Bazooka First Review: బజూకా మూవీ ఫస్ట్ రివ్యూ.. మమ్ముట్టి ఖాతాలో హిట్టు పడేనా?
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం బజుకా. యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు డీనో డెన్నీస్ దర్శకత్వం వహించారు. డాల్వీన్ కురికోజ్, జిను వీ అబ్రహం, విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మాతలు. థియేటర్ ఆఫ్ డ్రీమ్స్, యూడ్లీ ఫిల్మ్స్, సారేగమ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రివ్యూ విషయానికి వస్తే..
బజూకా సినిమా విషయానికి వస్తే.. ఓ సీరియల్ కిల్లర్‌ను పట్టుకొనేందుకు ఓ పోలీస్ ఆఫీసర్, బిజినెస్‌మ్యాన్ చేసే ప్రయత్నమే బజూకా. ఆ సీరియల్ కిల్లర్‌ను ఎలాంటి నాటకీయ పరిణామాల మధ్య పట్టుకొన్నారనేది సినిమా కథ. ఈ చిత్రంలో బిజినెస్‌మెన్‌గా మమ్ముట్టి, పోలీస్ ఆఫీసర్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించారు. ఇంకా ఈ చిత్రంలో బాబు అంథోని, నీతా పిళ్లై, దియా పిళ్లై, ఐశ్వర్య మీనన్, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు.

బజుకా సినిమాను మీడియం బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు నిమిష్ రవి, రాబీ వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫి, నిశద్ యూసఫ్, ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటర్లుగా, సయీద్ అబ్బాస్ మ్యూజిక్ అందించారు. మమ్ముట్టి రెమ్యునరేషన్ మినహాయించి ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మమ్మట్టి నటించిన బజుకా సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులు సమీక్షించారు. ఈ సినిమాలోని ఆరు సన్నివేశాలపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశంలో LSD అనే పదం ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసి.. ఆ పదాన్ని మార్చాలని సూచించారు. అలాగే స్మోకింగ్ చేసే సన్నివేశాల్లో డిస్‌క్లైమర్, అలాగే Fucking వర్డ్‌ను ఉపయోగించడాన్ని తొలగించాలని సూచించారు.
బజుకా చిత్రంలో కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలతో మొత్తంగా 6 కట్స్‌తో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అధికారులు జారీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరుపై సెన్సార్ అధికారులు ప్రశంసలు గుప్పించినట్టు తెలిసింది.
బజుకా చిత్రం క్రైమ్, మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రంలో మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్టింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. షైన్ టామ్ చాకో, ఐశ్వర్య మీనన్, దియా, నీతా పిళ్లై పాత్రలు మూవీకి బలంగా మారినట్టు అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











