Barabar Premistha Movie Review: బరాబర్ ప్రేమిస్తా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: బరాబర్ ప్రేమిస్తా
నటీనటులు: చంద్రహాస్, మేఘనా ముఖర్జీ, అర్జున్ మహీ, మురళీధర్ గౌడ్, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనిగి, కీర్తీ లతా గౌడ్, సునీతా మనోహర్ తదితరులు
నిర్మాతలు: గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ రుద్ర
మ్యూజిక్: ఆర్ఆర్ ధృవన్
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
సినిమాటోగ్రఫి: వైఆర్ శేఖర్
కథ: తిరుపతి
బ్యానర్: సీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్
రిలీజ్ డేట్: 2026-01-06
రుద్రారం గ్రామంలో కర్మానీ, ధర్మానీ అనే రెండు వర్గాల మధ్య విద్వేషాలు ఎన్నో ఏళ్లుగా ఉంటాయి. గ్రామంలో కులపరమైన అధిపత్య పోరాటం సాగుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కర్మానీ వర్గానికి చెందిన చందు (చంద్రహాస్), ధర్మానీ వర్గానికి చెందిన బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) మధ్య గిల్లికజ్జాలతో ప్రారంభమైన రిలేషన్ ప్రేమగా మారుతుంది. గ్రామంలోని కుల కక్షలు, ఇతర పరిస్థితుల కారణంగా కేరళకు పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకొంటారు. తీరా చందు తాళి కట్టే సమయంలో బుజ్జమ వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తుంది.

ఏన్నో ఏళ్లుగా కర్మానీ, ధర్మానీ వర్గాల మధ్య కుల కుంపటి రాజుకోవడానికి కారణం ఏమిటి? చందు, బుజ్జమ్మ తండ్రుల మధ్య ఎలాంటి రాజకీయ వైరం కొనసాగింది? చందుతో రిలేషన్ కత్తి మీద సాము అని తెలిసినా బుజ్జెమ్మ ఎందుకు ప్రేమలో పడింది? కేరళకు లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకొన్న వారు ఎందుకు క్యాన్సిల్ చేసుకొన్నారు? రుద్రారం గ్రామంలో కుల విద్వేషాలు వారి ప్రేమకు ఎలా అడ్డుగా నిలిచాయి? కులం గోడలను బద్దలు కొట్టి చందు, బుజ్జెమ్మ పెళ్లి చేసుకొన్నారా? గ్రామంలోని రెండు వర్గాల మధ్య కుల చిచ్చులను చందు, బుజ్మెమ్మ ప్రేమ, పెళ్లి రూపుమాపిందా? అనే ప్రశ్నలకు సమాధానమే బరాబర్ ప్రేమిస్తా సినిమా కథ.
బరాబర్ ప్రేమిస్తా కథ, కథనాల విషయానికి వస్తే కొత్తదనం పెద్దగా కనిపించదు. ఇప్పటికే రెండు వేర్వేరు కులాలు, రాజకీయ కక్షలు, రూరల్ పాలిటిక్స్ ఫ్లేవర్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా విషయానికి వస్తే.. చందు, బుజ్జెమ్మ క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేస్తుంది. అయితే సెకండాఫ్ కూడా రొటీన్, రెగ్యులర్ ప్యాటర్న్‌లో వెళ్లడం వల్ల కొత్తగా అనుభూతి పొందిన విషయాలు తారసపడవు. కానీ చివరి 20 నిమిషాలు కథను నడపించిన విధానం, సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం కొంతలో కొంత కొత్తగా ఉంటుంది. మీసాల లక్ష్మణ్ క్యారెక్టర్ ట్విస్టు సినిమాను బ్యాలెన్స్ చేసింది. కథ పాతదైనా కొన్ని ఎపిసోడ్స్‌ను కొత్తగా చూపిస్తూ డైరెక్టర్ బాగా డీల్ చేశాడు.
చందుగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, బుజ్జెమ్మ మేఘన ముఖర్జీలు తమ పాత్రలకు న్యాయం చేశారు. చంద్రహాస్ డ్యాన్సులు, ఫైట్స్ ఎప్పటిలానే బాగా చేశాడు. మేఘన లవ్ సీన్స్‌లో మంచి కెమిస్ట్రీని పండించింది. చివర్లో మీసాల లక్ష్మణ్ ఎంట్రీతో కథ మరో టర్న్ తీసుకొంటుంది. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారందరూ ఫర్వాలేదనిపించారు.
ఈ సినిమాకు వైఆర్ శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ధృవన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథ, కథనాలను జస్టిఫై చేసేలా మాత్రం ఉంది. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ క్రిస్పీగా షార్ప్‌గా ఉండటంతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరిగింది. గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాపై వారికి ఉన్న తపన కనిపించింది. కథ, కథనాలుపై మరింతగా జాగ్రత్త పడాల్సి ఉండాల్సిందనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











