Beauty Movie Review: బ్యూటీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: అంకిత్ కోయా, నిలాఖీ పాత్ర, వీకే నరేష్, వాసుకి ఆనంద్, ప్రసాద్ బెహ్రా, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్ తదితరులు
దర్వకత్వం: జేఎస్ఎస్ వర్ధన్
కథ, స్క్రీన్ ప్లే: ఆర్వీ సుబ్రమణ్యం
నిర్మాత: అడిదల విజయ్‌పాల్ రెడ్డి
సమర్పణ: జీ స్టూడియోస్
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫి: శ్రీ సాయికుమార దారా
ఎడిటర్: ఎస్‌బీ ఉద్దవ్
ఆర్ట్: బేబీ సురేష్ భిమగన్
బ్యానర్: వానర సెల్యూలాయిడ్, జీ స్టూడియోస్, ఏ మారుతి టీమ్ ప్రొడక్ట్
రిలీజ్ డేట్: 2025-09-19

క్యాబ్ డ్రైవర్‌గా జీవితాన్ని భారంగా లాగిస్తున్న నారాయణ కూతురు అలేఖ్య (నిలాఖీ పాత్ర) కాలేజీ స్టూడెంట్. కాలేజీకి వెళ్లడానికి స్కూటీ కావాలని తండ్రిని కోరుతుంది. ఈ క్రమంలో డాగ్ ట్రైనర్ అర్జున్‌ (అంకిత్ కోయా)తో పరిచయం ప్రేమగా మారుతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్జున్‌తో సన్నిహితంగా ఉండి.. పక్కింటి వాళ్లకు దొరికిపోతుంది. పీకల్లోతూ ప్రేమలో మునిగిన అలేఖ్య ప్రియుడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ తల్లి (వాసుకి)కి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతుంది. దాంతో తన కూతురు చేసిన చేష్టలకు ఆగ్రహం చెంది విపరీతంగా కొడుతుంది. తల్లిదండ్రుల తనను ఏమంటారో అని అర్జున్‌తో కలిసి అలేఖ్య లేచిపోతుంది.

Beauty Movie Review

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న నారాయణ తన కూతురుకు స్కూటీ కొనిచ్చాడా? అర్జున్‌తో అలేఖ్య పరిచయం ఎలా జరిగింది? అర్జున్‌తో అలేఖ్య ఎలా సన్నిహితంగా పెరిగింది? పక్కింటి వాళ్ల ఇంట్లో అర్జున్‌తో అలేఖ్య ఎలా పట్టుబడింది? అర్జున్‌తో అలేఖ్య అసభ్యంగా, అశ్లీలంగా బిహేవ్ చేస్తూ తల్లికి ఎలా దొరికింది? అర్జున్‌తో లేచిపోయిన తర్వాత అలేఖ్యకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కూతురు వెతుక్కొంటూ నారాయణ ఎక్కడికి వెళ్లాడు? కూతురు కోసం నారాయణ పడిన కష్టాలు ఏమిటి? చివరకు అర్జున్ గురించి అలేఖ్యకు తెలిసిన భయంకరమైన నిజం ఏమిటి? అర్జున్ చేసిన మోసానికి అలేఖ్య తీసుకొన్న నిర్ణయం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే బ్యూటీ సినిమా కథ.

బ్యూటీ సినిమా కథ విషయానికి వస్తే.. నేటి సమాజంలో ప్రేమ, రొమాన్స్ పేరుతో యువతీ, యువకులు చేస్తున్న చేష్టలకు అద్దం పట్టే సినిమా. అయితే కథలో కొత్తదనం ఏమీ లేకపోవడం, ఇది వరకే వచ్చిన కథ మాదిరిగా ఈ సినిమా స్టోరి ఉండటం మైనస్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో తండ్రి, కూతురు మధ్య రాసుకొన్న సరదా, ఎమోషనల్‌ సీన్లు వర్కువుట్ అయ్యాయి. కానీ సెకండాఫ్‌లో క్లైమాక్స్ కోసం రాసుకొన్న ట్విస్టు కోసం.. అప్పటి వరకు కథ, సన్నివేశాలను సాగదీసినట్టుగా ఉండటం బోర్‌గా అనిపిస్తాయి. భావోద్వేగమైన ప్రేమ కథకు కావాల్సిన సాంగ్స్, మ్యూజిక్ ఈ సినిమాలో కొరవడటం వల్ల మరో రేంజ్‌కు ఈ కథ వెళ్లలేకపోయిందని చెప్పవచ్చు. దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే విషయంలోను, క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త బెటర్‌గా ప్లాన్ చేసి ఉండాల్సిందనిపిస్తుంది.

క్యూట్ లవ్ స్టోరి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథలో అలేఖ్యగా నటించిన నిలాఖీ పాత్ర అదిరిపోయేలా పెర్ఫార్మెన్స్ చేసింది. చాలా నేచురల్‌గా, క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకొన్నది. రొమాంటిక్ సీన్లలోను, భావోద్వేగమైన సన్నివేశాల్లోను పూర్తిస్థాయిలో మెప్పించింది. నటనకు కొత్తైనా అనుభవం ఉన్న నటిగా తనదైన శైలిలో నటించింది. అంకిత్ కోయా మరోసారి ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించారు. ఆయన క్యారెక్టర్ గురించి తెరపైనే చూస్తే థ్రిల్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. వీకే నరేష్, వాసుకి సహజ నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపిస్తారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. బేబీ లాంటి సినిమాకు అద్బుతమైన పాటలు అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమా విషయంలో విఫలమయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంటుంది. వైజాగ్ అందాలను సాయికుమార దారా సూపర్బ్‌గా క్యాప్చర్ చేశాడు. సెకండాఫ్‌లో కొన్ని సీన్ల విషయంలో ఎడిటర్ ఉద్దవ్ కొంత కఠినంగా ఉంటే.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ పెరిగేవి అనిపిస్తుంది.ఈ సినిమాకు ఆర్ట్ వర్క్ బాగుంది. వానర సెల్యూలాయిడ్, జీ స్టూడియోస్, ఏ మారుతి టీమ్ ప్రొడక్ట్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్రజెంట్ జనరేషన్‌లో యూత్‌ బిహేవియర్, లైఫ్ స్టయిల్ అంశాలను తీసుకొని లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. తెలుగులో ఇదివరకే వచ్చిన సినిమాకు ఈ కథ ఏ మాత్రం తేడా లేకుండా ఉంటుంది. దాంతో కొత్తగా చూసిన ఫీలింగ్ ఉండదు. ఈ ఒక్క విషయం తప్పా.. ఆర్టిస్టులు నటన ఈ సినిమా కథను బాగా ఎమోషనల్‌గా మార్చింది. ఈ తరం తల్లిదండ్రులు, యువతీ, యువకులు చూడాల్సిన సినిమా అనిపిస్తుంది. ప్రేమ కథలను, యూత్‌కు మెసేజ్ ఇచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Read more about: beauty Ankith Koyya Nilakhi Patra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X