Bedurulanka 2012 Review యుగాంతం బ్యాక్‌డ్రాప్‌తో ఫుల్ ఫన్ రైడ్.. బెదురులంక మూవీ రివ్యూ
నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు
రచన, దర్శకత్వం: క్లాక్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని,
సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల,
సమర్పణ: సి. యువరాజ్,
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫి: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి,
యాక్షన్: అంజి, పృథ్వీ
కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల
పీఆర్వో: పులగం చిన్నారాయణ
ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా
కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్
రిలీజ్ డేట్: 2023-08-25
బెదురులంక గ్రామానికి చెందిన శివ శంకర వరప్రసాద్ అలియాస్ శివ సినిమా పరిశ్రమలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తుంటాడు. ముక్కుసూటితనం, మనసు చెప్పింది చేసే గుణం కారణంగా ఎదుటి వారికి శత్రువులా కనిపిస్తుంటాడు. బెదురలంక గ్రామ ప్రసిడెంట్ (గోపరాజు రమణ) కూతురు చిత్ర (నేహా శెట్టి)ని ప్రేమిస్తుంటాడు. అయితే యుగాంతం జరగబోతుందనే వార్తతో బెదురులంక గ్రామంలో అలజడి మొదలవుతుంది. (Bedurulanka 2012 Review) ప్రజల బలహీనతలను, మూఢ నమ్మకాలను ఆసరగా చేసుకొని దిగంబర బ్రహ్మ (శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్ (ఆటో రాంప్రసాద్), బెదురులంక చిరంజీవి అలియాస్ భూషణం (అజయ్ ఘోష్) ఓ కుట్ర పన్నుతారు. అయితే ప్రజలను మోసగించాలనే ఈ ముగ్గురి ప్లాన్‌కు శివ ఎదురు తిరుగుతాడు.

ముక్కుసూటితనం వల్ల శివకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? యుగాంతం కాబోతున్నదనే విషయంతో బెదురులంక గ్రామంలో ఎలాంటి పరిస్థితులు కనిపించాయి? దేవుడిపై భక్తి ఆసరగా చేసుకొని బ్రహ్మం, డేనియల్, భూషణం ఎలాంటి కుట్ర పన్నారు? బెదురులంక ప్రజలను ఎలా ట్రాప్ చేశారు? చిత్ర, శివ ప్రేమకు యుగాంతం ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? బ్రహ్మం, డేనియల్, భూషణం ఎత్తుగడలను, కుట్రలను శివ ఎలా చెక్ పెట్టారు? చిత్రను పెళ్లాడానికి ఎలాంటి అడ్డంకులను శివ అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే బెదురులంక 2012 మూవీ కథ (Bedurulanka 2012 Review).
యుగాంతం కాబోతుందనే పాయింట్‌తో గ్రామీణ ప్రజల మనస్తత్వాలు, మూఢ నమ్మకాలను ఆసరగా చేసుకొని దొంగ బాబాలు, స్వాములు ఎలా సొమ్ము చేసుకొంటారనే పాయింట్‌కు క్యూట్ లవ్ స్టోరిని, ఫన్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు క్లాక్స్ రాసుకొన్న పాయింట్ బాగుంది. డిఫరెంట్ క్యారెక్టర్ల చుట్టూ రాసుకొన్న సన్నివేశాలు, గోదావరి యాస ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేలా దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది.బెదురులంక 2012 (Bedurulanka 2012 Review) కథ, కథనాలు, ఫన్ ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి.. అయితే ఎమోషన్స్ పూర్తిగా పండి ఉండే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. తెలుగుదనాన్ని దట్టించి కథను నడిపించిన విధానం బాగుంది. క్లైమాక్స్ మరింత ఎమోషనల్‌గా వర్కవుట్ చేయాల్సి ఉండాల్సిందనిపిస్తుంది.

బెదురులంక 2012 (Bedurulanka 2012 Review) మూవీ ఫస్టాఫ్ విషయానికి వస్తే.. పాత్రల స్వభావాన్ని, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం తీసుకొన్నప్పటికీ.. ప్రతీ సీన్‌లో ఆహ్లాదకరమైన గోదావరి జిల్లాల వెటకారం, ఆ ప్రాంతంలో ఉండే ప్రజల అమాయకత్వాన్ని నేచురల్‌గా చూపించడంతో కథ ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ కొంత రొటీన్‌గా సాగదీసినట్టు అనిపించినా.. సెకండాఫ్‌లో కథను నడిపించిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టిందని చెప్పవచ్చు.
బెదురులంక 2012 (Bedurulanka 2012 Review) మూవీలో నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయానికి వస్తే.. శివగా కార్తికేయ తన పాత్రలో ఒదిగిపోయాడు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. నేహా శెట్టితో రొమాంటిక్ సీన్లలో మంచి కెమిస్ట్రీని వర్కవుట్ చేశాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో డైలాగ్స్ కార్తికేయ చెప్పిన విధానం బాగుంది. డీజే టిల్లు మూవీతో గ్లామర్ పంట పడించిన నేహా శెట్టి ఈ చిత్రంలో పక్కా గ్రామీణ యువతిగా ఫుల్ వేరియషన్స్ చూపించింది. పాత్ర పరిధి మేరకు రొమాన్స్ పండించింది. అందం, అభినయంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.

బెదురులంక 2012 (Bedurulanka 2012 Review) మూవీలో ఇతర క్యారెక్టర్ల విషయానికి వస్తే.. శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, రాంప్రసాద్, గోపరాజు రమణ సినిమా భారాన్నంత మోశారు. కథ హాస్యాన్ని పడించడంలో ఈ నలుగురు ప్రధాన పాత్ర పోషించారు. ప్రీ క్లైమాక్స్ నుంచి సత్య, వెన్నెల కిషోర్ తమదైన కామెడీతో సినిమాను మరింత వినోదంగా మార్చారు. ఇతర పాత్రల్లో కనిపించిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.
బెదురులంక 2012 (Bedurulanka 2012 Review) సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను హై రేంజ్‌లో ఎలివేట్ చేశాయి. లంక గ్రామాన్ని సినిమాటోగ్రాఫర్ అద్బుతంగా చూపించాడు. పల్లె అందాలతో కనువిందు చేశారు. చిన్నపిల్లల ట్రాక్‌తో డైలాగ్స్ చెప్పించిన కామెడీ ట్రాక్ ఆకట్టుకొంటుంది. కొంత నిడివి తగ్గించి ఉంటే ఇంకా బెటర్ ఫీల్ వర్కవుట్ అయి ఉండేదనిపిస్తుంది.

ఏదైనా విపత్తు ముంచుకొస్తుందనే సమయంలో ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకొని మోసాలకు పాల్పడే వ్యక్తులు, పరిస్థితుల ఆధారంగా చేసుకొని రాసిన లవ్, ఫన్ మూవీ బెదురులంక 2012. తెలుగు నెటివిటితో మనచుట్టూ జరిగే కథ మంచి ఫీల్ కలిగిస్తుంది. ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను మరింతగా జోడించి, పండించి ఉంటే.. ఇంకా బెటర్‌గా ఉండటానికి ఆస్కారం ఉండేది. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అలరించే చాలా విషయాలు ఉన్నాయి. రెండున్నర గంటలపాటు ఫన్ రైడ్‌ను ఎంజాయ్ చేయాలనుకొంటే బెదురులంక 2012 కేరాఫ్ అడ్రస్. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయితే భారీ విజయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











