For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bangarraju movie review మళ్లీ మెరిసిన బంగార్రాజు... సంక్రాంతి బరిలో హిట్టు కేక!

  |

  Rating:
  3.0/5
  Star Cast: నాగార్జున అక్కినేని, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరీ
  Director: కల్యాణ్ కృష్ణ

  సొగ్గాడే చిన్నినాయన సినిమా ఘన విజయం తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు వస్తున్నది. ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బంగార్రాజుపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇలాంటి అంచనాల మధ్య వచ్చిన బంగార్రాజు ఎలాంటి అనుభూతిని కలిగించాడు? సంక్రాంతి రేసులో విజేతగా నిలిచాడా? చిన్న బంగార్రాజు పరిస్థితి ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే.. బంగార్రాజు కథ, కథనాలు తెలుసుకొందాం పదండి..

  బంగార్రాజు మూవీ కథ..

  బంగార్రాజు మూవీ కథ..

  రాము (నాగార్జున) సీత (లావణ్య త్రిపాఠి) కాపురాన్ని చక్కదిద్దిన బంగార్రాజు (నాగార్జున)కు నేరుగా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. అయితే సీత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి చనిపోవడంతో రాము జీవితంలో ఊహించిన సంఘటన చోటు చేసుకొంటుంది. తన కుమారుడికి బంగార్రాజు ( నాగచైతన్య) అని నామకరణం చేసి.. సీత మరణంతో కలిగిన బాధను మరిచిపోవడానికి రాము అమెరికా వెళ్లిపోతాడు.

  బంగార్రాజు పెరిగి పెద్ద అయిన తర్వాత సత్తెమ్మ మరణించడంతో బంగార్రాజు ఒంటరివాడైపోతాడు. శివపురంలో రమేష్ (రావు రమేష్) కూతురు నాగలక్ష్మీ (సర్పంచ్) ఎన్నికవుతుంది. మరదలు నాగలక్ష్మితో చిన్న బంగార్రాజుకు ఎప్పుడు చిలిపి తగాదాలే. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న బంగార్రాజు ప్రాణాలకు ముప్పు కలగడంతో బంగార్రాజు మళ్లీ శివపురంకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

  బంగార్రాజు కథలో ట్విస్టులు

  బంగార్రాజు కథలో ట్విస్టులు

  స్వర్గలోకంలో సత్తెమ్మతో జీవితాన్ని ఆస్వాదిస్తున్న బంగార్రాజకు మళ్లీ శివపురంకు రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? చిన్న బంగార్రాజు ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లింది? చిన్న బంగార్రాజు ప్రాణాలను బంగార్రాజు కాపాడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. నాగలక్ష్మి, చిన్న బంగార్రాజు చిలిపి తగాదాలకు ఎలా చెక్ పడింది. చిన్న బంగార్రాజు అంటే కోపం ఉండే నాగలక్ష్మికి ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమ కలిగింది? నాగలక్ష్మి అంటే ఇష్టం కలుగడానికి చిన్న బంగర్రాజుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నాగలక్ష్మి, చిన్న బంగార్రాజు పెళ్లికి రానని చెప్పిన రాము అమెరికా నుంచి ఎందుకు వచ్చాడు? చిన బంగార్రాజు ప్రాణాలకు ఏర్పడిని ముప్పును బంగార్రాజు, రాము ఎలా తొలగించారు అనే ప్రశ్నలకు సమాధానమే బంగార్రాజు సినిమా కథ.

  ఫస్టాఫ్ డల్‌గా, స్లోగా

  ఫస్టాఫ్ డల్‌గా, స్లోగా

  బంగార్రాజు కథ ఫన్ అండ్ ఎమోషనల్ నోట్‌తో మొదలవుతుంది. కథలోకి వెళ్లేకొద్ది కొన్ని రొటీన్ సీన్లతో ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా, కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. నాగలక్ష్మి, చిన్న బంగార్రాజు మధ్య టామ్ అండ్ జెర్రీ మాదిరిగా సాగే ఎపిసోడ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అసంతృప్తిని బంగార్రాజు, సత్తెమ్య ఎంట్రీలతో కథలో జోష్ పుడుతుంది. కొన్ని ట్విస్టులు, ఫన్, ఎమోషనల్ మూమెంట్స్‌తో ఫస్టాఫ్ సాదాసీదాగా సాగతుంది. ఇక కథకు పాటలు అడ్డుపడున్నాయనిపించే ఫీలింగ్‌ కారణంగా ఓ దశలో ఏంటీ బంగార్రాజు సీక్వెల్ తప్పు జరిగిందా అనే అనుమానం మధ్య ఇంటర్వెల్ పడుతుంది.

  ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అదుర్స్

  ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అదుర్స్

  ఇక సెకండాఫ్‌ మొదలైన తర్వాత కూడా అదే నిస్సత్తువ, రొటీన్ సన్నివేశాలతో బంగార్రాజు ముందుకెళ్తుంటాడు. కానీ వీరి వీరి గుమ్మడి పండు గేమ్ నుంచి అసలు కథ ఎత్తుకుంటుంది. ఆ తర్వాత రావు రమేష్‌కు సంబంధించిన ట్విస్ట్‌తో వాసి వాడి తస్సదియ్యా అనే విధంగా కథ, కథనం, సన్నివేశాల్లో కేకపుడుతుంది. చివరి 30 నిమిషాలు మంచి ఎమోషనల్ ట్విస్టులు, యాక్షన్ సీన్లతో కేక పుట్టిస్తారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాగిన ఎపిసోడ్స్ బంగార్రాజను సంక్రాంతి సూపర్ హిట్‌గా మలిచాయని అనిపిస్తుంది.

  కల్యాణ్ కృష్ణ మ్యాజిక్

  కల్యాణ్ కృష్ణ మ్యాజిక్

  బంగార్రాజును సంక్రాంతి హిట్‌గా మలిచిన క్రెడిట్ మొత్తాన్ని కల్యాణ్ కృష్ణకు ఇవ్వాల్సిందే. ప్రీ క్లైమాక్స్ వరకు ఎదో అదోలా నడిపించిన కల్యాణ్ కృష్ట చివరి 30 నిమిషంలో సినిమా స్వరూపాన్నే మార్చేశాడు. చివరి 30 నిమిషాల్లో కథ, కథనాలు నడిపించిన విధానమే బంగార్రాజును సంక్రాంతి విన్నర్‌గా మార్చేసిందనిపిస్తుంది. తన కలం పదునును కల్యాణ్ కృష్ణ మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

  మళ్లీ బంగార్రాజునే హీరో

  మళ్లీ బంగార్రాజునే హీరో

  బంగార్రాజు సినిమాలో ఎప్పటి లానే బంగార్రాజు హీరో. బంగార్రాజు కథను నడిపించిన విధానం ఆసక్తిగా సాగుతుంది. బంగార్రాజు ముందు చిన్న బంగార్రాజు తేలిపోయనట్టు కనిపిస్తాడు. చిన్న బంగార్రాజు పాత్ర మరింత బెటర్‌గా చేయాల్సి ఉండేది. నాగలక్ష్మితో చిలిపి తగాదాల సన్నివేశాలు పేలవంగా ఉండటం వల్ల చిన్న బంగార్రాజు క్యారెక్టర్‌లోని మాస్ ఎలిమెంట్స్ ఎలివేట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. బంగర్రాజుగా, రాముగా నాగార్జున తన మార్క్ రొమాన్స్, ఎమోషన్స్ చూపించారు.

  నాగచైతన్య తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ముఖ్యంగా నాగచైతన్య ఒంటరి అని చెప్పే ఎమోషనల్ సీన్లలో తన ఫెర్ఫార్మెన్స్‌తో టచ్ చేశాడనిపిస్తుంది.

  కృతిశెట్టి, రమ్యకృష్ణ గురించి

  కృతిశెట్టి, రమ్యకృష్ణ గురించి

  నాగలక్ష్మిగా కృతిశెట్టి ఎక్ట్రార్డినరిగా అనిపించకపోయినా ఫర్వాలేదనిపించింది. బంగార్రాజు పాత్ర ముందు నాగలక్ష్మీ పాత్ర తేలిపోయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో చైతూ, కృతిశెట్టి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొనేలా ఉంటుంది. రమ్యకృష్ణ మరోసారి తన రొమాంటిక్ లుక్స్‌తో మ్యాజిక్ చేసింది. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య ఉండే కాంబినేషన్ సీన్లు ( స్వర్గంలో పాట తప్ప) బాగున్నాయి.

  మిగితా నటీనటులు గురించి

  మిగితా నటీనటులు గురించి

  మిగితా నటీనటుల విషయానికి వస్తే.. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కామెడీ సీన్లు బాగున్నాయి. రావు రమేష్ క్యారెక్టర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సంపత్ రాజ్ క్యారెక్టర్ లేటుగా అయినప్పటికీ.. సెకండాఫ్‌లో కథను హై ఇంటెన్స్‌గా మార్చేసింది. క్రూరమైన రూపంలో సంపత్ రాజ్ మెప్పించాడు. సంపత్ రాజ్ విలనిజం కొత్తగా ఉంటుంది.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  బంగార్రాజు సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ప్లస్, మైనస్. రెండు పాటలు మినహా మిగిలిన పాటలు చాలా బోర్‌గా ఉన్నాయి. కొన్ని పాటలు ఇంటర్వెల్ రిలీఫ్‌ను ఇస్తాయి. కానీ కథ, సన్నివేశాలను తన రీరికార్డింగ్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి విభాగాల పనితీరు బ్రహ్మండంగా రాణించాయి. ప్రోడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఫ్యామిలీ, లవ్, యాక్షన్, ఫన్, హ్యుమర్ లాంటి అంశాలు కలబోసిన చిత్రం బంగార్రాజు. సంక్రాంతి పండుగకు ఏం కావాలో అవన్నీ ఈ సినిమాలో దొరుకుతాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో కొంత బోర్‌ను వదిలిస్తే సంక్రాంతికి బంగార్రాజు ఫర్‌ఫెక్ట్ మూవీ. అయితే సొగ్గాడే చిన్నినాయనా కొట్టేంతగా ఎమోషన్స్, ఫన్ బంగార్రాజులో ఆశిస్తే కాస్త నిరాశే మిగులుతుంది. అలా చూడకుండా థియేటర్‌కు బోలెండంత వినోదం, ఎమోషన్స్ హృదయాన్ని టచ్ చేస్తాయి. ఎలాంటి ఆలోచనలు లేకుండా బంగార్రాజు హంగామాను తెరపైన చూసేయవచ్చు. బంగార్రాజు బాక్సాఫీస్ రేంజ్ అనేది రెండు రోజులు ఆగితే స్పష్టం కావడం తథ్యం.

  బంగార్రాజు మూవీలో నటీనటులు, సాంకేతిక వర్గం

  బంగార్రాజు మూవీలో నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు: నాగార్జున అక్కినేని, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరీ తదితరులు
  రచన, దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ
  సినిమాటోగ్రఫి: జే యువరాజ్
  ఎడిటింగ్: విజయ్ వర్ధన్ కే
  మ్యూజిక్: అనుప్ రూబెన్స్
  బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
  రిలీజ్ డేట్: 2022-01-14

  English summary
  Soggade Chinni Nayana's sequel Bangarraju to hit the screen on Sankranti festival occassion. Nagarjuna as Bangarraju and Naga Chaitanya to play as China Bangarraju. Here is the review of Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X