Bandar Movie Twitter Review: బందర్ హిందీ మూవీ ట్విట్టర్ రివ్యూ
బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ బాబీ డియోల్ నటించిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా బందర్. ఈ చిత్రంలో సన్య మల్హోత్రా, సప్న పబ్బి, సబా ఆజాద్, ఇంద్రజిత్ సుకుమారన్, రాజ్ బీ శెట్టి, జితేంద్ర జోషి, జోజు జార్జ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీ రచనా సహకారం అందించారు ఈ సినిమాను అనురాగ్ కశ్యప్, నిఖిల్ ద్వివేది, శివి పండిట్, గౌరీ పండిట్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: సయ్యద్ షాజ్ రిజ్వి, ఎడిటింగ్: ఆర్తీ బజాజ్, మ్యూజిక్: శివహరి వర్మ, పాటలు: అమిత్ త్రివేది, విశాల మిశ్రా తమ బాధ్యతలను నిర్వర్తించారు. సాఫ్రాన్ మ్యాజిక్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జూన్ 5వ తేదీన ఇండియాలో రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి క్రిటిక్స్ రివ్యూలు ఎలా ఉన్నాయి? ఈ చిత్రంపై నెటిజన్ల కామెంట్స్ ఏమిటి? ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో వస్తున్న స్పందన ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

బందర్ సినిమా బాగుంది. బాలీవుడ్ ఓజీ కమ్ బ్యాక్ సినిమా. బాబీ డియోల్ కెరీర్ బెస్ట్ సినిమా. ఫ్లాప్‌ల బారిన పడిన సూపర్ స్టార్ సమీర్ మిశ్రాగా ఆయన అద్బుతంగా నటించాడు. అనురాగ్ కశ్యప్ రా, డార్క్, ఫిల్టర్లు లేకుండా కథ చెప్పాడు. కోర్టు రూమ్ డ్రామా, మీడియా ట్రయల్స్, ట్రూత్ వర్సెస్ పవర్ అంశాలను చక్కగా చూపించాడు. ఈ సినిమా థియేటర్లలో వచ్చింది. తప్పకుండా చూడండి అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
బందర్ సినిమా చాలా బాగుంది. బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించాడు. నా రేటింగ్ 7/10 అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు కనిపించింది.
బందర్ సినిమా మాస్టర్ పీస్. బలమైన కంటెంట్‌తో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకొనేలా ఉంది. ఈ సినిమా గురించి చాలా విన్నాను. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో, నిఖిల్ ద్వివేది నిర్మించిన ఈ సినిమాను చూడటానికి ఉత్సాహంగా ఉన్నాను అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications