Balan: The Boy First Reveiw: బాలన్: ది బాయ్ మలయాళ మూవీ ఫస్ట్ రివ్యూ

మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ద్వారా వాస్తవికతను, భావోద్వేగాలను జోడించిన దర్శకుడు చిదంబరం డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం బాలన్: ది బాయ్. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో టొవినో థామస్ అతిథి పాత్రలో నటించగా.. టైటిల్ రోల్‌లో బాల నటుడు ఆదిశేషన్ కేఆర్, నటి ఫర్జానా పాలథింగల్, జినన్, జీన్ పాల్ లాల్, గిరిష్ ఏడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ (KVN) నిర్మించడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడటమే కాకుండా, క్యూరియాసిటీ పెరిగింది.

ఈ సినిమా సాంకేతిక విభాగాల అంశాల విషయానికి వస్తే.. సహ నిర్మాత: శైలజా దేశాయ్ ఫెన్, రచన: జితూ మహాదేవన్, మ్యూజిక్: సుషిన్ శ్యామ్, శైజు ఖాలీద్, ఎడిటర్: వివేక్ హర్షన్, ప్రొడక్షన్ డిజైనర్: అజయన్ చెల్లిస్సెరీ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ గురించి, రన్ టైమ్ గురించి, కేవీఎన్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ ఈ సినిమాను నిర్మించడానికి ఆసక్తి రేపిన కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Balan  The Boy  Review by Censor Board

అస్తవ్యస్థమైన బాల్యాన్ని అనుభవించిన టీనేజ్ బాయ్ (ఆదిశేషన్ కేఆర్) తనకంటూ కుటుంబం, తల్లి ఉందని తెలుసుకొంటాడు. అమ్మమ్మ పెట్టే వేధింపులను తట్టుకోలేక తన తల్లిని వెతుక్కొంటూ వెళ్తాడు. తల్లిని కలిసిన తర్వాత వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి మారుపేర్లతో జీవించడం మొదలుపెడుతారు. పోలీసులు తల్లి, కొడుకుల ఆచూకీ కోసం వెంటాడుతుంటారు. కుర్రాడి డార్క్ లైఫ్ వెనుక ఉన్న కథ ఏమిటి? తల్లి ఎందుకు దూరంగా ఉంది? తల్లిని కలిసిన తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది? పోలీసులకు చిక్కకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? కుర్రాడు, తల్లి లైఫ్‌లో ఏ జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే బాలన్: ది బాయ్ సినిమా కథ.

ఈ సినిమా కథను పరిశీలిస్తే.. తల్లి, కొడుకుల బంధం, వారి భావోద్వేగమైన ప్రయాణం స్పష్టంగా కనిపిస్తున్నది. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాంటి విషయాలను ఎలివేట్ చేసి క్యూరియాసిటీని పెంచింది. అలాంటి చిత్రాన్ని ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించారు. దర్శకుడు, రచయిత కలిసి చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఈ చిత్రానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చారు అని చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో స్పష్టం చేశారు.

ఈ చిత్రంలోని సన్నివేశాలు, డైలాగ్స్‌ను క్లీన్ కంటెంట్‌గా ఫీలవుతూ ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు నిండిన ప్రతీ ప్రేక్షకుడు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ సినిమా కంటెంట్ డిమాండ్ చేయడంతో నిడివిని 2 గంటల 27 నిమిషాలు అంటే.. 147 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు అనేది సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా స్పష్టమైంది.

ఇక ఈ చిత్రం మంజుమ్మేల్ బాయ్స్ దర్శకుడు విజన్‌కు తగినట్గుగానే ఎమోషన్స్, సెంటిమెంట్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లాంటి హైడ్రామాతో సాగుతుంది అనేది ప్రాథమిక సమాచారం. తల్లి, కొడుకుల మధ్య సన్నివేశాలు హృదయాలను కదిలించేలా ఉంటాయనేది చిత్ర యూనిట్ ప్రచారం చేసుకొంటున్నాయి. ఈ సినిమాలో ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు మించిందా? అనే వివరాల కోసం ఫిల్మీబీట్ అందించే ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X