Bhairavam Movie Review: భైరవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, సందీప్,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: కెకె రాధామోహన్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
లిరిక్స్: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్స్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌, పెన్ స్టూడియోస్‌
రిలీజ్ డేట్: 2025-05-30

దేవీపురంలో జమీందార్ వంశానికి చెందిన గజపతి (మనోజ్ మంచు)కి గ్రామంలో పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ..పేదరికం వెంటాడుతుంటుంది. గజపతికి తన ఊరిలోనే పెద్దరికాన్ని ప్రదర్శించే వరద (నారా రోహిత్), అనాథగా బతికే శ్రీను (బెల్లంకొండ శ్రీను) ప్రాణస్నేహితులుగా ఉంటారు. ఇదిలా ఉండగా, ఆ గ్రామంలోని ఆలయ ధర్మకర్తగా గజపతి నానమ్మ (జయసుధ) ఉంటారు. ఆలయ భూములు కాజేయడానికి మంత్రి (శరత్ లోహితస్య) పన్నాగం పన్నుతాడు. గజపతి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని భారీగా డబ్బు ఆశ చూపి ఆలయ భూములు కొట్టేయాలని కుట్ర పన్నుతాడు.

అనాథ అయినప్పటికీ శ్రీనును కన్నబిడ్డగా ప్రజలు ఎందుకు చూస్తారు? శ్రీనుతో వెన్నెల (అదితి శంకర) లవ్ ట్రాక్ ఎలా సాగింది? గజపతిని భార్య నీలిమ (ఆనంది) ఎలా వేధించింది. భార్య ఒత్తిళ్లకు గజపతి తన మనసును ఎలా మార్చుకొన్నాడు. ప్రాణస్నేహితులుగా ఉండే గజపతి, వరద, శ్రీను మధ్య మంత్రి ఎలా చిచ్చు పెట్టారు. వరద స్నేహం కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉన్న గజపతి తన స్నేహితులకు ఎందుకు ఎదురు తిరిగాడు? వరద, గజపతి, శ్రీను మధ్య విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? అనే ప్రశ్నలకు సమాధానమే భైరవం సినిమా కథ.

Bhairavam Movie Review and Rating

పోలీస్ ఇన్స్‌పెక్టర్ (సంపత్ రాజ్) తన ఉద్యోగానికి రాజీనామాను పై అధికారికి సమర్పించడంతో సినిమా హై నోట్‌లో మొదలవుతుంది. తన రాజీనామాకు కారణం చెప్పడం మొదలు పెట్టడంతో దేవీ పురంలో ముగ్గురు ప్రాణ స్నేహితుల కథను ఎమోషనల్‌గా దర్శకుడు ప్రారంభించాడు. ముగ్గురు హీరోల ఇంట్రడక్షన్, ఎలివేషన్స్‌ను బాగానే డిజైన్ చేశాడు. ఆ తర్వాత శ్రీను ప్రేమ కథ, వరద, గజపతి ఫ్యామిలీ మధ్య ఉండే అన్యోన్యతను, కథను ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త టైమ్ ఎక్కువగా తీసుకొన్నట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను రెగ్యులర్, రొటీన్ ఫార్మాట్‌తో నడిపించినప్పటీకి.. ఇంటర్వెల్ ముందు పవర్‌ఫుల్ ఎపిసోడ్‌తో తొలిభాగాన్ని ముగించి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు.

అయితే ముగ్గురు హీరోల మధ్య ఎమోషన్స్, బాండింగ్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నం సరిగా చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. భావోద్వేగంతో చెప్పాల్సిన సన్నివేశాల్లో యాక్షన్ నింపడం వల్ల సినిమాలో సోల్ కాస్త మిస్ అయిందనిపిస్తుంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ.. మామిడితోట సీన్ నుంచి మూవీలో సన్నివేశాలు నెక్ట్స్ రేంజ్‌లోకి వెళ్తాయి. క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు విజయ్ కనకమేడల ప్రతిభ ఎంతో తెలుస్తుంది. సెకండాఫ్‌ను ఇంకాస్త బెటర్‌గా డిజైన్ చేయాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచాడు. సినిమాలోని ఎమోషనల్ కంటెంట్‌ను తన పాత్ర ద్వారా బాగా ఎలివేట్ చేశాడు. నటుడిగా మరింత మెచ్యురిటీని చూపించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ సన్నివేశాల్లో తనలోని నట విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. నారా రోహిత్, మనోజ్‌తో పాత్రలతో మమేకమై మంచి బాండింగ్‌ను ఆన్ స్క్రీన్‌పై ఎలివేట్ చేశాడు. ఇక మనోజ్ మంచు నటుడిగా మరో రేంజ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. కాస్త విరామం తీసుకొన్నప్పటికీ.. సూపర్ క్యారెక్టర్‌తో రీ ఎంట్రీతో అదరగొట్టాడు. ఇండస్ట్రీలో తన టైమ్ స్టార్ట్ అయిందని గజపతి పాత్ర ద్వారా చాటి చెప్పాడు. నారా రోహిత్ విషయానికి వస్తే.. వరద పాత్రలో హుందాగా కనిపించాడు. తన పాత్రకు ఎంత ఎమోషన్ కావాలి? ఎంత యాక్షన్ కావాలో అంతే సమతుల్యాన్ని పాటించి సటిల్‌గా స్క్రీన్ పై కనిపించాడు.

ఇక నాన్నమ్మగా జయసుధ పాత్ర అంతంత మాత్రమేగానే ఉన్నప్పటికీ.. స్క్రీన్ మీద కనిపించినంత సేపు ఆమె ప్రజెన్స్ బాగుంది. ఈ సినిమా కథను నడిపించే పాత్రలో నీలిమగా ఆనంది నటన బాగుంది. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా ఆనంది పాత్రల స్వరూపాన్ని, సినిమా కథ దిశను మార్చే పాత్రలో ఒదిగిపోయింది. ఇక నారా రోహిత్ భార్య పాత్రలో పూర్ణిమగా దివ్య పిళ్లై ఎమోషనల్ కంటెంట్‌ను సినిమాకు అందించే విధంగా పెర్ఫార్మ్ చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ పెద్దగా వర్క్ కాలేదు. సంపత్ రాజ్, శరత్, అజయ్, ఇతర పాత్రలు సినిమాలో గుర్తుంచుకొనే పాత్రల్లో కనిపించారు.

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ప్రధానమైన బలంగా మారింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనే కాకుండా హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ సంక్రాతి పాట, అలాగే వెన్నెల, గిచ్చు గిచ్చు సాంగ్ ఆడియో పరంగా ఫుల్ జోష్‌ను కలిగిస్తే.. తెర మీద అదే జోష్‌ను చూపించారు. ఇక ఈ సినిమాలో మంచి మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటితో గ్రామంలోని వాతవరణాన్ని హరి కె వేదాంతం చక్కగా, చాలా సహజంగా చిత్రీకరించాడు. కేకే రాధామోషన్ ఈ మూవీని రాజీ లేకుండా మంచి క్వాలిటీతో సినిమాను అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. కంటెంట్‌పై మరింత దృష్టిపెట్టి ఉంటే బెస్ట్ మాస్ యాక్షన్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన గరుడన్ సినిమాకు భైరవం రీమేక్. ఈ సినిమాలో అన్ని రకాలు ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల భావోద్వేగాలు లోపించాయి. యాక్షన్ పార్ట్ సినిమా ఫ్లేవర్‌ను మార్చేసింది. పాటల బాగున్నప్పటికీ వాటి ప్లేస్ మెంట్ సరిగా లేకపోవడం వల్ల మంచి ఫ్లోలో వెలుతున్న స్టోరికి బ్రేకులు వేశాయా? అనిపిస్తుంది. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌. బెల్లంకొండ శ్రీను, నారా రోహిత్, మనోజ్ మంచు ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్. కథ పరంగా పాత కథే.. కాకపోతే డిఫరెంట్‌గా చేయాలన్న ప్రయత్నం కొంత ట్రాక్ తప్పింది. టోటల్‌గా ఈ సినిమాను థియేటర్‌లో ఓసారి చూసేయొచ్చు అనేది నా అభిప్రాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X