Baramulla Movie Review: పవన్ కల్యాణ్ మెచ్చిన.. బారాముల్లా హిందీ మూవీ రివ్యూ
నటీనటులు: మానవ్ కౌల్, భాషా సుబ్లీ, అరిస్టా మెహతా, రోహన్ సింగ్, మిర్ సర్వర్, ప్రియాంక తాతారియా, సంజయ్ సూరి తదితరులు
దర్శకత్వం: ఆదిత్య సుహాస్ జాంబాలే
రచన: ఆదిత్య ధార్
నిర్మాతలు: ఆదిత్య ధార్, జ్యోతి దేశ్ పాండే, లోకేష్ ధార్
సినిమాటోగ్రఫి: అర్నాల్డ్ ఫెర్నాండేజ్
ఎడిటింగ్: శివకుమార్ వీ పనీకర్
మ్యూజిక్: షోర్ పోలీస్, క్లింటన్ సెరెజో
బ్యానర్: జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-11-7
జమ్ము, కాశ్మీర్‌లోని బారాముల్లాలో ఓ మెజీషియన్ ప్రదర్శించే మ్యాజిక్ షో సమయంలో షోయబ్ అనే కుర్రాడు అంతు చిక్కకుండా అదృశ్యం అవుతాడు. అప్పటికే చాలా మంది కుర్రాళ్లు ఆ ప్రాంతంలో మిస్టీరియస్‌గా అదృశ్యమైన సంఘటనలను దర్యాప్తు చేయడానికి రిద్వాన్ సయ్యద్ (మానవ్ కౌల్)ను అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. దాంతో భార్య గుల్నార్ సయ్యద్ (బాషా సంబ్లీ), కొడుకు ఆయన్, కూతురు నూరీతో కలిసి వచ్చి ఓ విల్లాలో ఉంటారు. షోయబ్ ఆచూకీ గురించి దర్యాప్తు చేస్తుండగా మెజీషియన్ నిరపరాధి అని తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో సహ విద్యార్థిని తండ్రి కాల్చడంతో కూతురు ద్వేషిస్తుంది. ఇదే సమయంలో తాము ఉంటున్న ఇంట్లో భూతాలు, ఆత్మలు తిరగడం ఆందోళన, ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ తర్వాత ఆ ఇంటిలో ఉన్న కాశ్మీర్ పండితుల ఫ్యామిలీని పాకిస్థాన్ మిలిటెంట్లు చంపడంతో భూతాలుగా మారాయనే విషయం తెలుస్తుంది.

మ్యాజిక్ పెట్టెలోకి వెళ్లిన షోయబ్ ఎలా మాయం అయ్యాడు? బారాముల్లా ప్రాంతంలో కుర్రాళ్ల అదృశ్యం వెనుక మర్మం, కుట్ర ఏమిటి? ఇన్స్‌పెక్టర్ రిద్వాన్ సయ్యద్ ఉండే విల్లాలో ఆత్మలు సంచరించడానికి కారణం ఏమిటి? ఆత్మలను చూసి ఇన్స్‌పెక్టర్ భార్య గుల్నార్ రియాక్షన్ ఏమిటి? తన కూతురు నూరీ కూడా మిలిటెంట్లలో కలువడానికి చేసిన ప్రయత్నానికి ఇన్స్‌పెక్టర్ ఎలాంటి షాక్ గురయ్యాడు? స్కూల్ పిల్లల అదృశ్యం వెనుక ఉన్న భాయ్‌జాన్ ఎవరు? షోయబ్ ఆచూకీ లభ్యమైంది? విల్లాలోని ఆత్మలకు శాంతి చేకూరిందా? రిద్వాన్ సయ్యద్ ఫ్యామిలీ తమకు ఎదురైన సమస్యల నుంచి బయటపడ్డారా? అనే ప్రశ్నలకు సమాధానమే బారాముల్లా సినిమా కథ.
బారాముల్లా సినిమా కథను ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో రాసిన కథలో బలమైన, భావోద్వేగమైన అంశాలను జోడించడం ద్వారా ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధార్ తన విజన్‌ను, దేశం ఎదుర్కొంటున్న సమస్యను కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేశారు. కశ్మీర్‌లో మిలిటెంట్ల రాళ్లదాడుల వెనుక ఉన్న కుట్రలు, ప్లానింగ్ గురించి చెప్పిన అంశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే పిల్లలను మతం పేరుతో రెచ్చగొట్టి భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ఎలా ఉపయోగించుకొంటారనే విషయాన్ని ఎమోషనల్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. కశ్మీర్‌లో హిందూ పండితులపై దౌర్జన్యకాండను ఓ సంఘటన ద్వారా కథకు మరింత ఎమోషన్స్ జోడించారు. మిలిటెంట్స్ యాక్టివిటీస్, ఎన్‌కౌంటర్లు, పిల్లల మిస్సింగ్ కేసుల దర్యాప్తు అంశాలు చాలా గ్రిప్పింగ్‌గా సాగుతాయి. ఆత్మలు ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాయనే విషయాన్ని చాలా కన్విన్సింగ్‌గా చెప్పడం ఈ సినిమాకు హైలెట్. ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది.
ఇన్స్‌పెక్టర్‌గా మానవ్ కౌల్, ఆయన భార్యగా భాషా సుబ్లీ ఈ సినిమా భారన్నంతా మోశారు. ఈ చిత్రంలోని ప్రతీ పాత్ర కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతీ ఒక్కరు చక్కటి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటారు. ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే యాక్షన్ సీన్లు మరో అదనపు ఆకర్షణ. కథలో ఉండే సీరియస్ కోణాన్ని, పాత్రల హావభావాలను సినిమాటోగ్రాఫర్ అద్బుతంగా బంధించారు. అలాగే మిలిటెంట్ల తుపాకుల కబంధ హస్తాల్లో కశ్మీర్ అందాలను చక్కగా చూపించారు.
ఆదిత్య ధార్ రచనా పరంగానే కాకుండా నిర్మాతగా ఈ సినిమా అత్యున్నత విలువలతో రూపొందించారు. ఈ చిత్రం గతేడాది నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై మంచి స్పందన సొంతం చేసుకొన్నది. కానీ ఇటీవల ఈ సినిమా గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసించడం, సినిమాలోని హిందూ ఆత్మల ప్రతీకారం గురించి తనదైన శైలిలో రివ్యూ చేయడంతో ఈ సినిమా మరోసారి ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ మీ కోసం..


Click it and Unblock the Notifications