Bandar First Review: బందర్ హిందీ మూవీ ఫస్ట్ రివ్యూ
బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ బాబీ డియోల్ నటించిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా బందర్. ఈ చిత్రంలో సన్య మల్హోత్రా, సప్న పబ్బి, సబా ఆజాద్, ఇంద్రజిత్ సుకుమారన్, రాజ్ బీ శెట్టి, జితేంద్ర జోషి, జోజు జార్జ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, సుదీప్ శర్మ, అభిషేక్ బెనర్జీ రచనా సహకారం అందించారు ఈ సినిమాను అనురాగ్ కశ్యప్, నిఖిల్ ద్వివేది, శివి పండిట్, గౌరీ పండిట్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: సయ్యద్ షాజ్ రిజ్వి, ఎడిటింగ్: ఆర్తీ బజాజ్, మ్యూజిక్: శివహరి వర్మ, పాటలు: అమిత్ త్రివేది, విశాల మిశ్రా తమ బాధ్యతలను నిర్వర్తించారు. సాఫ్రాన్ మ్యాజిక్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జూన్ 5వ తేదీన ఇండియాలో రిలీజ్ అవుతున్నది. ఇటీవల ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేసింది. ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? ఈ మూవీ స్టోరీ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

సమీర్ మెహ్రా (బాబీ డియోల్) పాపులారిటీ, ఆఫర్లు లేక కనుమరుగు అవుతున్న టెలివిజన్ యాక్టర్. వ్యక్తిగా పరిపూర్ణత లేకపోవడం, మానసికంగా ఊగిసలాటకు గురి కావడమనేది ఆయన లోపాలుగా కనిపిస్తాయి. ఖుషీ (సబా ఆజాద్)తో రిలేషన్‌షిప్‌లో ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తన మాజీ ప్రేయసి గాయత్రి (సప్న పబ్బి) మళ్లీ సమీర్ జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకొంటాడు. అయితే తనను దూరం పెట్టడం సహించలేకపోయిన గాయత్రి.. సమీర్‌పై రేప్ కేసు పెడుతుంది. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు.
యాక్టర్‌గా సమీర్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మాజీ ప్రేయసి గాయత్రితో బ్రేకప్ ఎందుకు జరిగింది? ఎలాంటి పరిస్థితిలో ఖుషీతో రిలేషన్‌షిప్ కొనసాగించాడు? బ్రేకప్ తర్వాత మళ్లీ సమీర్ జీవితంలోకి గాయత్రి ఎందుకు రావాలని కోరుకొన్నది? గాయత్రిని ఎందుకు దూరంగా పెట్టాడు? సమీర్‌పై రేప్ కేసు పెట్టిన తర్వాత ఏం జరిగింది? జైలులో సమీర్ లైఫ్ ఎలా కొనసాగింది? గాయత్రి సమీర్ మధ్య ఏం జరిగింది? అరెస్ట్ తర్వాత సమీర్‌పై ఖుషీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే బందర్ సినిమా కథ.
డిఫరెంట్ జోనర్, క్యారెక్టర్లైజన్లతో రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా రూపొందిన ఈ సినిమాను సెన్సార్ అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, శృంగార సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 24 సెకండ్ల నిడివి ఉన్న వయోలెన్స్ సీన్లను, అలాగే 15 సెకన్ల ఉన్న గ్రాఫిక్ అడల్ట్ కంటెంట్‌ను తొలగించాలని సూచించారు. దాంతో అలాంటి సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో చిత్ర యూనిట్ మార్పులు చేర్పులు చేశారు. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం.. ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 18 ఏళ్ల నిండిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు చూడటానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 2 గంటల 16 నిమిషాల 27 సెకన్లు.. అంటే సుమారుగా 136 నిమిషాల 27 సెకన్లుగా ఫిక్స్ చేశారు అనే విషయం సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు.
ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్, సబా ఆజాద్ గ్లామర్, సప్న పబ్బి గ్లామర్, యాక్టింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం, కథను చెప్పిన విధానం బాగుందనే ఫీడ్ బ్యాక్ సెన్సార్ కార్యక్రమాల తర్వాత టాక్ బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆడియెన్స్‌ను మెప్పిస్తుందా? బాబీ డియోల్‌ను కొత్తగా చూడబోతున్నామా? అనే విషయాలు తెలుసుకోవాలంటే.. ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications



