twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కవచం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Kavacham Movie Review & Rating కవచం మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Filmibeat Telugu

    Rating:
    2.0/5
    Star Cast: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే
    Director: శ్రీనివాస్ మామిళ్ళ

    ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ చేరకపోవడం కొంత అసంతృప్తి కలిగించే అంశం. అలాంటి పరిస్థితుల్లో వస్తున్న చిత్రం కవచం. కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రానికి నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 7 న విడుదలైన ఈ చిత్రం బెల్లంకొండ శ్రీనుకు భారీ సక్సెస్ అందించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కవచం కథ ఏంటంటే

    కవచం కథ ఏంటంటే

    విశాఖపట్నంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఓ సంయుక్త (కాజల్ అగర్వాల్)ను చూసి ప్రేమిస్తాడు. ఓ కారణంగా విజయ్‌కి లావణ్య దూరమవుతుంది. ఆ క్రమంలో ఓ సమస్యలో చిక్కుకున్న లావణ్య (మెహ్రీన్)ను విజయ్ కాపాడుతాడు. కానీ తన పేరు ప్రముఖ కంపెనీ అధినేత మేనకోడలు సంయుక్త అని అబద్ధం ఆడుతుంది. ఇలాంటి నేపథ్యంలో విజయ్‌కి రూ.50 లక్షల డబ్బు అవసరం అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో లావణ్యను సంయుక్తగా భావించి విజయ్ కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడుతాడు. కానీ విక్రమాదిత్య ఆడిన కిడ్నాప్ డ్రామాలో విజయ్ చిక్కకుంటాడు.

    కవచంలో ట్విస్టులు

    కవచంలో ట్విస్టులు

    విజయ్‌కి సంయుక్త ఎందుకు దూరమైంది? లావణ్య తన పేరును ఎందుకు సంయుక్త అని చెప్పుకొన్నది. కిడ్నాప్ డ్రామాలో విక్రమాదిత్యకు ఉన్న ప్రయోజనం ఏమిటి? చివరకు తనపై వచ్చిన కిడ్నాప్ ఆరోపణల నుంచి విజయ్ ఎలా తప్పించుకొన్నాడు. విజయ్‌కి సంయుక్తం చేరువైందా? లావణ్య సమస్యల నుంచి గట్టెక్కిందా అనే ప్రశ్నలకు సమాధానమే కవచం సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    తొలిభాగంలో రొటీన్ కథ, కథనాలతో బెల్లంకొండ శ్రీను పాత్ర ఇంట్రడక్షన్ ఉంటుంది. పోసాని కృష్ణమురళి, శ్రీను మధ్య సీన్లు పరమ రొటీన్‌గా ఉంటాయి. కథలో కొత్తదనం లేదనిపిస్తున్న సమయంలో కాజల్‌ను తెరపైకి తెచ్చి కొంత ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేశాడు. కానీ అదీ మరీ ఎక్కువ సేపు లేకపోయింది. కాకపోతే లావణ్య అసలు సంయుక్త కాదని ఇంటర్వెల్‌ ముందు ట్విస్టు ఇవ్వడం కథలో మ్యాజిక్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక సంయుక్త నిజంగానే కిడ్నాప్ అయిందనే అంశం చాలా ఇంట్రస్టింగ్‌గా మారుతుంది.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో విజయ్‌ని పోలీసులు ఛేజ్ చేయడం, నీల్ నితిన్ ముఖేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లు ఆకట్టుకోలేకపోయాయి. కథనం, కథలో ఎక్కువ ట్విస్టులు ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేసేలా ఉంటాయి. చివరకు చాలా రోటీన్ వ్యవహారంతో కథను క్లైమాక్స్‌కు లాక్కెళ్లినట్టు అనిపిస్తుంది. చివర్లలో సంపన్నురాలైన కాజోల్ (సంయుక్త) సామాన్యుడైన బెల్లంకొండ శ్రీను (విజయ్)ను ప్రపోజ్ చేయడం చాలా బాగుంది. సినిమాలో ఇంకా ఇలాంటి ఫీల్‌గుడ్ ఎలిమింట్స్ ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల అన్నప్రసాన రోజునే అవకాయ తినే ప్రయత్నం చేశాడని ఫీలింగ్ కలుగుతుంది. పాయింట్ మంచిదే కానీ ఓ మంచి కథగా, సంపూర్ణమైన కథనంగా మార్చలేకపోయాడని చెప్పవచ్చు. సినిమాలో లెక్కకు మించి ట్విస్టులు, వాస్తవానికి దూరంగా కొన్ని అంశాలు ఇబ్బందిగా అనిపిస్తాయి. కథలో ఉండే లింకులను కలిపే విషయంలో చాలా పరిపక్వత కనిపించదు. కథ, కథనాలపై మరింత కసరత్తు చేయాల్సి ఉండాల్సింది.

    బెల్లంకొండ శ్రీను పెర్ఫార్మెన్స్

    బెల్లంకొండ శ్రీను పెర్ఫార్మెన్స్

    బెల్లంకొండ శ్రీనివాస్ ప్రతీసారి తన సామర్థ్యానికి మించిన భారాన్ని మోసే ప్రయత్నం చేసేస్తాడు. స్టోరిని తానే మొత్తం లాగే కంటే.. కథలో భాగమై ఉండే పాత్రలను ఎంచుకోవడంపై దృష్టిపెడితే బాగుంటుంది. వందశాతం ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించే శ్రీను కొన్ని చిన్న చిన్న పొరపాట్లతో మరో లెవెల్‌కు ఎదుగలేకపోతున్నాడు. పోలీస్ పాత్రలో చక్కగా కనిపించాడు. డైలాగ్ డెలివరీలో మరింత శ్రద్ద పెట్టాల్సి ఉంది. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించే విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందే. బడ్జెట్ నియంత్రణతో ఈ సినిమా చేయడం శ్రీనివాస్‌కు కలిసి వచ్చే అంశం.

    గ్లామర్‌గా కాజల్ అగర్వాల్

    గ్లామర్‌గా కాజల్ అగర్వాల్

    సంయుక్తగా కాజల్ అగర్వాల్ గ్లామర్‌గా కనిపించింది. బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల సంయుక్త పాత్ర ఆకట్టుకోలేకపోయింది. పాటలు, డ్యాన్సులకే కాజల్ పరిమితమైందనిపిస్తుంది. కాజల్ కెరీర్‌లో గొప్ప చిత్రమనే ఫీలింగ్ కలుగదు.

     మెహ్రీన్ పిర్జాదా యాక్టింగ్

    మెహ్రీన్ పిర్జాదా యాక్టింగ్

    లావణ్య పాత్రలో మెహ్రీన్ ఫిర్జాదా నటించింది. ఈ చిత్రంలో మెహ్రీన్‌ది కీలకమైన పాత్రే అయినప్పటికీ పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. ఆమె క్యారెక్టర్‌పై పుష్కలంగా సానుభూతి ఉంటుంది. కానీ కథలో గందరగోళం కారణంగా అది ఎలివేట్ కాలేకపోయింది. దాంతో మెహ్రీన్ సాదాసీదాగా మారిపోయింది.

     ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    మిగితా పాత్రల్లో ముఖేష్ రుషి, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, పోసాని, సత్యం రాజేష్ లాంటి వాళ్లు చాలా మంది కనిపిస్తారు. నీల్ నితిన్ విలనీ రోల్ పెద్దగా ప్రభావం చూపే రేంజ్‌లో లేకపోవడం నిరాశను కలిగించే అంశం.

    సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

    సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్

    చోటా కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. వైజాగ్, ఇతర ప్రాంతాల్లో షూట్ చేసిన లొకేషన్లు అందంగా ఉన్నాయి. కొన్ని సీన్లు చాలా రిచ్‌గా అనిపిస్తాయి. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంటుంది. కొన్ని సీన్లలో చోటా కత్తెర పదును తగ్గింది.

    తమన్ మ్యూజిక్

    తమన్ మ్యూజిక్

    భాగమతి చిత్రం తర్వాత తమన్ మ్యూజిక్‌లో పరిణతి కనిపిస్తున్నది. అరవింద సమేతతో మరింత రాటుదేలాడు. కవచం సెకండాఫ్‌లో కథకు కీలకంగా మారిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టారు. పాటలు తమన్ స్థాయికి తగినట్టు లేవు. ఓవరాల్‌గా తమన్ నిరాశ పరిచాడనే చెప్పవచ్చు.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన కవచం చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక విభాగాల ఎంపిక చక్కగా కుదిరింది. కానీ, కథా, కథనాల విషయంపై మరింత దృష్టిపెట్టి ఉంటే బాగుండేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    రొటీన్ కథ, కథనాలతో ఎలాంటి ఆసక్తిని కలిగించని థ్రిల్లర్ కవచం మూవీ. ఎమోషన్ లేని పోలీస్ డ్రామాగా కనిపిస్తుంది. కథలో అనేక మలుపులు గందరగోళంగా మారేలా చేశాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ బట్టే సినిమా రేంజ్, విజయం ఆధారపడి ఉంటుంది.

    బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్స్

    బెల్లంకొండ శ్రీను ఫెర్ఫార్మెన్స్
    కాజల్ గ్లామర్
    శ్రీనివాస్ మామిళ్ల టేకింగ్

    మైనస్ పాయింట్స్
    మ్యూజిక్
    డైరెక్షన్
    బెడిసి కొట్టిన కామెడీ

    తెరవెనుక, తెర ముందు

    తెరవెనుక, తెర ముందు

    నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే తదితరులు
    దర్శకుడు: శ్రీనివాస్ మామిళ్ళ
    నిర్మాత: నవీన్ సొంటినేని
    మ్యూజిక్: ఎస్ థమన్
    సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
    ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
    బ్యానర్: వంశధార క్రియేషన్స్
    బ్యానర్: 2018-12-07

    English summary
    Bellamkonda Srinu's latest movie is Kavacham. Kajal Aggarwal, Mehrin Pirzada are lead heroine. This movie set to release on December 7th. In this occassion, Filmibeat Telugu brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X