Bhale Unnade Review భలే ఉన్నాడే మూవీ రివ్యూ

Rating: 2.75/5

మూవీ: భలే ఉన్నాడే !
నటీనటులు: రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, అభిరామి, వీటీవీ గణేష్, రచ్చ రవి, హైపర్ ఆది, సింగీతం శ్రీనివాసరావు, లీలా శాంసన్, శ్రీనివాసరావు తదితరులు
దర్శకత్వం: శివసాయి వర్ధన్
నిర్మాత: ఎన్‌వీ కిరణ్ కుమార్
సమర్పణ: మారుతి
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్
బ్యానర్: రవికాంత్ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2024-09-13

తల్లి (Abhirami) తప్ప మరో ప్రపంచం తెలియని యువకుడు రాధా. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో అమ్మాయిలకు చీరలు కట్టే (Saree Drapper) ఫ్రొఫెషన్‌ను కొనసాగిస్తుంటాడు. అమ్మాయిల మధ్య ఉన్నా ఆడవారంటే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో ఆయనకు మగతనం ఉందా? లేదా? అనే అనుమానం అందరికీ ఉంటుంది. అలాంటి యువకుడితో కృష్ణ (మనీషా కందూకూరి) ప్రేమలో పడుతుంది. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని నిశ్చితార్థం చేసుకొంటారు. ఆ తర్వాత రాధా మగతనంపై కృష్ణకు అనుమానం కలుగుతుంది.

Bhale Unnade Movie Review in Telugu  Raj Tarun and Manisha Kandukuru lives up with Character

రాధాకు అమ్మాయిలంటే ఎందుకు ఇష్టం ఉండదు? అందరికి డౌట్ ఉన్నట్టు అతడు మగాడేనా? అలాంటి వ్యక్తిని కృష్ణ ఎలా? ఎందుకు ఇష్టపడింది? నిశ్చితార్థం తర్వాత రాధాపై ఎందుకు అనుమానం వచ్చింది? వారిద్దరి మధ్య ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ ఎలా జరిగింది? తల్లి చాటు బిడ్డగా రాధా ఎందుకు పెరిగాడు? నేటితరం యువకుడిలా రాధా ఎందుకు ఉండలేకపోయాడు? అనే ప్రశ్నలకు సమాధానమే భలే ఉన్నాడు! సినిమా కథ.

దర్శకుడు శివసాయి వర్ధన్ తన మదిలో మెదిలిన పాయింట్‌ను కథగా విస్తరించిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌ను చాలా ఎమోషనల్, ఫన్‌తో చక్కగా నడిపించాడు. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లను ఆయన తీర్చి దిద్దిన విధానం బాగుంది. ముఖ్యంగా హీరోయిన్ కృష్ణ పాత్ర రాసుకొన్న తీరుకు.. ఆ అమ్మాయి చేసిన ఫెర్ఫార్మెన్స్‌ బ్యాలెన్స్ కావడంతో సినిమా ఫీల్‌గుడ్‌గా సాగిపోయింది. రకరకాల భావోద్వేగాలతో సినిమాను దర్శకుడు పరుగులు పెట్టించాడు. ఈ సినిమా హిట్ అనే ఫీలింగ్ కల్పించడంలో సక్సెస్ అయ్యాడనిపిస్తుంది.

Bhale Unnade Movie Review in Telugu  Raj Tarun and Manisha Kandukuru lives up with Character

ఇక సెకండాఫ్‌లో కూడా కథ, కథనాలను అనుసరించిన తీరు బాగుంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, లీలా శ్యాంసన్‌ను దంపతులుగా చూపించి వారి మధ్య నడిపిన సున్నితమైన రొమాన్స్, డ్రామా అద్బుతంగా ఉంది. కానీ కమర్షియల్ వాల్యూస్ కోసం రచ్చ రవితో చేయించిన కామెడీ తర్వాత సినిమా ట్రాక్ తప్పిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథకు బలంగా మారే పాయింట్ విషయంలో లాజిక్ మిస్ కావడం మైనస్‌గా అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు స్టోరిని నడిపించిన విధానంతో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ను దర్శకుడు కలిగించాడు.

ఇక రాజ్ తరుణ్ ఇప్పటి వరకు చేసిన పాత్రలు,సినిమాలు చూస్తే.. ఇది ఆయన కెరీర్‌లో నిజంగా డిఫరెంట్. ఎక్కడా క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా సటిల్‌గా ఫెర్ఫార్మెన్స్ మెప్పు పొందేలా నటించాడు. చాలా సీన్లలో భావోద్వేగాన్ని పండించాడు. తల్లితో ఉండే సీన్లలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను క్రియేట్ చేశాడు. ఇక హీరోయిన్ మనీషా ఫస్టాఫ్‌లో ఇరుగదీసింది. కొత్త అమ్మాయైనా అనుభవం ఉన్న యాక్టర్‌గా నటించింది. వీటీవీ గణేష్ సినిమాను వినోదంగా మార్చాడు. హైపర్ ఆది ఉన్నంత సేపు కామెడీ పండింది. అభిరామి, శ్రీనివాసరావు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

Bhale Unnade Movie Review in Telugu  Raj Tarun and Manisha Kandukuru lives up with Character

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్‌తో ఆకట్టుకొన్నాడు. ఫస్టాఫ్‌లో మూడు సిచ్యుయేషనల్ సాంగ్స్‌తో సాఫీగా కథను నడించేలా ట్యూన్స్ ఇచ్చాడనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్. విశాఖ అందాలను అద్బుతంగా కెమెరాలో బంధించాడు. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. కథ, నటీనటుల ఎంపిక తీరు చూస్తే.. నిర్మాత ఎన్‌వీ కిరణ్ కుమార్‌కు సినిమాపై ఉన్న అభిరుచి, తపన స్పష్టంగా కనిపిస్తుంది. రాజీలేకుండా మంచి సినిమాను అందించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది.

ఇక లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఓ సున్నితమైన పాయింట్ చుట్టూ వినోదాన్ని దట్టించి రూపొందించిన చిత్రం భలే ఉన్నాడే. ఫస్టాఫ్ ఫన్, కామెడీతో సరదాగా సాగిపోతూనే.. మంచి పాయింట్‌ను చెప్పే ప్రయత్నం చేయడం ఈ సినిమాకు పాజిటివ్‌గా మారింది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథను చెప్పిన తీరు బాగుంది. కొన్ని విషయాల్లో ఎక్కడో లాజిక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ తప్పా ఎలాంటి కంప్లయింట్స్ లేకుండా ఫక్కాగా కుటుంబ కథా చిత్రంగా తీసి మెప్పించారనే చెప్పాలి. ఈ వారం ఫ్యామిలీ, ఫన్ ఉన్న సినిమాను చూడాలనుకొంటే... భలే ఉన్నాడే సినిమాను ఎలాంటి అనుమానం లేకుండా చూడొచ్చు. మంచి అనుభూతిని పొందే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.

More from Filmibeat

Read more about: bhale unnade raj tarun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X