Beast Review ప్రేక్షకుల సహనానికి పరీక్ష.. విజయ్, నెల్సన్‌ కాంబినేషన్ మరీ దారుణంగా!

Rating:
2.0/5
Star Cast: విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్ల్సే
Director: నెల్సన్ దిలీప్ కుమార్

Recommended Video

Beast Movie Review విజయ్, నెల్సన్‌ కాంబినేషన్ మరీ దారుణంగా! | Filmibeat Telugu

నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌లే తదితరులు
రచన, దర్శకత్వం: నెల్సన్
నిర్మాణం: సన్ పిక్చర్స్
మ్యూజిక్: అనిరుధ్
డీవోపీ: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: R నిర్మల్
ఆర్ట్: డీఆర్‌కే కిరణ్
యాక్షన్: అంబరివ్
కొరియోగ్రఫి: జాని, గోపి ప్రసన్న
రిలీజ్ డేట్: 2022-04-13

 బీస్ట్ కథేంటంటే?

బీస్ట్ కథేంటంటే?

వీర రాఘవన్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా) విభాగంలో ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. పాక్ సరిహద్దులో జరిగిన ఓ సంఘటన కారణంగా తన విధులకు దూరమవుతాడు. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌ను పాక్ అనుకూల ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్ (పూజా హెగ్డే)తో అక్కడ ఉంటాడు.

 బీస్ట్ కథలో ట్విస్టులు

బీస్ట్ కథలో ట్విస్టులు


ఈస్ట్ కోస్ట్ మాల్‌ హైజాక్ సంఘటనకు వీర రాఘవన్ ఎలా స్పందించాడు? ఈస్ట్ కోస్ట్ మాల్‌ను ఉగ్రవాదులు ఎందుకు హైజాక్ చేశారు? ఉగ్రవాదుల డిమాండ్లను తిప్పి కొట్టేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశాడు? మాల్‌లో ప్రజలను బందీలుగా పట్టుకొన్న టెర్రరిస్టులకు ఎలాంటి సవాల్ విసిరాడు? హైజాక్ ఘటనలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలా రొమాన్స్ చేశాడు? బందీలను చివరకు ఎలా విడిపించాడు? అనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే బీస్ట్ సినిమా కథ.

ప్లస్, మైనస్ పాయింట్స్

ప్లస్, మైనస్ పాయింట్స్


ప్లస్ పాయింట్స్
పెద్దగా చెప్పుకోనేంతగా ఏమీ లేవు
అక్కడక్కడ కొంత వినోదం
అరబిక్ కుత్తు పాట

 మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్


పేలవమైన కథ
ఆకట్టుకొని కథనం
డైరెక్షన్
బలమైన విలన్ లేకపోవడం
నిస్సారంగా సాగే సన్నివేశాలు
మెప్పించని సాంకేతిక విభాగాల పనితీరు

దర్శకుడు నెల్సన్ కుమార్ గురించి

దర్శకుడు నెల్సన్ కుమార్ గురించి


విభిన్నమైన కథ, వినోదం నేపథ్యంగా రూపొందిన డాక్టర్ చిత్రంతో నెల్సన్ దిలీప్ కుమార్ తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యారు. ఆ చిత్రం తర్వాత దళపతి విజయ్‌తో బీస్ట్ అని ప్రకటన రాగానే.. తెలుగు, తమిళ రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే బీస్ట్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల్లో ఒక శాతం కూడా అందుకోలేకపోయాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. కథే లేకుండా తెర మీద చేసిన విన్యాసాలు దారుణంగా ఉన్నాయి. ఆద్యంతం విసుగు పుట్టించే సన్నివేశాలు, ఊహకు అందని, సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేనంతగా కథనం, యాక్షన్ సీన్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేంతగా ఉన్నాయి. కెప్టెన్ ఆఫ్ ది షిప్‌‌గా డైరెక్టర్‌గా విలక్షణతను చూపించుకోవడంలోను, అన్ని విభాగాలను సరైన దిశగా నడిపించడంలో దారుణంగా విఫలమయ్యాడని చెప్పవచ్చు.

విజయ్ ఫెర్ఫార్మెన్స్ గురించి

విజయ్ ఫెర్ఫార్మెన్స్ గురించి


దళపతి విజయ్ అంటే.. కంటెంట్‌కు సంబంధించి రాజీ పడరనే విషయం ఆయన నటించిన గత చిత్రాలు రుజువు చేశాయి. ఆ మేరకు ప్రేక్షకులకు మంచి ఆదరణను చూపించారు. దాంతో విజయ్ అంటే సక్సెస్‌కు చిరునామా అనే బ్రాండ్ క్రియేట్ అయింది. బీస్ట్ చూస్తే అలాంటి అంశాలకు చాలా దూరంగా ఉన్నట్టు విజయ్ కనిపిస్తాడు. అసలు కథను ఎలా ఒప్పుకొన్నాడా? అనే ప్రశ్న సినిమా చూసినంత సేపు వెంటాడుతుంది. ఎక్కడ కూడా విజయ్ స్టార్‌డమ్ తగినట్టు సినిమాలో ఫెర్ఫార్మెన్స్ కనిపించలేదంటే అభిమానులు నమ్మడం కష్టమే. వెరసి విజయ్ కెరీర్‌లోనే అత్యంత నాసిరకమైన సినిమాగా బీస్ట్ మారే ప్రమాదం ఉంది.

షో కేసులో పూజా బుట్టబొమ్మలానే..

షో కేసులో పూజా బుట్టబొమ్మలానే..


ఇక పూజా హెగ్డే పాత్ర విషయానికి వస్తే.. షో కేసులో పెట్టిన బొమ్మ మాదిరిగానే కనిపిస్తుంది. అడపాదడపా గ్లామర్ పండిస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె పాత్రకు కథలో స్కోపే లేకపోవడంతో ఆమె అందాలు అడివి కాసిన వెన్నెలగానే మిగిలింది. అందాల ఆరబోతను ఆశించిన సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. పాటల్లో కూడా జూనియర్ ఆర్టిస్టు మాదిరిగానే కనిపిస్తుంది.

మిగితా నటీనటులు

మిగితా నటీనటులు


మిగితా నటీనటుల విషయానికి వస్తే.. ఉగ్రవాదులకు బాస్‌గా నటించిన అంకూర్ అజిత్ వికాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఉగ్రవాద సంస్థ నాయకుడు ఉమర్ పాత్రలో కనిపించిన లిల్లీపుట్ ఫరూక్ పాత్ర నామమాత్రంగానే మిగిలింది. సెల్వ రాఘవన్ పాత్ర కూడా పండలేకపోయింది. సెక్యూరిటీ కంపెనీ బాస్‌గా నటించిన వీటీవీ గణేష్ తన హాస్యంతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకొనే ప్రయత్నం చేశాడు. డాక్టర్ చిత్రంలో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించిన రెడిన్ కింగ్ల్సే నిరాశపరిచాడు. యోగిబాబు పాత్ర కూడా సరిగా డిజైన్ చేయకపోవడంతో అతడి టాలెంట్ గంగపాలు అయింది. మిగితా నటీనటులు కూడా కథా ప్రవాహంలో కొట్టుకుపోయారే తప్ప.. గుర్తుంచుకొనే విధంగా నటించే దాఖలాలు కనిపించవు.

 టెక్నికల్ అంశాల గురించి

టెక్నికల్ అంశాల గురించి


సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కొంతలో కొంత అనిరుధ్ ఒకే అనిపిస్తాడు. అది కూడా కేవలం అరబిక్ కుత్తు పాట కారణంగానే కొన్ని మార్కులు సంపాదించుకొన్నాడని చెప్పవచ్చు. ఆడియోలో పాట మంచి పాపులారిటీ సంపాదించినా.. తెర మీద సో సోగానే అనిపించింది. కథ, సన్నివేశాల్లో దమ్ము లేకపోవడం వల్ల బీజీఎం పరంగా రాణించలేకపోయాడని చెప్పవచ్చు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి ఒకే అనిపిస్తుంది. డీఆర్‌కే కిరణ్ ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. ఈస్ట్ కోస్ట్ మాల్ సెట్ ఆకట్టుకొంటుంది. క్లైమాక్స్‌లో గ్రాఫిక్ వర్క్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా


హైజాక్ డ్రామా, పొలిటికల్ సెటైర్స్‌తో నేపథ్యంగా రూపొందిన బీస్ట్ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలమైంది. నాసిరకమైన కథ, కథనాలు ప్రేక్షకుల సహనానికి భారీ పరీక్షగా మారాయి. విజయ్ సినిమాకు సంబంధించిన కనీస ప్రమాణాలు కూడా కనిపించవు. సగటు ప్రేక్షకుడి విషయాన్ని పక్కన పెడితే.. అభిమానులు కూడా ఈ సినిమాను జీర్ణించుకోవడం కష్టమే. ఎందుకైనా మంచిది.. ఈ సినిమాకు ఎంత దూరం ఉంటే.. ఆరోగ్యానికి అంత మంచిందని చెప్పవచ్చు.


ట్యాగ్ లైన్:
బీస్ట్.. వేస్ట్.. వరస్ట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X