Bhadrakaali Movie Review: భద్రకాళి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురగన్, తృప్తి రవీంద్ర తదితరులు
దర్శకత్వం: అరుణ్ ప్రభు
నిర్మాత, మ్యూజిక్: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫిం షెల్లీ కాలిస్ట్
ఎడిటర్: రేమాండ్ డెర్రిక్ క్రాస్టా
ఆర్ట్: శ్రీరామన్
సమర్పణ: మీరా విజయ్ ఆంటోని
బ్యానర్: విజయ్ ఆంటోని కార్పోరేషన్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, స్రవంత్ రామ్ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2025-09-19

ఖమ్మం జిల్లాలో అనాథగా పెరిగిన కిట్టూ (విజయ్ ఆంటోని) తెలుగు రాజకీయాలను కుదిపే విధంగా పైరవీలు, లాబీయింగ్ చేస్తూ భారీగా డబ్బులు సంపాదించే పనిలో ఉంటాడు. అందుకోసం తన టాలెంట్‌ను ఉపయోగించి అసాధ్యమైన పనులను కూడా ఈజీగా చేసి డబ్బులు కూడబెడుతుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహ కర్త, పారిశ్రామిక వేత్త అభ్యంకర శంకర్‌ (సునీల్ కృపాలనీ)కు ధీటుగా కిట్టూ ఎదుగుతాడు. అయితే తన లక్ష్యానికి అడ్డుగా వస్తున్న కిట్టూపై 100కుపైగా కేసులు పెట్టి.. అక్రమంగా సంపాదించిన 6236 కోట్ల రూపాయలను పట్టించడమే కాకుండా జైలులో పెడుతాడు.

Bhadrakaali Movie Review

అసలు కిట్టూ ఎవరు? కిట్టూ గతం ఏమిటి? కిట్టూ పైరవీకారుడిగా, లాబియిస్టుగా ఎలా ఎదిగాడు? కిట్టూ అక్రమంగా ఎందుకు డబ్బు సంపాదించే పనిలో పడ్డాడు. పారిశ్రామిక వేత్త అభ్యంకర్ లక్ష్యం ఏమిటి? అభ్యంకర్‌కు కిట్టూకు ఏమైనా పగ ప్రతీకారాలు ఉన్నాయా? అభ్యంకర్‌ లక్ష్యానికి కిట్టూ ఎందుకు అడ్డుపడ్డాడు? 6 వేలకుపైగా సంపాదించిన డబ్బును కిట్టూ ఏం చేశాడు? చిరకాలంగా అభ్యంకర్‌ కన్న కలలను కిట్టూ ఎలా కూల్చాడు అనేది భద్రకాళి సినిమా కథ.

చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయంతో అనాథగా మారిన కిట్టూ సమాజంలోని లోటుపాట్లను గ్రహించి రాబిన్‌హుడ్‌గా పేదలకు సహాయం అందించాలన్న పాయింట్‌తో అరుణ్ ప్రభు రాసుకొన్న కాన్సెప్ట్ బాగుంది. అయితే కథను సాఫీగా, ఎలాంటి గందరగోళం లేకుండా స్ట్రెయిట్‌గా చెప్పి ఉంటే.. మంచి పొలిటికల్ థ్రిల్లర్ అయి ఉండేది. ఫస్టాఫ్‌లో కథను ఆసక్తికరంగానే కాకుండా గ్రిప్పింగ్‌గా నడిపించిన తీరు చూస్తే.. ఏదో ఫీల్ గుడ్ అటెంప్ట్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సింగిల్ పాయింట్ మీద ఎజెండాతో స్టోరిని నడిపించడం వల్ల సెకండాఫ్‌లో సినిమా తేలిపోయింది. ప్రీ క్లైమాక్స్ వరకు చాలా ల్యాగ్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కావాల్సిన దానికంటే ఎక్కువగానే చూపించి నిడివిని పెంచేశాడు. డైలాగ్ పార్ట్, సన్నివేశాల్లో బోధన ఎక్కువ కావడంతో నసలా అనిపిస్తుంది. కాకపోతే చివరకు విజయ్ ఆంటోని మరోసారి మంచి అటెంప్ట్ చేశాడని అనిపిస్తుంది.

విజయ్ ఆంటోని తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌కు తగినట్టుగా కిట్టూ పాత్రను ఎంచుకొని అందులో ఒదిగిపోయాడు. కానీ కథ, కథనాలు, తన క్యారెక్టర్ విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉండాల్సిందనిపిస్తుంది. విలన్ పాత్రలో సునీల్ కృపలానీ, మారుతి పాత్రలో సెల్ మురుగన్ పాత్రలు తప్ప మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు. హీరోయిన్ పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేదు. హీరోయిన్ పాత్ర ద్వారా ఎమోషన్స్, సెంటిమెంట్ పండించడానికి స్కోప్ ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో ఈ సినిమా సాదాసీదా రివేంజ్ డ్రామాగా కనిపిస్తుంది.

టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అసెట్. కానీ ఇంపాక్ట్‌ఫుల్ మ్యూజిక్‌కు తగిన సన్నివేశాలు పడకపోవడంతో మైనస్. స్వయంగా విజయ్ ఆంటోని మ్యూజిక్ చేశారు. కానీ పాటల చాలా డల్'గా ఉండటం మరో మైనస్. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ ఇంకాస్త షార్ప్‌గా కట్ చేయాల్సి ఉందనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఫైనల్‌గా.. రివెంజ్‌తో సాగే పొలిటికల్ డ్రామాగా రూపొందిన భధ్రకాళి సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే ఫ్లాష్ బ్యాక్ లేకపోవడం సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. మంచి కాన్సెప్ట్‌తో రూపొందించాలనే తపన మాత్రమే కనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు సరిగా చేయలేదనిపిస్తుంది. సమాజంలో జరుగుతున్న పారిశ్రామిక వేత్తల దోపిడి.. పేదవాడు పేదవాడిగానే ఎందుకు ఉండిపోతున్నాడు.. సంపద అంతా కొందరి చేతుల్లోనే ఉండటం వల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది. దేశంలోని సంపదను దోచుకొని పారిశ్రామికవేత్తలు విదేశాల్లో ఎలా స్థిరపడుతున్నారు? అనే పాయింట్లను చక్కగా చూపించారు. విజయ్ ఆంటోని సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X