For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bhama kalapam Movie Review : ప్రియమణి నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

  |

  Rating :2.5/5

  'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరిస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తొలి ఓటీటీ మూవీ 'భామా కలాపం'. ఈ సినిమా శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అభిమన్యు దర్శకుడిగా పరిచయమైన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని సుధీర్ ఈదర, బాపినీడు కలిసి నిర్మించారు. ముందు నుంచి సినిమా మీద పెద్ద అంచనాలు లేకున్నా ట్రైలర్ రిలీజ్ విజయ్ దేవరకొండ చేయడం, సినిమా మీద ఆసక్తి పెంచింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన సినిమా అంచనాను అందుకుందా? అనేది ఈ సమీక్షలో చూద్దాం.

  భామా కలాపం కథ ఏమిటంటే?

  భామా కలాపం కథ ఏమిటంటే?

  అనుపమ(ప్రియమణి) మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. తన భర్త, కొడుకుతో కలిసి జీవించే ఆమె యూట్యూబ్ లో వంట వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. అయితే అనుపమకు ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే ఆసక్తి చాలా ఎక్కువ. అయితే ఈ అలవాటు కారణంగా అపార్ట్మెంట్ వాళ్ళతో, భర్తతో తిట్లు తింటూ ఉంటుంది. అయినా తన పద్ధతి మాత్రం మార్చుకోని ఆమె పక్కింటి భార్యాభర్తల గొడవ సంగతి తేల్చాలని భావించి అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆ హత్యకి అనుపమ కి ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసు వ‌లన అనుప‌మ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది..? అనేది సినిమా కథ.

   భామా కలాపం ట్విస్టులు

  భామా కలాపం ట్విస్టులు

  సాధారణ గృహిణి తనకున్న పక్కింటి మీద కన్ను వేసే అలవాటు కారణంగా ఒక హత్య కేసులో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? ఆ కష్టాల నుంచి బయట పడింది అనే దాన్ని సినిమాగా తెరకెక్కించారు. పక్కింటి భార్య భర్తల మధ్య జరిగిన గొడవ వెనుక రహస్యం ఛేదించాలనుకుని ఓ ఫ్లాట్ లోకి వెళ్ళి బుక్ అయిపోతుంది. ఆ ఫ్లాట్ లో నివాసముండే భర్త హత్యకు గురి కాగా, తనపై దాడి చేసిన మణి అనే వ్యక్తిని అనుపమ ఆత్మరక్షణ కోసం పొడిచి చంపేసి, తంటాలు పడి మణి శవాన్ని తన ఇంటికి తీసుకొచ్చి తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అతని శవం మాయం చేస్తే చాలనుకుని అనుకున్న టైమ్ లో నాయర్ (జాన్ విజయ్) అనే వ్యక్తి ఫోన్ చేసి... రెండు వందల కోట్ల విలువ చేసే కోడిగుడ్డు తనకు ఇవ్వకుంటే ఆమె శవాన్ని మాయం చేస్తున్న వీడియో బయట పెడతానని బెదిరిస్తాడు. అసలు ఆ రెండు వందల కోట్లు కోడి గుడ్డు వెనుక ఉన్న కథేంటి? తనకు తెలియకుండానే ఈ వివాదంలో చిక్కుకున్న అనుపమ అందులోంచి ఎలా బయట పడింది? ప్లాట్స్ లోని వారి కష్టాలు విని వారికి పరిష్కారం చెప్పే పాస్టర్ డేనియల్ బాబు (కంచరపాలెం కిషోర్) ఈ హత్యలో ఏమేరకు ఉంది? చివరికి ఏమైంది? అనేది 'భామా కలాపం' కథ.

  దర్శకుడి మేకింగ్

  దర్శకుడి మేకింగ్

  కొత్త దర్శకుడు అభిమన్యు ఈ సినిమాతో పరిచయం అయ్యారు. ఒకరకంగా తెలుగులో మర్డర్ మిస్టరీ సినిమాలు చాలా వచ్చినా ఇది కొంత కొత్త ప్రయోగం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ తరహా చిత్రాన్ని ఇంత వరకు చూడలేదు. ఇలా ఒక్కరోజులో జరిగే విషయాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్న ట్రెండ్ పెరిగింది. కథ ప్రారంభం కోల్కత్తాలో ఓ యాంటిక్ ఎగ్ దొంగతనం నుంచి మొదలవుతుంది. అలా ఎక్కడో కోల్కత్తాలో దొంగతనం జరిగిన ఒక ఎగ్ కారణంగా వరుస హత్యలు అందులో ఒక హత్య కేసులో ఏమాత్రం సంబంధం లేని మిడిల్ క్లాస్ మహిళ చిక్కుకోవడంతో దాన్ని తప్పించుకోవడం కోసం ఆమె ఏం చేసింది అనే విషయాలని దర్శకుడు బాగా డీల్ చేయగలిగాడు. క్లైమాక్స్ కూడా ఎవరికీ ఊహకందని విధంగా ముగింపు ఇచ్చి వీక్షకులను ఎంగేజ్ చేయడంలో విజయం సాధించారు.

  నటీనటుల విషయానికి వస్తే

  నటీనటుల విషయానికి వస్తే

  మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ పాత్రలో ప్రియమణి కరెక్ట్ గా సూట్ అయింది. ఇతరుల విషయాల పట్ల ఆసక్తి చూపించే మధ్యతరగతి మహిళగా ప్రియమణి బాగా నటించి ఆకట్టుకుంది. ఆమె పనిమనిషిగా శరణ్య ప్రదీప్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా శాంతి రావు కూడా తన పరిధి మేరకు ఆకట్టుకుంది. సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డేనియల్ బాబు గా నటించిన కంచరపాలెం కిషోర్ పొలిమేర గురించి. ప్రభువు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, ఆ వచ్చే సంకేతం కోసం ఎదురు చూసే పాస్టర్ పాత్రలో జీవించాడు. అతని నటన కొన్ని సీన్లలో ఆశ్చర్య పరుస్తుంది. తమిళ నటుడు జాన్ విజయ్ కూడా చాలా ఈజ్ తో నటించారు.

   టెక్నికల్ విషయానికి వస్తే

  టెక్నికల్ విషయానికి వస్తే

  జస్టిన్ ప్రభాకర్ అందించిన సాంగ్స్ ఆకట్టుకోలేదు కానీ మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ ను ఎలివేట్ చేయడానికి సహాయం చేశాయి. దీపక్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. విప్లవ్ ఎడిటింగ్ కూడా వంకలు పెట్టడానికి వీలు లేకుండా కరెక్ట్ గా సరిపోయింది. అభిమన్యు కధకు జై కృష్ణ రాసిన డైలాగ్స్ కూడా సెట్ అయ్యాయి. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తనయుడు బాపినీడు, సుధీర్ ఈదరతో కలిసి ఈ సినిమాను నిర్మించడంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

   ఫైనల్ గా

  ఫైనల్ గా


  ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో సహా చూడగలిగిన ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ.

  Recommended Video

  Bhamakalapam : Priyamani Laughter-filled Interview ప్రియమణి బీయింగ్ బోల్డ్ | Filmibeat Telugu
   నటీనటులు:

  నటీనటులు:

  ప్రియమణి, శరణ్య, కంచరపాలెం కిషోర్, శాంతి రావు, జాన్ విజయ్, తదితరులు
  ఎడిటర్: విప్లవ్
  సినిమాటోగ్రఫీ: దీపక్ ఎరగెర
  సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్
  నిర్మాతలు: బాపినీడు, సుధీర్
  దర్శకత్వం: అభిమన్యు తడిమేటి
  ఓటీటీ :ఆహా

  English summary
  Priyamani's Bhama kalapam movie released on Aha Video on February 11th. Here is the exclusive review from Telugu Filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X