For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Balamevvadu movie review మెడికల్ మాఫియాపై సినీ అస్త్రం.. లవ్, ఎమోషన్స్‌తో!

  |

  Rating:
  2.5/5
  Star Cast: ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృథ్వీరాజ్, నాజర్, సుహాసిని మణి రత్నం
  Director: సత్య రాచకొండ

  నటీనటులు: ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృథ్వీరాజ్, నాజర్, సుహాసిని మణి రత్నం, శ్రావణ్ భరత్, మోహన్ కాంత్, జబర్దస్త్ అప్పారావు, మణి మహేష్ తదితరులు
  బ్యానర్: సనాతన దృశ్యాలు
  నిర్మాత: ఆర్ బీ మార్కండేయలు
  కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం: సత్య రాచకొండ
  సంగీతం: మణిశర్మ
  డీవోపీ: సంతోష్, గిరి
  ఎడిటర్: జస్విన్ ప్రభు
  లిరిక్స్: కళ్యాణ్ చక్రవర్తి
  గాయకులు: ఎం. ఎం. కీరవాణి, అనురాగ్ కులకర్ణి
  ఫైట్ మాస్టర్: శివరాజ్
  పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

  ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా ఉద్యోగం చేసే సత్యనారాయణ అలియాస్ సత్య (ధవన్ కటకం) క్లాసికల్ డ్యాన్సర్‌ పరిణిక అలియాస్ పారు (నియా త్రిపాఠి)తో తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. ఓ సంఘటన వారిద్దరిని మరింత దగ్గరకు చేస్తుంది? పీకల్లోతు ప్రేమలో ఉన్న సమయంలో పారుకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని విషయం బయటపుడుతుంది. క్యాన్సర్ బారిన పడిన సత్యకు మానసిక స్థైర్యం కలిగించడానికి, ఆమెకు అండగా నిలవడానికి పారు మెడలో తాలి కడుతాడు.

  Balamevvadu

  క్యాన్సర్‌తో బాధపడుతూ హస్పిటల్‌కు వచ్చిన సత్య, పరిణికకు డాక్టర్ ఫణిభూషణ్ అలియాస్ పీబీ (పృథ్వీరాజ)కు ఎదురైన చేదు అనుభవం ఏంటి? మెడికల్ మాఫియాతో చేతులు కలిపిని పీబీకి తగిలిన షాక్ ఏమిటి? మాఫియా ముసుగులో వైద్యాన్ని వ్యాపారంగా మలిచిన పీబీకి బలం ఎవ్వరు? పీబీకి సత్య ఎలా బుద్ది చెప్పాడు? పీబీకి యశోద (సుహాసిని మణిరత్నం)ఎలాంటి షాక్ ఇచ్చింది? హాస్పిటల్ ఓనర్ (నాజర్) కథలో ఎలాంటి కీలకపాత్రను పోషించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బలమవ్వెడు సినిమా కథ.

  దర్శకుడు సత్య రాచకొండ రాసుకొన్న ప్రధానమైన పాయింట్ బాగుంది. కథను విస్తరించిన తీరు, పాత్రలను కథలో జొప్పించిన విధానం బాగుంది. అయితే అనుభవ లేమి కారణంగా కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లే క్రమంలో కొంత తడబాటు కనిపిస్తుంది. దర్శకుడిగా కొత్త వాడైనా సుహాసిని, నాజర్, పృథ్వీరాజ్‌ లాంటి సీనియర్లను డీల్ చేసిన విధానం, వారి నుంచి పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న విషయంలో సక్సెస్ అయ్యారు. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. సినిమాకు ప్రతికూలంగా మారలేదని చెప్పవచ్చు.

  మిడిల్ క్లాస్ యువకుడిగా, ప్రియురాలి కోసం ఎంతకైనా తెగించే ప్రియుడిగా, అన్యాయాన్ని ఎదురించే పౌరుడిగా పలు వేరియేషన్స్ ఉన్న సత్యనారాయణ పాత్రలో ధృవన్ ఒదిగిపోయాడు. సున్నితమైన రొమాంటిక్ సీన్లలో, ఎమోషన్ సన్నివేశాల్లో ఆకట్టుకొన్నాడు. కొన్ని చోట్ల అనుభవలేమి కనిపించినా పలు సీన్లలో ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. క్యాన్సర్ పేషెంట్‌గా, ప్రియురాలిగా పరిణిక బెటర్‌గా నటించింది. నిజాయితీతో కూడిన డాక్టర్‌ యశోద పాత్రలో సుహాసిని ఇంటెన్సివ్‌గా నటించించింది. రాఖీ సినిమా తర్వాత మరోసారి పవర్‌ఫుల్‌గా ఆకట్టుకొన్నది. విలన్ షేడ్‌తో డాక్టర్ పీబీ పృథ్వీరాజ్ నటన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. నాజర్ పాత్ర అతిథి పాత్రగా ఉన్నప్పటికీ.. గుర్తుండిపోయే పాత్రలో నటించాడు. మిగితా నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు.

  Balamevvadu movie review

  ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. రీరికార్డింగ్‌తో పలు సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చాడు. పాటలు కూడా బాగున్నాయి. కీరవాణి చేత పాడించిన పాట బాగుంది. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. సంతోష్, గిరి సినిమాటోగ్రఫి బాగుంది. జస్విన్ ప్రభు ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. శివరాజ్ అందించిన ఫైట్స్ బాగున్నాయి. ఆర్ బీ మార్కండేయలు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథను ఎంచుకొన్న విధానం.. పాత్రలకు నటీనటుల ఎంపిక సినిమాపై ఆయన అభిరుచిని తెలియజెప్పింది. కథ, కథనాలపై కొంత కసరత్తు చేసి ఉంటే మెడికల్ మాఫియాపై వచ్చిన మరో మంచి చిత్రంగా మారి ఉండేది.

  లవ్, ఎమోషన్స్, వైద్యం పేరుతో చేసే అక్రమాలు, అన్యాయాలు కలబోసిన సినిమా బలమవ్వడు. పలు అంశాలను దర్శకుడు చక్కగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. మ్యూజిక్, సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్. మెడికల్ మాఫియా నేపథ్యంగా వచ్చ సినిమాలను ఆదరించే వారికి సినిమా తప్పకుండా నచ్చుతుంది.

  English summary
  Balamevvadu movie is based on medical mafia in the society. Dhruvan, Nia, Nassar, Suhasini are in lead. Here is the, Telugu Filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X