For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Banaras Review టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో బనారస్.. లవ్ స్టోరి ఎలా ఉందంటే..!

  |

  Rating: 2.75/5

  నటీనటులు: జైద్ ఖాన్, సోనాల్ మోంటీరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, స్వప్న రాజ్ తదితరులు
  రచన, దర్శకత్వం: జయతీర్థ
  డైలాగ్: రాజన్ అగర్వాల్
  నిర్మాత: తిలక్ రాజ్ బల్లాల
  సినిమాటోగ్రఫి: అద్వైత గురుమూర్తి
  ఎడిటింగ్: కేఎం ప్రకాశ్
  మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
  బ్యానర్: నేషనల్ ఖాన్స్ ప్రొడక్షన్స్
  రిలీజ్ డేట్: 2022-11-04

  బనారస్ కథ ఏమిటంటే?

  బనారస్ కథ ఏమిటంటే?

  సిద్దూ అలియాస్ సిద్దార్థ్ (జైద్ ఖాన్) జల్సాగా జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ధని (సోనాల్)కు ఐలవ్ యూ చెబుతానని స్నేహితులతో సిద్దూ పందెం కాస్తాడు. అయితే సిద్దూ చేసిన పనికి ధని నవ్వులపాలు అవుతుంది. ఆ అవమానాన్ని భరించలేక.. మనస్తాపం చెందిన ధని బనారస్‌లోని తన బాబాయ్, పిన్ని వద్దకు వెళ్తుంది. అయితే తన తప్పు తెలుసుకొన్న సిద్దూ ఆమెకు సారీ చెప్పడానికి బనారస్ చేరుకొంటాడు.

  బనారస్ కథలో ట్విస్టులు

  బనారస్ కథలో ట్విస్టులు


  ధనితో సిద్దూ చేసిన పని ఏమిటి? సిద్దూ చేసిన పనికి ధని ఎలాంటి అవమానాలకు గురైంది. ధని బనారస్‌కు ఎందుకు వెళ్లింది? తన తప్పు తెలుసుకొన్న సిద్దూ ఏం చేశాడు? బనారస్‌కు వెళ్లిన సిద్దూకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సిద్దూను ధని క్షమించిందా? ధని, సిద్దూ మధ్య చోటు చేసుకొన్న ప్రేమ.. ఎక్కడి వరకు వెళ్లింది. ఆపదలో ఉన్న ధని కోసం సిద్దూ ఎలాంటి టెన్షన్ అనుభవించాడు అనే ప్రశ్నలకు సమాధానమే బనారస్ మూవీ కథ.

  దర్శకుడు జయతీర్థ

  దర్శకుడు జయతీర్థ

  బెల్ బాటమ్ ఫేమ్ దర్శకుడు జయతీర్థ సింపుల్‌గా ఓ లవ్ స్టోరి పాయింట్‌ను తీసుకొని స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసేందుకు ప్రయత్నించాడు. ప్రేమ కథకు బనారస్ సిటీ నేపథ్యాన్ని తీసుకొని కొత్తగా ఆవిష్కరించేందుకు కృషి చేశాడు. బనారస్ నగర చరిత్రతోపాటు ఒక ఫ్రెష్ లవ్ స్టోరితో ఫీల్‌గుడ్‌గా అందించేందుకు ప్రయత్నించాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురి చేస్తాడు. అయితే క్లైమాక్స్ విషయంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడనే విషయం స్పష్టమవుతుంది.

  తొలి చిత్రంలోనే జైద్ ఖాన్

  తొలి చిత్రంలోనే జైద్ ఖాన్

  తొలి చిత్ర నటుడిగా పరిచమైన జైద్ ఖాన్ సిద్దూ పాత్రలో ఒదిగిపోయాడు. కొత్తవాడైనా సినిమా భారాన్నంతా మోయడమే కాకుండా ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పాలి. మంచి కథ పడితే 100 శాతం న్యాయం చేస్తానని నిరూపించుకొన్నాడు. తొలి చిత్రంలోనే ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. ఇక సోనాల్ మోంటీరో కూడా ధని పాత్రతో మెప్పించింది. జైద్ ఖాన్‌తో మంచి కెమిస్ట్రీని అందించింది.

  శాంబు, నారాయణ్ శర్మ పాత్రలు

  శాంబు, నారాయణ్ శర్మ పాత్రలు

  మిగితా పాత్రల్లో శాంబుగా నటించిన సుజయ్ శాస్త్రీ సినిమాకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా నిలిచాడు. సినిమాకు కావాల్సిన వినోదాన్ని పూర్తిస్థాయిలో అందించాడు. ఇక ధని బాబాయ్‌ ప్రొఫెసర్ నారాయణ్ శాస్త్రి అచ్యుత్ కుమార్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు పరిధిలో నటించారు.

  టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

  టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కంతార సినిమాకు మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ మరోసారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకొన్నాడు. పలు సన్నివేశాలను తన మ్యూజిక్‌తో ఫీల్‌గుడ్‌గా మార్చారు. ఇక ఈ సినిమాను తన కెమెరా వర్క్‌తో అద్వైత గురుమూర్తి మంచి ట్రావెలాగ్‌లా మలిచాడు. బనారస్ నగారాన్ని కొత్త కలర్ ప్యాలెట్‌తో అందంగా చూపించాడు. ఇక ఈ సినిమాకు లెంగ్త్ మైనస్. కేఎం ప్రకాశ్‌కు ఇంకా ఎడిటింగ్ చేయాల్సి బాగానే ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  పాజిటివ్ పాయింట్స్
  నటీనటులు ఫెర్ఫార్మెన్స్
  అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్
  అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్స్
  ఫస్టాఫ్ స్లో నేరేషన్
  క్లైమాక్స్

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా


  లవ్, సైన్స్, ఎమోషన్స్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ లాంటి అంశాలతో తెరకెక్కిన చిత్రం బనారస్. టైమ్ ట్రావెల్ అంటే.. మరో కాలానికి వెళ్లడం కాకుండా.. ప్రస్తుతం కాలమానంలోనే ఓ గంటలో జరిగే సంఘటనల ఆధారంగా కథ నడుస్తుంది. అయితే సెకండాఫ్‌లో దర్శకుడు జయతీర్థ రాసుకొన్న స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్. మూడు ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు. సెకండాఫ్‌ను ఫీల్‌గుడ్‌గా మార్చిన జయతీర్థ.. క్లైమాక్స్‌ను చప్పగా ముగించడం..కొత్తగా ఆశించే ప్రేక్షకులకు నిరాశను పంచుతుంది. బనారస్ నగరాన్ని, చరిత్ర, సంసృతిని తెలుసుకోవడానికైనా ఈ సినిమాను థియేటర్‌లో చూడాలనిపించేలా ఉంటుంది. యూత్‌కు డిఫరెంట్ లవ్‌స్టోరిలా అనిపిస్తుంది.

  English summary
  Kannada Director Jayatheertha's latest movie is banaras. Zaid Khan and Sonal are lead pair. This movie hits the theatres on November 4th. Here is the exclusive review from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X