twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భానుమతి రామకృష్ణ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: నవీన్ చంద్ర, సలోని లూత్రా, రాజా చెంబోలు, హర్ష, షాలిని వద్నికట్టి
    Director: శ్రీకాంత్ నాగోతి

    ప్రేక్షకుల అభిరుచి మారుతున్న క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్, మసాలా కథలకు కాలం చెల్లినట్టే కనిపిస్తున్నది. సృజనాత్మకు ఎక్కువగా చోటిస్తున్న ఇతర భాషా చిత్రాల ప్రభావమో గానీ, ఓటీటీలో వస్తున్న మూవీస్ ఇంపాక్ట్ ఏమో గానీ తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతల్లో గణనీయమైన మార్పు కనిపిస్తున్నది. ఇటీవల వస్తున్న కొన్ని చిన్న చిత్రాల్లోనైనా.. భారీ బడ్జెట్ చిత్రాల్లోనే అలాంటి విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే భానుమతి రామకృష్ణ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను అందుకొంటున్న ఈ చిత్రం బలాబలాలు, బలహీనతలేంటో ఓ సారి పరిశీలిద్దాం..

    భానుమతి రామకృష్ణ కథ ఇది..

    భానుమతి రామకృష్ణ కథ ఇది..

    కెరీర్ మాత్రమే జీవితంగా భావిస్తూ, స్వతంత్ర భావాలు పుష్కలంగా ఉన్న 30 ఏళ్ల యువతి భానుమతి ( సలోని లుత్రా ). ఆమె జీవితంలో ఉన్నట్టుంది ఐదేళ్ల రిలేషన్‌షిప్‌ బ్రేకప్ అవుతుంది. అహం దెబ్బ తిన్న క్రమంలో అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేసే ఆమెకు రామకృష్ణ (నవీన్ చంద్ర) పరిచయం అవుతాడు. ఆధునిక భావాలు కలిగిన భానుమతి, పల్లెటూరి వాతావరణంలో పెరిగిన స్వచ్ఛమైన మనసున్న రామకృష్ణకు మధ్య లైఫ్ స్టైల్, అభిరుచుల విషయంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో వారిద్దరు మానసికంగా దగ్గరవుతారు. అయితే భానుమతి వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ విషయంలో రామకృష్ణ చనువు తీసుకోవడంతో కొంత గందరగోళం ఏర్పడుతుంది.

    సినిమాలో ట్విస్టులు

    సినిమాలో ట్విస్టులు

    స్వతంత్ర భావాలు ఉండటం కారణంగా జీవితంలో ఎలాంటి ఇబ్బందులను భానుమతి ఎలా ఎదుర్కొన్నారు? గ్రామీణ వాతావరణం, దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఉండే విలువల్ని పాటించే రామకృష్ణకు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలాంటి కష్టాలు తారసపడ్డాయి? భానుమతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో రామకృష్ణ ఎందుకు దూరాల్సి వచ్చింది? భానుమతి, రామకృష్ణ మధ్య చోటుచేసుకొన్న అపార్ధాలకు ఎలాంటి పరిష్కారం లభించింది? భానుమతి, రామకృష్ణ మధ్య ఏర్పడిన బంధం జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిందనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే భానుమతి రామకృష్ణ సినిమా.

    సింపుల్, మెచ్చుర్డ్‌గా

    సింపుల్, మెచ్చుర్డ్‌గా

    భానుమతి రామకృష్ణ సినిమా విషయానికి వస్తే గొప్ప మలుపులు, భావోద్వేగమైన సన్నివేశాలు కనిపించని అతిసాదారణమైన ప్రేమ కథ. అశ్లీల, అసభ్యతకు పెద్దగా చోటులేని కాంటెంపరరీ మూవీ. ప్రేక్షకుడిలో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌ నింపుతూ తెర మీద సున్నితమైన పాత్రలు కదలాడుతుంటాయి. కొన్ని పాత్రల మధ్య మానసిక సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటాయి. దాంతో ప్రేక్షకుడు వాటికి కనెక్ట్ కావడానికి అవకాశం కలిగిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    దర్శకుడి పనితీరు

    దర్శకుడి పనితీరు

    భానుమతి రామకృష్ణ సినిమా చూసినంత సేపు కొన్ని రకాలు ఇరిటేషన్ లేకుండా సింపుల్‌గా కథ అలా అలా సాగిపోయేలా దర్శకుడు తన ప్రతిభకు పదును పెట్టారని చెప్పవచ్చు. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి రాసుకొన్న కథ, కథనాలు ప్రేక్షకుడిని ఆకట్టుకొనేలా ఉన్నాయి. కాకపోతే కథ చెప్పడంలో దర్శకుడు పాటించిన విధానం వల్ల ఫస్టాఫ్‌లో కొంత భాగం, సెకండాఫ్‌లో మరికొంత సాగదీసినట్టు ఉంటుంది. దర్శకుడు రవికాంత్ పేరేపు ఎడిటింగ్ క్రిస్పీగా ఉండటంతో సన్నివేశాల్లో ఫీల్ స్పష్టంగా కనిపిస్తుంది. సాయి ప్రకాశ్ సినిమాటోగ్రఫి రిచ్‌గా ఉంది. ఆర్ట్ విభాగం పనితీరు కూడా ఆకట్టుకొనేలా ఉంది.

     సాంకేతిక నిపుణుల పనితీరు

    సాంకేతిక నిపుణుల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు కూడా బాగుంది. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ పనితీరు గొప్పగా లేకపోయినా సినిమాను ఫీల్‌గుడ్ ఇమేజ్‌ను కలిగించేలా ఉంది. సింపుల్‌గా, పెదవి మీద ఓ చిరునవ్వు, మనసులో కొంత ఎమోషనల్ పాయింట్‌ను రేకెత్తించేలా డైలాగ్స్ ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పొచ్చేదేమిటంటే.. భానుమతి రామక‌ృష్ణ గొప్ప సినిమా కాదు.. ఎలాంటి అంచనాలు, ఈక్వేషన్స్ మనసులో పెట్టుకోకుండా చూస్తే రెండుగంటలపాటు హ్యాపీగా సాగిపోయే ఫీల్‌గుడ్ చిత్రమని చెప్పవచ్చు.

    నటీనటుల ఫెర్ఫార్మెన్స్

    నటీనటుల ఫెర్ఫార్మెన్స్

    ఆధునిక భావాలు ఉన్న యువతిగా సలోని లూత్రా తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. చిరాకులు, చిటపటలాడే మనస్తత్వం ఉన్న రోల్‌లో సహజంగా కనిపించారు. పాత్ర శైలిని అర్ధం చేసుకొని దర్శకుడి విజన్ తగినట్టుగా ఒదిగిపోయందనే ఫీలింగ్ కలుగుతుంది. లుక్‌ వైజ్ కొన్ని సీన్లలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది. ఇక నవీన్ చంద్ర విషయానికి వస్తే.. మరో మంచి పాత్రలో కనిపించారని చెప్పవచ్చు. రెండు రకాల వేరియేషన్ ఉన్న పాత్రతో మెప్పించారు. రాజా చెంబోలు పాత్ర చిన్నదైనా సినిమాపై ఇంపాక్ట్ చూపిస్తుంది. హర్ష కామెడీ అవసరమైనంత వరకే ఉంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    చివరగా భానుమతి రామకృష్ణ మొదటి నుంచి చెప్పినట్టు గొప్ప సినిమా కాదు గానీ.. ఫీల్‌గుడ్ మూవీ. ఓటీటీ ఫ్లాట్‌ఫాం కోసమే తీశారా అనే ఫీలింగ్‌ను కల్పిస్తుంది. వీకెండ్‌లో సరదాగా, ఫ్యామిలీతో సహా చూసే చిత్రమని చెప్పవచ్చు. మెచ్యుర్డ్ లవ్ స్టోరిని ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఎంజాయ్ చేయడానికి పుష్కలమైన స్కోప్ ఉంది.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్
    సింపుల్ కథ, సెన్సిబుల్ స్క్రీన్ ప్లే
    డైరెక్షన్
    ఎడిటింగ్, సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ లేకపోవడం
    ఎమోషనల్ పాయింట్స్
    స్లో నేరేషన్

    Recommended Video

    Aha Originals : Bhanumathi Rama Krishna Teaser | ఆహాలో ‘భానుమతి రామకృష్ణ'
    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: నవీన్ చంద్ర, సలోని లూత్రా, రాజా చెంబోలు, హర్ష, షాలిని వద్నికట్టి
    దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి
    నిర్మాతలు: యశ్వంత్, రఘు వర్మ
    సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
    సినిమాటోగ్రఫి: సాయి ప్రకాశ్
    ఎడిటింగ్: రవికాంత్ పేరెపు
    రిలీజ్: 2020-07-03
    ఓటీటీ ఫ్లాట్‌ఫాం: ఆహా

    English summary
    Bhanumathi & Ramakrishna Movie Review: Srikanth Nagothi's directoral debut movie Bhanumathi Ramakrishna is a sensible movie. Naveen Chandra, Salony Luthra are in lead. Director Ravikanth Perepu worked as Editor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X