Bhaje Vaayu Vegam Review: రేసీ స్క్రీన్ ప్లేతో యాక్షన్ థ్రిల్లర్.. భజే వాయు వేగంతో కార్తీకేయ హిట్టు కొట్టాడా?
Rating: 2.75/5
నటీనటులు: కార్తీకేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్ తదితరులు
దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి
నిర్మాత: యూవీ కాన్సెప్ట్
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
మ్యూజిక్: కపిల్ కుమార్
ఎడిటర్: సత్య జీ
బ్యానర్: యూవీ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2024-05-2024
కథ: వరంగల్ జిల్లా రాజన్నపేట గ్రామానికి చెందిన రైతు(తనికెళ్ల భరణి)కి ఓ కుమారుడు రాజు(టైసన్) ఉంటారు. తన కుమారునితో పాటు తన స్నేహితుని కుమారుడు వెంకట్(కార్తికేయ)ను కూడా తన కుమారునిలాగానే పెంచి పెద్దవాణ్ని చేస్తాడు. రాజును నేమో చదువుల్లో ప్రోత్సహిస్తారు... వెంకట్ ను తనకు ఇష్టమైన క్రికెట్ లో కోచింగ్ ఇప్పించి మంచి క్రికెట్ ప్లేయర్ను చేస్తారు. అయితే ఇంతలో వీరి తండ్రి అనారోగ్యానికి గురికావడం, అతడి వైద్య చికిత్స కోసం 8 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది.

తన కెరీర్ను పణంగా పెట్టి వెంకట్ తెచ్చిన డబ్బు తన పెంపుడు తండ్రి వైద్య చికిత్సకు ఉపయోగపడిందా? క్రికెట్ బెట్టింగ్లో బుకి (టెంపర్ వంశీ) వెంకట్ ఎలాంటి మోసానికి గురయ్యాడు? వెంకట్ను బుకీ ఎందుకు? ఎలా బెదిరించాడు? బుకీ బెదిరింపులకు భయపడి 36 లక్షలు ఇచ్చాడా? మాఫియా దందాల చేసే సోదరులు (రవిశంకర్, శరత్ లోహితస్వ)కు బుకీలకు ఉన్న కనెక్షన్ ఏమిటి? మాఫియా సోదరుల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? ఈ మాఫియా సోదరులకు వెంకట్ ఎలా బుద్ది చెప్పారు అనే ప్రశ్నలకు సమాధానమే భజే వాయు వేగం సినిమా కథ.
కథ, కథనం విశ్లేషణ:క్రైం థ్రిల్లర్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే తొలి చిత్ర దర్శకులు ఇలాంటి కథలను ఎంచుకుని... బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని చూస్తుంటారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. గ్రిప్పింగ్ గా తెరమీద ఆవిష్కరించగలిగితే... ఇలాంటి కథలను బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అందుకే నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి... సమాజంలో యువతను పట్టి పీడిస్తున్న క్రికెట్ బెట్టింగ్, డ్రగ్స్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ క్రైం థ్రిల్లర్ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినా... ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచనాలను పెంచేస్తుంది.

సెకండాఫ్ ఎలా ఉందంటే?:ఇక సెకెండాఫ్ లో వచ్చే వన్ బై వన్ ట్విస్ట్ లు ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేస్తాయి. ఎక్కడా బోరింగ్ లేకుండా సాగే సెకెండాఫ్తో సినిమా పరుగులు పెడుతుంది. ఈ సినిమాలో ఎక్కువగా పాటలు లేకపోవడం కూడా ఓ ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సెట్టయిందే... పాట తప్పా.. సెకెండాఫ్లో పెద్దగా పాటలు లేకపోవడంతో సినిమా చాలా రేసీగా సాగుతుంది. ఈ వీకెండ్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా భజే వాయు వేగం. గో అండ్ వాచ్ ఇట్.
కార్తికేయ, ఐశ్వర్య మీనన్ గురించి:హీరో కార్తికేయ ఇందులో ఓ డిఫరెంట్ పాత్రలో తన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు. సందర్భానుసారం వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో తన రౌద్రరూపం చూపించి మాస్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు. తన కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. హీరోయిన్గా ఐశ్వర్యమీనన్ గ్లామర్, యాక్టింగ్తో ఆకట్టుకుంది. హ్యాపీడేస్ ఫేం రాహుల్ టైసన్ ఇందులో ఓ కీలకపాత్రలో నటించి మెప్పించారు. కథకు బలంగా మారే పాత్రలో ఆయన ఆకట్టుకొన్నాడు.
నటీనటులు పెర్ఫార్మెన్స్:తండ్రిగా సాయికుమార్, ఆయన సోదరుడు రవిశంకర్ నటన ఆకట్టుకుంటుంది. తన మార్కు డైలాగులతో ఆకట్టుకున్నారు. నటుడు శరత్ లోహితస్వ తన మార్కు నటనతో పరిధిమేరకు నటించి మెప్పించారు. అలాగే సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తన పాత్రకు న్యాయం చేశారు. హీరో స్నేహితుని పాత్రలో నటించిన సుదర్శన్ కూడా ఆకట్టుకున్నారు. విలన్ గ్యాంగ్ తరఫున హీరోను వెంటాడే పాత్రలో నటుడు కృష్ణ చైతన్య కూడా తనదైన నటనను ప్రదర్శించారు. విలన్ కుమారుని పాత్రలో నటించిన గగన్ పాత్ర పర్వాలేదు. హీరో తల్లిపాత్రలో నటించిన యాంకర్ కం నటి గాయత్రి భార్గవి కాసేపు ఉన్నా గుర్తుండిపోతారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.

దర్శకుడి గురించి:దర్శకుడు ప్రశాంత్ రెడ్డికి ఇది డెబ్యూ ఫిల్మే అయినా... సెకెండాఫ్ ను బాగా డీల్ చేశారు. ఫస్ట్ హాప్ లో కొంత వేగం తగ్గినా... ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి సినిమాని పరుగులు పెట్టించారు. కార్తికేయతో ఎక్కడా హీరోయిజం చూపించకుండా... కేవలం కథాబలం మీదనే నడిపించారు. దాంతో సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తెరమీద చూపించారు. ఈ చిత్రానికి బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ప్లస్ అయింది. ద్వితీయార్థంలో నేపథ్య సంగీతం కీ రోల్ పోషించిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఖర్చు పెట్టింది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో భజే వాయు వేగం మూవీని సరదాగా చూసేయండి.


Click it and Unblock the Notifications











