Bhaag Saale Review శ్రీ సింహా ఖాతాలో హిట్ పడిందా? భాగ్ సాలే మూవీ ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: శ్రీ సింహ కోడూరి, నేహా సొలంకి, జాన్ విజయ్, వర్షిణి సౌందర్ రాజన్, నందినీరాయ్, వైవా హర్ష, సత్య, రాజీవ్ కనకాల, సుదర్శన్, పృథ్వీ రాజ్, ఆర్ జె హేమంత్, బిందు చంద్రమౌళి తదితరులు
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి
నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల
సినిమాటోగ్రఫి : రమేష్ కుషేందర్
మ్యూజిక్: కాల భైరవ
రిలీజ్ డేట్:2023-07-07

రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేసే అర్జున్ (శ్రీ సింహా కోడూరి) సంపన్న కుటుంబానికి చెందిన వాడినని మాయ మాటలు చెప్పి గొప్పింటి అమ్మాయి మాయ (నేహా సోలంకి)ను ప్రేమలోకి దింపుతాడు. శ్యామ్యూల్ (జాన్ విజయ్) అనే మాఫియా డాన్ సినీ నటి నళిని (నందిని రాయ్) అంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. షాలి సుకా గజా అనే అరుదైన డైమండ్ రింగ్ తెచ్చి ఇవ్వమని నళిని కోరుతుంది. డైమండ్ రింగ్ ఉన్న మాయ తండ్రి (సంజయ్ స్వరూప్)ను శ్యామూల్ కిడ్నాప్ చేస్తాడు.

Bhaag Saale Movie Review and Rating: Sri Simha, Neha Solanki, Varshini Soudarajans crime Comedy

25 కోట్ల విలువైన డైమండ్ రింగ్ వెనుక ఉన్న కథ ఏమిటి? అరుదైన వజ్రపుటుంగరం మహత్యం ఏమిటి? ఆ అరుదైన ఉంగరం కోసం ప్రతీ ఒక్కరు ఎందుకు ప్రయత్నిస్తారు? మాయ తండ్రి కోసం అర్జున్ డైమండ్ రింగ్ తీసుకొచ్చే ప్రయత్నం ఎలా జరిగింది? డైమండ్ ఉంగరం కోసం శ్యామూల్, అర్జున్ మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకొన్నాయి? (Bhaag Saale Movie Review) ఈ డైమండ్ ఉంగరం ట్విస్టులో రమ్య (వర్షిణి సౌందర్‌రాజన్) రోల్ ఏమిటి? పోలీస్ ఆఫీసరైన భర్త ప్రామిస్ రెడ్డి (సత్య) నుంచి రమ్య ఎందుకు విడాకులు తీసుకోవాలనుకొన్నది? అర్జున్ స్నేహితుడు కిట్టు (సుదర్శన్) ఫస్ట్ నైట్‌కు డైమండ్ ఉంగరం వ్యవహారం అడ్డంకిగా మారింది? చివరకు డైమండ్ ఉంగరం శ్యామూల్‌కు చిక్కిందా? లేదా అర్జున్‌కు చిక్కిందా? అర్జున్ రిచ్ కాదని తెలిసిన తర్వాత మాయ రియాక్షన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భాగ్ సాలే సినిమా కథ. (Bhaag Saale Movie Review)

భాగ్ సాలే కథలో రకరకాల లేయర్స్‌తో రూపొందిన క్రైమ్ కామెడీ సినిమా. చాలా వేరియేషన్స్ ఉన్న నూతన దర్శకుడు ప్రణీత్ కథను పక్కాగా రాసుకోవడంలో కొంత తడబాటు కనిపించింది. కాకపోతే రకరకాల ట్రాక్స్‌ను కథగా బ్లెండ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫాస్ట్‌గా సాగేందుకు అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే మంచి క్రైమ్ కామెడీ అయి ఉండేదనిపిస్తుంది.

విలువైన వస్తువు కోసం కొందరు వెతికే కథకు లవ్ స్టోరీ, యాక్షన్, క్రైమ్‌ను జోడించిన సినిమాలు తెలుగు సినిమాలో ఇది వరకు వచ్చాయి. అయితే కొత్తగా చెప్పే ప్రయత్నం చేసిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు గురయ్యాయి. (Bhaag Saale Movie Telugu Review) లవ్ స్టోరితోపాటు డైమండ్ రింగ్ కోసం నాలుగైదు గ్యాంగులు వెతికే కథను దర్శకుడు ప్రణిత్ ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. కాకపోతే ఒకే ట్రాక్‌పై బలమైన ఎపిసోడ్స్ లేకుండా ఫ్లాట్‌గా కొనసాగించడం రొటీన్‌గా అనిపిస్తుంది. అయితే అలాంటి రెగ్యులర్ కథలో కామెడీని పండించిన తీరు, నటీనటులను సన్నివేశాల్లోకి పట్టుకొచ్చిన డ్రామా ఆకట్టుకొనే అంశంగా ఈ సినిమాలో కనిపిస్తుంది.

Bhaag Saale Movie Review and Rating: Sri Simha, Neha Solanki, Varshini Soudarajans crime Comedy

యాక్టర్‌గా శ్రీ సింహా ప్రయత్న లోపం ఏమీ కనిపించదు. కథను స్వయంగా తన భుజాల మీద వేసుకొని సినిమాను లాగించ గలనని శ్రీ సింహా మరోసారి నిరూపించాడు. బలమైన కథ దొరికితే మరో రేంజ్‌కు తీసుకెళ్లనని సంకేతాలిచ్చారు. యాక్టర్‌గా శ్రీ సింహా మంచి మెచ్యురిటీని, కామెడీ టైమింగ్‌ను చూపించారనే చెప్పాలి. ఇక నేహా సోలంకి మాయగా తన వంతుగా గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. కొన్ని సన్నివేశాల్లో మంచి పెర్ఫార్మెన్స్‌ను కనబరిచింది. వర్షిణి, నందిని గ్లామర్ పరంగా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

భాగ్ సాలే సినిమాలో మిగితా నటుల ప్రతిభ గురించిన విషయాల్లోకి వెళితే.. జాన్ విజయ్ ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో ఆకట్టుకొన్నాడు. (Bhaag Saale Movie Review) డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కొత్తగా ప్రయత్నించారనే చెప్పాలి. సుదర్శన్, సత్య, వైవా హర్ష, ఆర్జే హేమంత్ తమ వంతుగా కామెడీని పండించారు. రాజీవ్ కనకాల, సంజయ్ స్వరూప్ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

Bhaag Saale Movie Review and Rating: Sri Simha, Neha Solanki, Varshini Soudarajans crime Comedy

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఆర్ట్ విభాగాల నిపుణుల పనితీరు సినిమాకు బలంగా కనిపించాయి. ఈ సినిమా కోసం ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ సన్నివేశాలను రిచ్‌గా మార్చింది. రీ రికార్డింగ్ పలు కామెడీ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ శింగనమల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, పాత్రలకు తగినట్టుగా నటీనటుల ఎంపిక చూస్తే సినిమాపై వారికి ఉండే అభురుచి తెలియపరిచింది.

లవ్, కామెడీ, క్రైమ్ అంశాలతో డైమండ్ ఉంగరం చుట్టూ సాగే డ్రామా భాగ్ సాలే. కథ, కథనాల విషయాలు పక్కన పెడితే.. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా కనిపిస్తుంది. (Bhaag Saale Movie Review) అలాగే సాంకేతిక విభాగాల పనితీరు స్క్రిప్టుపరంగా ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాయి. ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో సాగే కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి భాగ్ సాలే నచ్చుతుంది. వైవా హర్ష, సత్య, సుదర్శన్ కామెడీ ఈ సినిమాకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్. క్రైమ్ బ్యాక్ గ్రౌండ్‌తో వినోదాన్ని ఆశించే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే శ్రీ సింహా ఖాతాలో హిట్ చేరడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X