twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫలించని 'భగీరథ' యత్నం

    By Staff
    |

    Bhagiratha
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: భగీరథ
    విడుదల తేదీ: 13 అక్టోబర్‌, 2005
    నటీనటులు: రవితేజ, శ్రీయ, ప్రకాష్‌రాజ్‌, నాజర్‌,
    విజయకుమార్‌, సునీల్‌, వేణుమాధవ్‌, జీవా, అనంత్‌ తదితరులు
    సంగీతం: చక్రి
    మాటలు: కోన వెంకట్‌, అబ్బూరి రవి
    కథ: కిశోర్‌ పార్ధసారధి
    సినిమాటోగ్రఫీ: సునీల్‌ రెడ్డి
    ఎడిటింగ్‌: గౌతం రాజ్‌
    నిర్మాత: మల్లిడి సత్యనారాయణ రెడ్డి
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రసూల్‌ ఎల్లోర్‌

    ఇతర భాషల వాళు ప్రయోగాత్మక సినిమాలతో విజయం సాధిస్తుంటే, తెలుగు సినిమా పరిశ్రమ పాత సినిమా కథలనే తీసుకుని పల్టీలు కొడుతోంది. గతంలో చిరంజీవి, సుధాకర్‌ నటించిన ' ఊరుకిచ్చిన మాట'ను భారీ మార్పులతో భగీరథగా దించి దిగజార్చారు.br />
    కృష్ణాయలంక అనే గ్రామానికి వంతెన నిర్మించడంపై ఈ కథను నిర్మించారు. ఆ ఊరికి పడవలే ఆధారం. అప్పుడప్పుడు అవి నీళ్ళలో మునిగిపోయి, అక్కడ ప్రజలకు విషాదం మిగిల్చుతుంటాయి. అలా మునిగిపోయిన వారిలో ప్రకాష్‌రాజ్‌ తండ్రి ఉంటాడు. ఆ ఊరి ప్రెసిడెంట్‌ అయిన బుల్లబ్బాయి (విజయ్‌కుమార్‌) చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన వెంకటరత్నం (ప్రకాష్‌రాజ్‌)ను చేరదీసి పెంచుతాడు. ఐఎఎస్‌ ఆఫీసర్ని చేస్తాడు. ఈలోగా విజయ్‌కుమార్‌కు కాబోయే బావ ప్రమాదానికి గురవుతాడు. దానితో ఆ ఊరికి వంతెన ఎంతైనా అవసరమని గ్రహించిన బుల్లబ్బాయి తాను సాయం చేసిన ప్రకాష్‌రాజ్‌ను వంతెన నిర్మితమయ్యేలా చూడమని కోరతాడు. ఏళ్లు గడుస్తుంటాయి కానీ ఆ ఊరికి వంతెన రాదు. ఊరి వారంతా ఎగతాళిగా మాట్లాడుతుంటే. తన కొడుకు చందు (రవితేజ)ను హైదరాబాద్‌లో ఉన వెంకటరత్నం వద్దకు పంపుతాడు. వెంకటరత్నం అప్పటికే ఐఎఎస్‌కు రాజీనామా చేసి బిల్డర్‌ అవతారమెత్తుతాడు. తన తండ్రి మరణానికి కారణమైన ఆ ఊరికి వంతెన రానివ్వనంటాడు. దానితో ఆగ్రహించిన చందు సంవత్సర కాలంలో తండ్రి ఆశయం నేరవేరుస్తానని శపథం చేస్తాడు. అక్కడ నుంచి బిల్డర్‌ వెంకటరత్నంను ఎదిరించడానికి చందు కూడా బిల్డర్‌ అవతారమెత్తుతాడు. ఆ ఊరికి అతను వంతెనను ఎలా సాధించిపెట్టాడన్నది మిగితా కథ.br />
    రవితేజ తన టిపికల్‌ డైలాగ్‌ డెలివరీతో అభిమానులకు ఆనందం కలిగిస్తాడు. సాధారణంగా అన్ని సినిమాలు హీరో ఏ నేపధ్యం నుంచి వచ్చాడో చెప్పడానికి మొదట్లో అతని బాల్యాన్ని చూపిస్తారు. దీనిలో విచిత్రంగా విలన్‌ బాల్యాన్ని చూపెడతారు. వంతెన సాధనకు సంవత్సరం డెడ్‌లైన్‌ పెట్టుకున్నా, ఎంతకాలంలో సాధించాడన్నది కనిపించదు. ' ఊరుకిచ్చిన మాట'లో చిరంజీవి తమ్ముడు సుధాకర్‌ను ఊరంతా చందాలు వేసుకుని డాక్టరు కోర్సు చదివిస్తారు. అతడు విలాసాల్లో మునిగితేలుతూ ఉంటే, చిరంజీవి తమ్ముడిని ఎలా ఊరికి రప్పించాడన్న అంశం ఆధారంగా కథ నడుస్తుంది. ఇందులో రవితేజ అతని లక్ష్యానికి సంబంధం లేకుండా రౌడీ జీవాతో కలిసి బిల్డర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తాడు. మొదట్లోనే లక్ష్యం మరచిన హీరోకి కష్టపడకుండానే రకరకాల పాత్రలు (నాజర్‌,జీవా, శ్రీయ) వచ్చి సాయపడి, కథ నడిపి హీరో పాత్రను పాసివ్‌గా మార్చేస్తారు. హీరోయిన్‌ పాత్ర అయినా గొప్పగా ఉందా అంటే, ఆమె 'శంకర్‌దాదా'లో సోనాలీ బింద్రే పాత్రను యధాశక్తి కాపీ చేస్తుంటుంది. సినిమాలో కొద్దిగా అయినా నవ్వించిన వేణుమాధవ్‌ ట్రాక్‌కు ముగింపు ఉండదు. ఆ ఊరుకి వంతెన లేకపోవడం వల్ల తన తండ్రి మరణించినా, ప్రకాష్‌రాజ్‌కి ఆ ఊరు మీద సానుభూతి ఉండడం పోయి, ద్వేషం పెంచుకోవడం విచిత్రంగా ఉంది. జీవా పాత్ర ఎందుకో, హీరో బిల్డర్‌గా ఎందుకు మారాల్సివచ్చిందో, నాజర్‌ని ఎందుకు కలుస్తాడో అర్ధం కాదు. కథే ఇలా దారి తప్పి తిరుగుతుంటే, ఇక స్క్రీన్‌ప్లేలో పస ఏముంటుంది? మాటలు ఓ మాదిరిగా ఉన్నాయి. రెండు పాటలు చాలా బాగున్నాయి. కెమెరా కూడా బాగుంది. సినిమా ఏ విధమైన ఫీల్‌ లేకుండా సాగడం దర్శకుడి లోపమే. రవితేజ కారణంగా ఓపెనింగ్స్‌ బాగా ఉన్నా, కలెక్షన్లు నిలకడగా ఉండడం సందేహమే.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X