Bandi Movie Review: బందీ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: బందీ
నటీనటులు: ఆదిత్య ఓం
దర్శకత్వం: తిరుమల రఘు
నిర్మాతలు: తిరుమల రఘు, వెంకటేశ్వర రావు దగ్గు
స్టోరీ, స్క్రీన్ ప్లే: ఆదిత్య ఓం
సినిమాటోగ్రఫి: మధుసూదన్ కోట
ఎడిటర్, ప్రొడక్షన్: ప్రకాశ్ ఝా
మ్యూజిక్: వీరల్, లవన్, సుదేశ్ సావంత్
బ్యానర్: గల్లీ సినిమా
రిలీజ్ డేట్: 2025-02-28
ఆదిత్య వర్మ (ఆదిత్య ఓం) టాప్ మోస్ట్ లాయర్. కొందరు పర్యావరణ పర్యవేక్షకులు ఆయనను కిడ్నాప్ చేసి దట్టమైన అడవుల్లో వదిలిపెడుతారు. ఆదిత్యను ఫ్లై కామ్ కెమెరాతో ట్రాక్ చేస్తూ అతడికి ఓ మహిళ టాస్క్‌లు పెడుతుంది. అడవిలో వదిలిన తర్వాత ఆ టాస్కులను పూర్తి చేసే పనిలో ఆదిత్య ఉంటాడు.

ప్రముఖ లాయర్ అదిత్య వర్మను ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేసిన తర్వాత ఎందుకు అడవిలో వదిలారు? అతడికి టాస్కుల రూపంలో ఎందుకు పరీక్షలు పెట్టారు? కిడ్నాప్ తర్వాత ఆదిత్య ఏ విషయంలో రియలైజ్ అయ్యాడు? కిడ్నాప్ నుంచి బయటకు రావడానికి ఆదిత్య ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే బందీ సినిమా కథ.
మానవీయ కోణాన్ని ఆవిష్కరించే విధంగా దర్శకుడు తిరుమల రఘు ఎంచుకొన్న పాయింట్ అందర్నీ టచ్ చేస్తుంది. పర్యావరణం విధ్వంసానికి పాల్పడే వారికి ఎలాంటి గుణపాఠం నేర్పాలనే పాయింట్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సింగిల్‌గా ఒకే ఒక క్యారెక్టర్‌తో కథ చెప్పిన విధానం ప్రయోగాత్మకంగా ప్రశంసించాల్సిందే. కాకపోతే ప్రేక్షకులు మైండ్ సెట్ కమర్షియల్ వాల్యూస్‌తో ఉన్న సినిమాలపై ఆసక్తిని కనబరుస్తుండటంతో బందీ చిత్రం వారికి కనెక్ట్ అయ్యే తీరుపైనే వారి ఆదరణ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఒక పాత్ర ద్వారా కథను గ్రిప్పింగ్‌గా 93 నిమిషాలపాటు చెప్పిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పొచ్చు.
ఇక దర్శకుడి విజన్‌కు అనుగుణంగా, తాను రాసుకొన్న కథను, అల్లుకొన్న స్క్రీన్ ప్లే ప్రకారం.. యువ నటుడు ఆదిత్య ఓం పూర్తిగా ఆ పాత్రలో దూరిపోయాడు. ఎమోషనల్‌గా, సమాజాన్ని ఆలోచింపచేసే విధంగా తన పాత్రలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ గురించి రియలైజ్ అయ్యే సీన్, అలాగే ఎలుగుబంటి డ్రస్‌లో ఎదురైన ప్రమాదం నేపథ్యంలో ఆయన నటన ఆకట్టుకొన్నది. మరోసారి తనలోని టాలెంట్‌ను బందీ ద్వారా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేశారు.

టెక్నికల్ పరంగా ఈ సినిమాకు సంబంధించి సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ అంశాలు కీలకంగా కనిపించాయి. లక్నో, నేపాల్ సరిహద్దు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. మధుసూదన్ కోట చిత్రీకరించిన సన్నివేశాలు రిచ్, క్వాలిటీతో మంచి పెయింటింగ్ కాన్వాస్‌లా ఉన్నాయి. అలాగే మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాల పనితీరు కథను, సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. గల్లీ సినిమా బ్యానర్, తిరుమల రఘు అనుసరించిన నిర్మాణ విలువలు హై క్వాలిటీలో ఉన్నాయి. మరికొంత కమర్షియల్ హంగులను జోడించి.. సినిమా నిడివిని కాస్త పెంచితే అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉండేదనిపిస్తుంది.
కార్పోరేట్ సంస్థల దురాశ, అక్రమణలతో పచ్చటి అడవులు, పర్యావరణం ధ్వంసం అవుతున్న తీరును చెప్పే ప్రయత్నంగా బందీ సినిమాను రూపొందించారు. సింగిల్ పాయింట్ కావడం వల్ల కథలో ఎక్కువ వేరియేషన్స్ లేకపోయాయి. సీరియస్ టాపిక్ కావడంతోపాటు ఎమోషనల్ కంటెంట్ కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆశించే వారికి ఈ సినిమా కొంత అసంతృప్తికి గురి చేస్తుంది. ఇప్పుడంతా స్క్రీన్ పై రక్తపు టేరులు, ద్వందార్థాలతో సాగుతున్న సినిమాల మధ్య హానెస్ట్ మేకింగ్‌తో వచ్చిన సినిమా ఆ పోటీని తట్టుకొంటుందా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











