Bhagat Singh Nagar movie review.. ఆకట్టుకొనే క్రైమ్, థ్రిల్లర్

Rating: 2.75/5

నటీనటులు: విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వాలాజా క్రాంతి
నిర్మాతలు: వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు
సినిమాటోగ్రఫి: రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి
ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్
స్టిల్స్: మునిచంద్ర
నృత్యం: ప్రేమ్-గోపి
నేపథ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి
పీఆర్వో: మధు వి ఆర్

భగత్ సింగ్ నగర్ అనే మురికివాడలో బాధ్యత లేకుండా తిరిగే యువకుడు శ్రీను ( విదార్థ్). కానీ తమ బస్తీలో అమ్మాయిలపై జరిగే లైంగిక దాడులు, కిడ్నాప్‌ చేసే యువకులపై ఎదిరిస్తుంటాడు. తన గ్యాంగ్‌‌లోని చంద్రయ్య (ముని చంద్ర), ఇతరులతో కలిసి మద్యం సేవిస్తూ జల్సాగా తిరిగే శ్రీను.. కాలనీలోని లక్ష్మి (ధృవిక)ను ప్రేమిస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు అదృశ్యం కావడం మిస్టరీగా మారుతుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ, శ్రీను ప్రేమించుకొంటూ ఏకాంతంగా ఉన్న సమయంలో కొందరు దాడి చేస్తారు.

లక్ష్మీ, శ్రీనుపై దాడి చేయడం వెనుక కుట్ర ఎవరిది? అమ్మాయిల కిడ్నాప్ వ్యవహారంలో ఎమ్మెల్యే వైసీ రావు (అజయ్ ఘోష్)కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలో షార్ట్ ఫిలింస్ తీసే భగత్ పాత్ర ఏమిటి? లక్ష్మీ, శ్రీనుపై జరిగిన దాడి వ్యవహారంలో భగత్ టీమ్‌లోని అనన్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? అమ్మాయిలపై లైంగిక దాడి, కిడ్నాప్ కుట్రలకు భగత్, అనన్య ఎలాంటి ముగింపు ఇచ్చారు అనే ప్రశ్నలకు సమాధానమే భగత్ సింగ్ నగర్ సినిమా కథ.

 Bhagat Singh Nagar movie review and Rating: Valaja Kratis debut attempt quite Impressive

భగత్ సింగ్ నగర్ సినిమాలో రెండు విభిన్నమైన పాయింట్లను ఒకే కథగా జోడించిన తీరు.. పాత్రలను ఆ కథలోకి జొప్పించిన తీరు అభినందనీయం. తొలి చిత్ర దర్శకుడిగా వాలాజా క్రాంతి కథ, కథనాల విషయంలో అద్భుతమైన ప్రతిభను చాటుకొన్నారు. ఏ స్థితిలోను ఫస్ట్ టైమ్ దర్శకుడు అనే ఫీలింగ్ కల్పించలేదు. గ్రామీణ నేపథ్యం, నగర నేపథ్యాలతో కథను బాగా నడిపించాడు. తెలుగు నేటివిటి, మురికివాడ నేపథ్యాన్ని సహజంగా చిత్రీకరించారు. నూతన నటీనటులతో ఈ సినిమా అవుట్‌పుట్ చాలా బాగుంది. ఫస్టాఫ్, సెకండాఫ్‌‌లో ఉండే వేరియేషన్సీ చక్కగా డీల్ చేశాడని చెప్పవచ్చు. హ్యుమన్ ట్రాఫికింగ్, గ్రామాల్లో అమ్మాయిలపై లైంగికదాడులు సబ్జెక్ట్‌ను సహజంగా చిత్రీకరించారు.

తొలిసారి హీరోగా నటించిన విదార్థ్ రెండు విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయాడు. గ్రామీణ ప్రాంత యువకుడు శ్రీనుగా, అలాగే షార్ట్ ఫిలిం మేకర్‌గా రెండు భారమైన పాత్రలను చాలా సునాయసంగా చేశాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా కథతో ట్రావెల్ అయిపోయాడు. ఇక ధృవిక కూడా రెండు పాత్రల్లో మంచి ప్రతిభను చాటుకొన్నది. లక్ష్మీ, అనన్యగా రెండు షేడ్స్‌ను సులభంగా చేసి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక చంద్రయ్యగా మునిచంద్ర నటన సినిమాకు ఎమోషనల్ పాయింట్. అలాగే విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఎమ్మెల్యేగా అజయ్ ఘోష్, అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా బెనర్జీ సహజమైన నటనను ప్రదర్శించారు. మిగితా పాత్రల్లోని వారు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే.. తొలి భాగంగా అత్యంత సహజ రీతిలో మురికి వాడల్లోని వాతావరణం, పాత్రల తీరును సినిమాటోగ్రాఫర్ రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి చక్కగా తమ కెమెరాలో బంధించారు. ప్రభాకర్ దమ్ముగారి చరిత చూపని పాట చాలా బాగుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను హైలెట్ చేసింది. జియాన్ శ్రీకాంత్ ఎడిటింగ్ ఇంప్రెసివ్‌గా ఉంది.

కథలోని ఇంటెన్సిటిని నమ్మి భగత్ సింగ్ నగర్ సినిమాను వాలాజ గౌరి, రమేష్ ఉడత్తు నిర్మించారనే విషయం స్పష్టంగా తెలిసి పోతుంది. పేరున్న నటీనటులతో కాకుండా నూతన నటీనటులతో నిజాయితీగా చేసిన ప్రయత్నం వారికి సినిమాపై ఉన్న అభిరుచిని చెబుతుంది. మంచి నిర్మాణ విలువలు పాటించారు. కొన్ని లోపాలు ఉన్నప్పటికి.. వాటిని సినిమాలోని ఉన్నత విలువలు కప్పివేశాయి.

Recommended Video

Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu

అమ్మాయిల అక్రమ రవాణా, లైంగిక దాడులు, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను కలబోసి నిజాయితీతో తీసిన చిత్రం భగత్ సింగ్ నగర్. గ్రామీణ ప్రాంతంలో జరిగే దారుణాలను కళ్లకట్టినట్టు చూపించడంలో దర్శకుడు వాలాజ క్రాంతి సక్సెస్ అయ్యారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చే క్రైమ్, డ్రామా సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చిన్న సినిమా అయినప్పటికీ.. మంచి మూవీని అందించాలనే భారీ ప్రయత్నం కనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మంచి అనుభూతిని కూడా పంచుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X