For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బందోబస్త్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating:
3.0/5
Star Cast: సూర్య, మోహన్ లాల్, ఆర్య, సాయేషా సైగల్, బోమన్ ఇరానీ
Director: కేవీ ఆనంద్

యాక్షన్ చిత్రాల పేరు వింటే ఇటీవల కాలంలో ఎక్కువగా గుర్తొచ్చేది ఎవరంటే.. హీరో సూర్య, దర్శకుడు కేవీ ఆనంద్. పోలీస్ కథలతో సూర్య ప్రేక్షకులను మెప్పిస్తే.. రంగం చిత్రం ద్వారా ఇన్వెస్టిగేషన్ కథలతో ఆడియెన్స్‌ను కేవీ ఆనంద్ మెస్మరైజ్ చేశారు. తాజాగా వీరిద్దరు కలిసి చేసిన చిత్రం బందోబస్తు. తమిళంలో కాప్పన్‌గా సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం సూర్య, కేవీ ఆనంద్‌కు ఎలాంటి ఫలితాన్ని, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే..

బందోబస్త్ కథ

బందోబస్త్ కథ

ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్‌లాల్) భద్రతా వ్యవహారాలను చూసే అధికారి రవి (సూర్య) ఎస్పీజీ కమాండో. ప్రాణాలకు ముప్పు ఉండటంతో మరో అధికారి (సముద్రఖని)తో కలిసి ప్రధానిని కంటికి రెప్పలా చూసుకొంటారు. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిం రంజిత్ చే (చిరాగ్ జానీ) పలు మార్లు ప్రధానిని ముప్పు నుంచి తప్పిస్తారు. కానీ కశ్మీర్‌లో జరిగిన దాడిలో ప్రధాని ప్రాణాలు కాపాడటంలో రవి విఫలమవుతాడు.

బందోబస్త్‌లో ట్విస్టులు

బందోబస్త్‌లో ట్విస్టులు

ప్రధాని ప్రాణాలు కాపాడటంలో విఫలమైన రవి ఆ తదనంతరం ఉగ్రవాదుల ఆటకట్టించడానికి ఎలాంటి వ్యూహాలు పన్నారు. తన సహచర అధికారి (సముద్ర ఖని)తో కలిసి ఎలాంటి దాడులు నిర్వహించాడు. ఉగ్రవాది (చిరాగ్ జానీ) ఎత్తులకు ఎలాంటి పై ఎత్తులు వేశాడు? మరణాంతరం పీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని తనయుడు (ఆర్య)కు ఎలాంటి మద్దతు ఇచ్చాడు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే పారిశ్రామిక వేత్త మహావీర్ (బోమన్ ఇరానీ) ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా సాగించే కుట్రలను ఎలా భగ్నం చేశాడు. అలాగే ఈ కథకు గోదావరి జిల్లా రైతులకు సంబంధమేమిటి అనే ప్రశ్నలకు సమాధానమే బందోబస్తు సినిమా కథ.

 ఫస్టాఫ్ అనాలిసిస్

ఫస్టాఫ్ అనాలిసిస్

బందోబస్తు సినిమా కథ ప్రధాని వర్మపై హత్యా ప్రయత్నాలతో కథ ప్రారంభం అవుతుంది. ఉగ్రవాదుల దాడులను అడ్డుకొనే అధికారిగా సూర్య ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా సాగుతుంది. అలాగే ఓ పక్క దేశ ప్రయోజనాలను చక్క బెడుతూనే మరో పక్క ప్రేయసి అంజలి (సాయేషా సైగల్‌)తో రొమాన్స్ సాగించడం గ్లామరపరంగా ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే ప్రధానిపై దాడులు అంత సులువా అనే విషయం సినిమాలోని ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. ఇక సముద్రఖని లవ్ ఎపిసోడ్, అలాగే ప్రధాని తనయుడిగా (ఆర్య) క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ప్రథమ భాగంలో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇక ప్రధానిపై కశ్మీర్ జరిగిన దాడి ఘటన సీన్‌తో తొలి భాగం ముగుస్తుంది.

సెకండాఫ్ ఎనాలిసిస్

సెకండాఫ్ ఎనాలిసిస్

ఇక సెకండాఫ్‌లో ఇక రంజిత్‌ వేసే ఎత్తులకుపై ఎత్తులు, అలాగే గోదావరి జిల్లాలో మహావీర్ (బోమన్ ఇరానీ) యురేనియం తవ్వకాలతో రైతులను మోసగించడం కథలోకి అనూహ్యంగా దూసుకురావడం ప్రేక్షకుడిని కొంత తికమకకు గురిచేస్తుంది. ఇక ప్రధాని బాధ్యతలు చేపట్టిన చంద్రకాంత్ వర్మ కుమారుడిగా ఆర్య ఎపిసోడ్స్ సినిమా క్లైమాక్స్‌ కోసం ఉపయోగపడ్డాయి. చివర్లలో సహచర అధికారి సముద్రఖని మరణం సినిమాలో ఎమోషనల్‌ కంటెంట్‌గా ఉపయోగపడింది.

కేవీ ఆనంద్ దర్శకత్వ ప్రతిభ

కేవీ ఆనంద్ దర్శకత్వ ప్రతిభ

దర్శకుడు కేవీ ఆనంద్ రాసుకొన్న దేశభక్తి తరహా సన్నివేశాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై మల్టీ నేషనల్ కంపెనీల అరాచకాలు ఆలోచింప జేసేలా ఉంటాయి. అలాగే గోదావరి జిల్లాలో రైతుల సమస్యను మల్టీనేషనల్ కంపెనీల తీరును చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే ఎస్పీజీ అధికారుల కష్టాలు కూడా చక్కగా చూపించాడు. కానీ కథనంలో కొన్ని లోపాలు ఇంటెన్సిటీని తగ్గించాయి. కాకపోతే మరోసారి దేశభక్తి తరహా కథతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.

సూర్య నటన

సూర్య నటన

ఇక సూర్యకు పోలీసు పాత్రల్లో, దేశ భద్రతకు సంబంధించిన రోల్స్‌లో నటించడం సూర్యకు కొట్టిన పిండే. అలాంటి పాత్రలోనే వైవిధ్యం చూపే విధంగా నటించాడు. ఫైట్స్, రొమాన్స్, పాటలతో ఆలరించాడు. కాకపోతే మాస్, యాక్షన్ చిత్రాలతో మూసగా మారిపోతున్నాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. రైతులకు సంబంధించిన ఎపిసోడ్‌లో భావోద్వేగాన్ని పండించాడు.

మోహన్ లాల్, ఇతర పాత్రల్లో

మోహన్ లాల్, ఇతర పాత్రల్లో

మోహన్ లాల్ ప్రధాని పాత్రలో హుందాగా, గంభీరంగా కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో తన మార్క్ నటనను ప్రదర్శించాడు. సినిమా కథ తన చుట్టు తిరిగే అతిథి లాంటి పాత్రలో నటించాడు. మిగితా పాత్రల్లో ప్రధాని పీఏగా సాయేషా సైగల్ కీలక పాత్రలో కనిపించాడు. అలాగే కొత్త రకం విలనిజంతో బోమన్ ఇరానీ విభిన్నంగా కనిపించాడు. ప్రధాని లాంటి భారమైన పాత్రలో ఆర్య తేలికపాటి హాస్యాన్ని పండించాడు. సెకండాఫ్‌లో చాలా ఎమోషనల్ కంటెంట్‌ను పండించాడు. ఇక సముద్రఖని ఎస్పీజీ ఆఫీసర్‌గా ఆకట్టుకొన్నాడు. మియన్ విలన్‌గా చిరాగ్ జానీ పర్వాలేదనించాడు.

టెక్నికల్‌గా

టెక్నికల్‌గా

సాంకేతికపరంగా సినిమాటోగ్రఫి బాగుంది. హ్యారీస్ జైరాజ్ మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయింది. పాటలు పేలవంగా ఉండగా, రీరికార్డింగ్‌ కూడా ఆకట్టుకొనేలా లేకపోయింది. ఇక ఎడిటింగ్‌ విభాగం పనితీరులో కూడా కొన్నిలోపాలు కనిపించాయి. లోకేషన్లు, ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. లైకా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగుండటమే కాకుండా రిచ్‌గా సినిమా కనిపించింది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు దేశభక్తి, రైతుల సమస్యను ఎత్తి చూపిన చిత్రం బందోబస్తు. సూర్య, మోహన్ లాల్ నటన సినిమాకు హైలెట్. యాక్షన్, దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి బందోబస్తు నచ్చుతుంది. సూర్య అభిమానులు బాగా నచ్చుతుంది. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తే మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

 బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్

  • సూర్య ఫెర్ఫార్మెన్స్
  • మోహన్ లాల్ యాక్టింగ్
  • కేవీ ఆనంద్ టేకింగ్
  • సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్

  • స్క్రీన్ ప్లే
  • స్లో నేరేషన్
  • సీరియస్‌గా సాగడం
 నటీనటులు:

నటీనటులు:

సూర్య, మోహన్ లాల్, ఆర్య, సాయేషా సైగల్, బోమన్ ఇరానీ, చిరాగ్ జానీ, సముద్రఖని తదితరులు

దర్శకత్వం: కేవీ ఆనంద్

నిర్మాత: సుభాష్కరన్

సంగీతం: హ్యారీస్ జయరాజ్

సినిమాటోగ్రఫి: ఎంఎస్ ప్రభు

ఎడిటింగ్: ఆంథోని

రిలీజ్ డేట్: 2019-09-20

English summary
South Star suriya's latest movie Bandobast is the dubbing of Kaappaan tamil movie. Sayeshaa Saigal is the heroine. Mohan Lal, Aarya are seen in the lead roles. This movie released on September 20th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more