Bhairathi Ranagal Twitter Review: భైరాతీ రానగల్ ట్విట్టర్ రివ్యూ.. శివరాజ్ కుమార్ బ్లాక్‌బస్టర్ కొట్టాడా?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన భైరాతీ రానగల్. పాపులర్ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు గీతా శివరాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రాహుల్ బోస్, నానా పాటేకర్, రుక్మిణి వసంత్, యోగిబాబు, దేవరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. నవంబర్ 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ ఎలా ఉంది? నెటిజన్లు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే వివరాల్లోకి వెళితే..
బైరాతీ రానగల్ సినిమా విషయానికి వస్తే.. నార్తన్ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన చిత్రం మఫ్టీ మూవీకి ప్రీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. గ్యాంగ్‌స్టర్ భైరాతీ రానగల్ జీవితం ఆధారంగా రూపొందింది. కన్నడ రాష్ట్రాన్ని కనుసైగల్లో రాణించిన ఈ గ్యాంగ్‌స్టర్‌ను అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా అరెస్ట్ చేశారు. అయితే భైరాతీ రానగల్ టైటిల్ పాత్రను శివరాజ్ కుమార్ పోషించారు.

భైరాతీ రానగల్ పాత్ర, సినిమా కేవలం పగ,ప్రతీకారం ఉన్న కథ కాదు. ఆ క్యారెక్టర్ ఏ లక్ష్యం కోసం తన జీవితాన్ని మలుపుతిప్పే నిర్ణయం తీసుకొన్నాడు. ఆయనలో ఉన్న మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాం. కనికరం లేని గ్యాంగ్‌స్టర్ మాత్రమే కాదు.. కొందరికి అండగా నిలిచే నిజాయితీతో కూడిన లాయర్ జీవితాన్ని ఆవిష్కరిస్తున్నాం అని శివరాజ్ కుమార్ తెలిపారు.
భైరాతీ రానగల్ గురించి ఎవరికి తెలియని కథను తెరపైన ఆవిష్కరించాలని ప్రయత్నం చేశాం. అడ్వకేట్‌గా ఉండే వ్యక్తి.. సమాజంలో వివక్షకు గురైన ప్రజలకు అండగా నిలువడానికి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు. ఆయన జీవితం ఎలాంటి ఎగుడుదిగుడులకు లోనైంది అనేది ఈ సినిమా కథగా ఉంటుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











