Balan: The Boy Movie Review: బాలన్: ది బాయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: ఆదిశేషన్ కేఆర్, ఫర్జానా పాలథింగల్, జినన్, జీన్ పాల్ లాల్, గిరిష్ ఏడీ, టొవినో థామస్ (అతిథి పాత్రలో) తదితరులు
దర్శకత్వం: చిదంబరం
బ్యానర్: కేవీఎన్ ప్రొడక్షన్స్
నిర్మాత: వెంకట్ కే నారాయణ (KVN)
సహ నిర్మాత: శైలజా దేశాయ్ ఫెన్,
రచన: జితూ మహాదేవన్,
మ్యూజిక్: సుషిన్ శ్యామ్, శైజు ఖాలీద్,
ఎడిటర్: వివేక్ హర్షన్,
ప్రొడక్షన్ డిజైనర్: అజయన్ చెల్లిస్సెరీ
రిలీజ్ డేట్: 2026-06-19

మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవించిన మేరి లుకా (ఫర్జానా పాలథింగల్) జైలులోనే బిడ్డకు జన్మనిస్తుంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత కొడుకు వాసుదేవ్ (ఆదిశేషన్ కేఆర్)తో కలిసి బయటకు వస్తుంది. తమ ఐడెంటిటీ గురించి తెలియకుండా జాగ్రత్త పడుతూ పలు ప్రదేశాల్లో తలదాచుకొనే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఓ వృద్దురాలి సంరక్షణగా చేరుతుంది. అయితే తన కుటుంబానికి దూరంగా బతుకుతున్న వృద్దురాలి కోరిక మేరకు చనిపోయిన తర్వాత ఆమె పార్థీవ దేహాన్ని తన ఇంటిలోనే పాతిపెడుతుంది. ఈ విషయం తెలుసుకొన్న కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మేరిని అరెస్ట్ చేస్తారు. ఆ సమయంలో వాసుదేవ్ స్కూల్ వెళ్లడంతో తల్లి నుంచి విడిపోతాడు.

మేరీ లుకా ఏ పరిస్థితుల్లో హత్య కేసులో ఇరుక్కొన్నది? మారు పేర్లతో తల్లి కొడుకులు ఎందుకు రహస్య జీవితాన్ని కొనసాగించారు? తమ గతం గురించి కొడుకు ఎలాంటి కథలు చెప్పింది? తల్లికి కొడుకు ఎలా అండగా నిలుస్తాడు? తల్లితో విడిపోయిన తర్వాత వాసుదేవ్ పరిస్థితి ఏమిటి? వాసుదేవ్ ఎలా పెరిగాడు? తల్లిని వెతకడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? తల్లి ఆచూకీ కోసం ఎవరెవర్నీ కలిశాడు? వాసుదేవ్ లైఫ్‌లో అబ్బాస్ (టొవినో థామస్) పాత్ర ఏమిటి? తల్లి, కొడుకు ఎలా కలిశారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

Balan  The Boy Movie Review

తల్లి, కొడుకుల రహస్య ప్రయాణం, ఐడెంటిటీ తెలియకుండా జాగ్రత్త పడటమనే అంశాలతో కథ చాలా స్లోగా సాగుతుంది. ఈ సినిమా సన్నివేశాల్లో డీటెయిలిటీ ఎక్కువ కావడంతో సినిమా కొంత డాక్యుమెంటరీ టచ్ అనిపిస్తుంది. కాకపోతే 70 ఏళ్ల వృద్దురాలి క్యారెక్టర్ కథలోకి వచ్చిన తర్వాత కొంత ఫన్‌తో సాగడం ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. తల్లి, కొడుకులు విడిపోయిన తర్వాత స్టోరీలో ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాలు ఎలివేట్ అయ్యేలా చిదంబరం సినిమాను తెరకెక్కించారు. టొవినో థామస్ అతిథి పాత్రలో కనిపించినప్పటికీ.. సినిమా కథకు అంతగా ఉపయోగపడేలా కనిపించదు. కాకపోతే భావోద్వేగంతో సాగే సినిమాగా ఓ హానెస్ట్ అటెంప్ట్‌ కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాగా హృదయాలను టచ్ చేస్తుంది. ఈ సినిమాను కొంత ఓపికగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఫర్జానా, ఆదిశేషన్ ఇద్దరు మాత్రమే సినిమాను నిలబెట్టారని చెప్పవచ్చు. వారు తమ పాత్రల్లో జీవించడంతో ప్రతీ సన్నివేశం బాగా పండింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను ఫర్జానా చాలా సులభంగా, అలవోకగా పోషించారు. చిన్నవాడైనా పిల్లాడు తన వయసుకు మించిన పరిణతితో ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు తమ క్యారెక్టర్ల డెప్ట్ మేరకు ఫర్వాలేదనిపించారు.

ఈ సినిమాకు ప్రధానంగా సినిమాటోగ్రఫి, మ్యూజిక్ పూర్తిస్థాయిలో సపోర్టుగా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చాయి. ఆటవీ ప్రాంతం, గ్రామీణ ప్రాంతంలో సాగే సినిమా కావడంతో పల్లె, అడవి అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలను రూపొందించే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ తొలి ప్రయత్నంగా కంటెంట్ ప్రధానమైన సినిమాతో రావడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే మంచి ఉన్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను అందించారు. చైల్డ్ డ్రామా, మదర్, సన్ రిలేషన్స్, సైకాలజీ సర్వైవల్ థ్రిల్లర్స్‌ చూడాలనుకొనే వారికి బాలన్: ది బాయ్ చక్కటి ఆప్షన్. కాకపోతే కొంత ఓపికగా చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది.

Read more about: manjummel boys tovino thomas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X