twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Battala Ramaswami Biopikku మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: అల్తాఫ్ హుస్సేన్, లావణ్యారెడ్డి, సాత్వికా జే, శాంతి రావు, భద్రం
    Director: రాంనారాయణ్

    టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశంతో వస్తున్న చిన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జాతిరత్నాలు, మెయిల్ లాంటి చిత్రాలు విశేషంగా ఆదరణ పొందాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ కథా నేపథ్యంతో వచ్చిన రొమాంటిక్, కామెడీ చిత్రం బట్టల రామస్వామి బయోపిక్కు. ఈ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఏమున్నాయంటే...

     కథ ఏమిటంటే..

    కథ ఏమిటంటే..

    తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పూసలు అమ్ముతున్న జయప్రద (శాంతి రావు)ను రామస్వామి (అల్తాఫ్ హుస్సేన్) చూసి తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. గ్రామ పెద్దలను ఒప్పించి జయప్రదను రామస్వామి కులాంతర వివాహం చేసుకొంటాడు. ఆ తర్వాత చీరలు అమ్ముతూ బట్టల వ్యాపారం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఓ కారణంగా జయప్రద చెల్లెలు సుధ (లావణ్య రెడ్డి)ను కూడా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక చీరెలు అమ్ముతున్న నేపథ్యంలో పక్క గ్రామానికి చెందిన వాళ్లు మరో యువతి సిరి (సాత్వికా జయ్)ని రామస్వామికి బలవంతంగా కట్టబెట్టి పెళ్లి చేస్తారు. అయితే

    మూవీలో ట్విస్టులు

    మూవీలో ట్విస్టులు

    మొదటి పెళ్లి తర్వాత బట్టల రామస్వామి జీవితంలో ఎలాంటి సంఘటనలు చేటుచేసుకొన్నాయి? ఏ పరిస్థితుల్లో రామస్వామి రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? రెండో పెళ్లి తర్వాత రామస్వామి మూడో పెళ్లిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. మూడో పెళ్లి తర్వాత రామస్వామికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? బట్టల రామస్వామి ఏ పరిస్థితుల్లో చనిపోయాడు? నిజంగానే రామస్వామి చనిపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బట్టల రామస్వామి బయోపిక్కు మూవీ.

     దర్శకుడి ప్రతిభ గురించి

    దర్శకుడి ప్రతిభ గురించి

    బట్టల రామస్వామి చనిపోయిన సీన్‌తో కథ మొదలవుతుంది. భార్యలు మృతదేహం పక్కన రోదిస్తుండటం అనే చిన్న ట్విస్టుతో అసలు కథ మొదలవుతుంది. సున్నితమైన కామెడీతో కథ సాగుతుంది. కామెడీ, రొమాంటిక్ అంశాలను మేలవిస్తూ దర్శకుడు రాంనారాయణ్ కథను నింపాదిగా నడిపించాడనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యంతో పూర్తిగా తెలుగు నేటివిటితో చక్కగా కథను రాసుకొన్నాడని చెప్పవచ్చు. అయితే ఇంకా ఈ చిత్రాన్ని పూర్తిగా రొమాంటిక్ మూవీగా మార్చుకొనే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు ఆ అవకాశాన్ని మిస్ చేసుకొన్నారనిపిస్తుంది. ఎంచుకొన్న పాయింట్ మంచిదైనా దానిని పూర్తిగా వినోదాత్మక చిత్రంగా మలవడంలో తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది.

     నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    బట్టల రామస్వామిగా అల్తాఫ్ హుస్పేన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. వెండితెరకు కొత్తవాడైనప్పటికీ మెచ్యురిటీతో కూడిన నటనను ప్రదర్శించాడు. కామెడీ, ఎమోషనల్ సీన్లలో పరిణతిని చూపించాడు. సినిమా కథను తన భుజాల మీద మోస్తూ మెప్పించే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ముగ్గురు భార్యల మధ్య నలిగి పోయిన భర్తగా తన పాత్రకు అల్తాఫ్ న్యాయం చేశాడు. జయప్రదగా శాంతిరావు, సుధగా లావణ్య రెడ్డి, సిరిగా సాత్వికా జయ్ తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. భద్రం తనదైన శైలిలో కామెడీని పండించారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు.

    టెక్నికల్ విభాగాల పనితీరు.

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు పీఎస్‌కే మణి సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణ. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా కెమెరాలో బంధించారు. ఈ సినిమాకు మరో పాజిటివ్ అంశం మ్యూజిక్. దర్శకుడు రాంనారాయణ్ స్వయంగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సాగర దాడి ఎడిటింగ్, మాన్వి గౌతమ్ క్యాస్టూమ్స్ సినిమా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌గా మారాయి. రామకృష్ణ వీరపనేని, సతీష్ కుమార్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సీన్ సీన్ చిరుగుద్ది, ఓరోరి బైరాగి పాటలు ఆకట్టుకొంటాయి.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    కామెడీ టచ్‌తో కొంత ఎమోషనల్ పాయింట్స్ తెరకెక్కిన తెలుగు నేటివిటి చిత్రం బట్టల రామస్వామి బయోపిక్కు. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలం కాగా, కథలో కొన్ని లోపాలు, కథనంలో వేగం లేకపోవడం ఈ సినిమాకు బలహీనంగా మారాయి. ఈ కథలో మంచి సోషల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ వాటిని ప్రేక్షకుడిని మెప్పించే విధంగా చెప్పలేకపోయారనిపిస్తుంది. ట్విస్టుల ఆధారంగా సాగే ఈ సినిమా బీ, సీ కేటగిరి ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోగలిగితే బట్టల రామస్వామి బయోపిక్‌కు మంచి సక్సెస్ లభించే అవకాశం ఉంది.

    Recommended Video

    Prema Pipasi Movie Technicians Speech
     నటీనటులు

    నటీనటులు

    నటీనటులు: అల్తాఫ్ హుస్సేన్, లావణ్యారెడ్డి, సాత్వికా జే, శాంతి రావు, ధన్ రాజ్, భద్రం, శ్రీ చందన తదితరులు
    మ్యూజిక్, దర్శకత్వం: రాంనారాయణ్
    నిర్మాతలు: రామకృష్ణ వీరపనేని, సతీష్ కుమార్
    రచన: వాసుదేవ మూర్తి
    సినిమాటోగ్రఫి: పీఎస్‌కే మణి
    ఎడిటింగ్: సాగర్ దాడి
    ఆర్ట్: ఉపేందర్ రెడ్డి
    క్యాస్టూమ్స్: మాన్వి గౌతమ్
    కొరియోగ్రఫి: హరి తాటిపల్లి
    రిలీజ్: 2021-05-14
    ఓటీటీ రిలీజ్: Zee 5

    English summary
    Battala Ramaswami biopikku is a romantic, comedy movie with Telugu nativity. Altaf Hassan, Lavanya Reddy, Satvika Jay, Shanti Rao are the lead pair. Directed by Ram Narayan. Produced by Ramakrishna Veerapaneni, Satish Kumar. This movie hit the screens via Zee 4 OTT on May 14, 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X