Barabar Premistha First Review: బరాబర్ ప్రేమిస్తా ఫస్ట్ రివ్యూ
బుల్లితెర స్టార్ యాక్టర్ ఈటీవీ ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. ఈ చిత్రంలో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నది. సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఈ మూవీని గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు నిర్మించారు. రూరల్ డ్రామాగా, లవ్, అండ్ యూత్‌ఫుల్ ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు సంపత్ రుద్ర స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో అర్జున్ మహీ, మురళీధర్ గౌడ్, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనిగి, కీర్తీ లతా గౌడ్, సునీతా మనోహర్ తదితరులు నటించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో చర్చనీయాంశమైన ఈ సినిమాకు ఆర్ఆర్ ధృవన్ సంగీతం, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్, వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ మూవీకి మా తిరుపతి కథను అందించారు. ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాపై వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? ఈ సినిమాకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్‌టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంగా మాస్ ఎలిమెంట్స్ జొప్పించి రూపొందించిన ఈ సినిమా పక్కా తెలంగాణ గ్రామీణ నేపథ్యంగా తెరకెక్కించారు. చంద్రహాస్ తన యాటిట్యూడ్‌కు సరిపోయే క్యారెక్టర్‌లో కనిపించడమే కాకుండా ఎమోషనల్ డ్రైవ్ సాగే పాత్రను మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చంద్రహాస్ పాడిన పాట గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్నది.
ఇలాంటి నేపథ్యంలో బరాబర్ ప్రేమిస్తా సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ ('CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ను, అలాగే పాటల్లో సాహిత్యం, కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. లిరిక్స్, డైలాగ్స్‌పై బీప్స్ వేయాలని, లేదా మార్పులు చేయాలనే సలహాలు, సూచనల మేరకు చిత్ర యూనిట్ ఆ కోణంలో చర్యలు తీసుకొన్నారు. దాంతో సెన్సార్ బోర్డు అధికారులు సంతృప్తి చెందారు. అనంతరం ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ అందించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ చిత్రంపై అన్ని రకాల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యూఏ (UA 16+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాను 16 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అనుమతుల్లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల అనుమతి, పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందని సెన్సార్ బోర్డు తమ సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమా నిడివి 2.14 నిమిషాలు అంటే మొత్తంగా 134 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను సాగదీయకుండా స్ట్రయిట్‌గా పాయింట్ టూ పాయింట్‌గా కథ చెప్పేందుకు మొగ్గు చూపారనే విషయం రన్‌టైమ్‌తో స్పష్టమైంది.
చంద్రహాస్ నటించిన మూవీ ఆయనకు తన కెరీర్‌లో రెండో సినిమా. గ్రామీణ ప్రాంత యువకుడిగా నేటివిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పాటలు, డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా డిజైన్ చేశారు. ఈ సినిమా ఏ మేరకు బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకొంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించి మరిన్నీ విశేషాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











