్స్
    ఫస్టాఫ్
    హీరో ఎలివేషన్ షాట్స్
    అఖండ పాత్ర
    సెంటిమెంట్ సీన్లు
    ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్

    మైనస్ పాయింట్స్
    రొటీన్ ఎలిమెంట్స్
    మితిమీరిన హింస
    సెకండాఫ్‌లో కొంత భాగం

    Recommended Video

    Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, సాయికుమార్, ప్రభాకర్, తదితరులు
    దర్శకత్వం: బోయపాటి శ్రీను
    నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
    డైలాగ్స్: బోయపాటి శ్రీను, ఎం రత్నం
    మ్యూజిక్: ఎస్ థమన్
    సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    ప్రొడక్షన్స్ కంపెనీ: ద్వారక క్రియేషన్స్
    డిస్ట్రిబ్యూషన్: పెన్ స్టూడియోస్
    రిలీజ్ డేట్: 2021-12-02

    English summary
    Akhanda is action drama film written and directed by Boyapati Srinu. Produced by Dwaraka Creations, the film stars Nandamuri Balakrishna, Pragya Jaiswal, Jagapathi Babu‚ Avinash and Srikanth. This movie released on 2 December 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X