Bhairavam First Review: భైరవం తెలుగు మూవీ ఫస్ట్ రివ్యూ
యువ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. మే 30 తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు రివ్యూ చేశారు. అనంతరం వారు వెల్లడించిన విషయాలు, అలాగే వారు ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ వివరాల్లోకి వెళితే..
మల్టీ స్టారర్ సినిమాగా రూపొందిన భైరవం మూవీ తమిళంలో రూపొందిన గురుడన్ సినిమాకు రీమేక్. ఈ సినిమాలోని కోర్ పాయింట్‌ను తీసుకొని తెలుగు నేటివిటీ, భావోద్వేగాలను జోప్పించి ఈ సినిమాను రూపొందించారు. అలాగే బెల్లంకొండ శ్రీను, మనోజ్, రోహిత్ ఇమేజ్‌లకు అనుగుణంగా ఈ మూవీలోని పాత్రలను తీర్చిదిద్దారు. ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సన్నివేశాలకు మంచి రెస్సాన్స్ వస్తున్నది. ఇలాంటి హంగులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు వీక్షించారు.

భైరవం సినిమాలోని సన్నివేశాలు హింసతో కూడుకొన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే ఎమోషన్స్‌తో యాక్షన్ సీన్లు కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. ముఖ్యంగా యూత్‌ను అలరించే విధంగా ఫైట్స్ ఉన్నాయి. చిన్న పిల్లలు చూసేందుకు కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయనే వాదనను వినిపించారు. దాంతో ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు.
ఇక ముగ్గురు హీరోలు, ఓ బామ్మ (జయసుధ) చుట్టూ తిరిగే సన్నివేశాలు, అలాగే హీరోలుకు తగినట్టుగా ముగ్గురు హీరోయిన్లు, వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్గా ఉంటాయి. ఈ సినిమాలోని ఎమోషనల్ పాయింట్ వర్కవుట్ అయితే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర హైలెట్ అవుతుంది.ఆయన చుట్టూ తిరిగే కథ, ఆయనపై కంపోజ్ చేసిన సన్నివేశాలు టాప్ రేంజ్‌లో ఉంటాయి. ఇక మనోజ్ మంచు చుట్టు ఉండే ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ కూడా యూత్‌ను ఆకట్టుకొంటాయి.రోహిత్ పాత్ర చాలా సటిల్‌గా ఉంటుంది. ఈ సినిమా టోటల్‌గా మాస్ ఎంటర్‌టైనర్‌గా మారబోతున్నది అనే టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











