Bhairavam Movie Twitter Review: భైరవం సినిమా ట్విట్టర్ రివ్యూ
తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్‌గా, జయసుధ కీలక పాత్రలో నటించారు. ఇటీవల రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో మే 30న రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించి నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ లుక్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనోజ్ మంచు, నారా రోహిత్ కూడా ఫెరోషియస్ అండ్ డైనమిక్ రోల్స్ లో కనిపించారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ , బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వారి వర్క్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
భైరవం సినిమా పాత వాసనతో కూడిన కథ అవ్వడం వల్ల రొటీన్ అనిపిస్తుంది. ఫస్టాఫ్ కొంత రెగ్యులర్ ఉందనే ఫీలింగ్ కలిగింది. కానీ ఇంటర్వెల్ సీన్‌తో కొంత పుంజుకొన్నది. సెకండాఫ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. కాకపోతే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు అని క్రిటిక్ కామెంట్ కనిపించింది.

భైరవం సినిమాకు వెళ్లే ముందు ఎక్కువగా ఆశించొద్దు. కానీ ఫస్టాఫ్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. సినిమా మొదటి ఇరువై నిమిషాలు రొటీన్ కథ. ఈ సినిమాలో హీరోల క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డ్రామా ఎంగేజింగ్‌గా ఉంది. ఈ సినిమా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది నెటిజన్ కామెంట్ చేశాడు.
భైరవం సినిమా సోకాల్డ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. ఫస్టాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. సెకండాఫ్‌లో కొన్ని అంశాలు బాగున్నప్పటికీ.. తొలి భాగంలో ఎస్టాబ్లిష్ అయిన అంశాలను బలంగా మార్చుకోలేకపోయింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు బాగా చేశారు. కొన్ని సన్నివేశాల్లో డ్రామా బాగా పండింది. సినిమా కథ అంతా ఊహించుకొనే విధంగానే ఉంటుంది. కథ వేగానికి లవ్ ట్రాక్, పాటలు అడ్డుకట్ట వేశాయి. అతిగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమాను ఓసారి చూడొచ్చు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
భైరవం సినిమా కథ ఎక్సలెంట్. కానీ అనవసరమైన ఫైట్లు, ఎలివేషన్ ఆ ఫ్లేవర్‌ను దెబ్బ తీశాయి. భారీ హిట్‌గా మారేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మనోజ్, రోహిత్ బాగా నటించారు. నాకు ఫస్టాఫ్ నచ్చింది. సెకండాఫ్ అంతగా నచ్చలేదు. పాటలు అవసరం లేదనిపించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
యూఎస్‌లో మొదలైన ప్రీమియర్ షో గురించి ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్టాఫ్ చూడటం పూర్తయింది. ఈ సినిమా తొలి భాగం బాగుంది. ఈ చిత్రంలో అందరూ కుమ్మేశారు అంటూ సింగిల్ లైన్ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











