Bazooka Twitter Review : బజూకా మూవీ ట్విట్టర్ రివ్యూ.. మమ్ముట్టి, గౌతమ్ మీనన్ హిట్ కొట్టారా?

bazooka Movie Twitter Review in Telugu  Mammootty and Gautham Vasudev Menon hits bulls eye

థియేటర్ ఆఫ్ డ్రీమ్స్, యూడ్లీ ఫిలిమ్స్, సరిగమ బ్యానర్‌లపై డాల్విన్ కురియకోస్, జిను వీ అబ్రహం, విక్రమ్ మెహ్రా, సిద్ధార్ధ్ ఆనంద్ కుమార్‌లు సంయుక్తంగా ఈ బజూకా చిత్రాన్ని దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు నిమిష్ రవి, రాబీ వర్గీస్ రాజ్‌లు సినిమాటోగ్రఫర్‌లుగా సేవలందించగా.. సయీద్ అబ్బాస్ సంగీత సారథ్యం వహించారు. ప్రీమియర్ షో తర్వాత ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే?

బజూకా ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అదిరిపోయిందని .. మమ్ముట్టి టైటిల్ కార్డ్స్ పీక్స్‌ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

స్టైలీష్ మేకింగ్‌తో చితక్కొట్టారని.. ఇచ్చిన మాటని చిత్ర యూనిట్ నిలబెట్టుకుందని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. ఇది మాలీవుడ్ ప్రేక్షకులకు పూర్తిగా కొత్తగా ఉన్నప్పటికీ.. అర్ధమయ్యేలా తీశారని ప్రశంసించాడు. ఫస్ట్, సెకండ్ హాఫ్‌లు ఎక్కడా డిజప్పాయింట్ చేయకుండా ప్రేక్షకులకు మంచి మూవ్‌మెంట్స్ అందించాయని రాసుకొచ్చాడు. చివరి 30 నిమిషాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.. మమ్ముట్టి పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉందని, ఆడియన్స్ స్టేడియం మోడ్‌లోకి వెళ్లిపోవడం గ్యారెంటీ అని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

కోవిడ్ తర్వాత మమ్ముక్క నటించిన అత్యంత చెత్త సినిమాగా బజూకా నిలిచిపోతుందని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మమ్ముట్టి కెరీర్‌లో అత్యంత చెత్త ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తుందని మండిపడ్డాడు.

బజూకా ఫస్టాఫ్ యావరేజ్, చివరి 20 నిమిషాల వరకు బిలో యావరేజ్ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. సినిమా మొత్తంలో పీక్స్‌గా అనిపించినవవి, ఎంగేజింగ్‌ మూవ్‌మెంట్స్ లేవు. మేకింగ్, సినిమాటోగ్రఫీ, నటీనటుల పర్ఫార్మెన్స్‌ బాలేదని ముఖ్యంగా మ్యూజిక్ పెద్ద లోపమని అభిప్రాయపడ్డాడు. ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ 2/5 అని ఆ నెటిజన్ పోస్ట్ చేశాడు. చివరిలో మమ్ముట్టి ఫ్యాన్స్‌‌కు నిరాశేనని రాశాడు.

బజూకా మమ్ముట్టి మాస్టర్ క్లాస్.. థ్రిల్లింగ్, టెక్నికల్లీ స్టన్నింగ్, ప్రతి సెకండ్ వర్తబుల్ అని ఓ యూజర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. చివరి 30 నిమిషాలు ఫైర్ అని, మమ్ముక్క అల్టీమేట్.. స్టేడియం మోడ్ యాక్టీవేటేడ్.. వర్త్ వర్మ .. వర్తూ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు

బజూకా స్లోగా మొదలై హై ఇంటర్వెల్ పంచ్‌తో ఫస్టాఫ్ ముగించింది. సెకండాఫ్ ఆసక్తికరంగా సాగింది, చివరి 20 నిమిషాలు మమ్ముట్టి పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. సినిమాటోగ్రఫి, టెక్నికల్‌గా, ముఖ్యంగా సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బ్యాంగర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇప్పుడే బజూకా చూశాను. డైరెక్షన్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి బాగున్నాయి. బజూకా మిమ్మల్ని కట్టిపడేసే గేమ్ మోనోమానియక్ చుట్టూ తిప్పుతుంది.. మమ్ముక్క డైమండ్, క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్. డీనో డెన్నిస్, సయీద్ అబ్బాస్‌ల డెబ్యూ ప్రాజెక్ట్ అదిరిపోయింది.. బజూకాను మిస్ కావొద్దని ఓ యూజర్ తన రివ్యూ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X