twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భరత్ అనే నేను సినిమా రివ్యూ: మహేష్‌బాబు, కొరటాల మ్యాజిక్

    By Rajababu
    |

    Recommended Video

    Bharat Ane Nenu Movie Review రికార్డులు బద్దలు కొట్టిన భరత్ అనే నేను

    Rating:
    3.5/5
    Star Cast: మహేష్‌బాబు, కియారా అద్వానీ, ప్రకాశ్ రాజ్
    Director: కొరటాల శివ

    దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రిన్స్ మహేష్‌బాబు ఒకరు. ఆయన నటించిన చిత్రాలు దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రిన్స్ నటించిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ప్రిన్స్ కెరీర్‌లో తప్పనిసరిగా హిట్టు కావాల్సిన తరుణంలో ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందుకోసం శ్రీమంతుడు అందించిన దర్శకుడు కొరటాల శివతో జతకట్టాడు. ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం గత చిత్రాల కంటే మిన్నగా మ్యాజిక్ సాధించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     భరత్ అనే నేను స్టోరీ

    భరత్ అనే నేను స్టోరీ

    భరత్ (మహేష్‌బాబు) రాజకీయ వేత్త రాఘవ (శరత్ కుమార్) కుమారుడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో లండన్‌లో పెరుగుతాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఐదు డిగ్రీలు పొందుతాడు. తండ్రి ఆకస్మిక మరణంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన భరత్.. వసుమతి అనే ఎంబీఏ విద్యార్థి ప్రేమలో పడుతాడు. సీఎం పదవి చేపట్టిన భరత్ అనూహ్య నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననల్ని పొందుతాడు. కానీ ఓ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత తండ్రి మరణం సహజం కాదనే విషయం తెలుస్తుంది.

    క్లైమాక్స్ ఇలా

    క్లైమాక్స్ ఇలా

    అద్భుతమైన పాలనను అందిస్తున్న భరత్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? తండ్రి ఎలా చనిపోయాడు. తండ్రి మరణం వెనుక ఉన్న వ్యక్తులపై ఎలాంటి పగను తీర్చుకొన్నాడు? వసుమతి ప్రేమ కోసం భరత్ ఏం చేశాడు? సీఎం పీఠాన్ని భరత్ తిరిగి ఎలా దక్కించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే భరత్ అనే నేను చిత్ర కథ.

     ఫస్టాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    ఫస్టాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    లండన్‌లో భరత్ లైఫ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. సమయం ఎక్కువగా తీసుకోకుండానే ప్రధాన కథలోకి సినిమా వెళ్తుంది. తండ్రి మరణంతో లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో తన బాల్యానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చకచకా సాగిపోతాయి. అనూహ్య పరిస్థితుల్లో భరత్ సీఎంగా మారడంతో సినిమా మరో మలుపు తిరుగుతుంది. కథలో వేగం పెరగడంతో వినోదంతో చక్కగా సాగిపోతుంది. తొలిభాగంలో ప్రకాశ్ రాజ్ (నానాజీ), మహేష్‌బాబు మధ్య సన్నివేశాలు గ్రిప్పింగ్ ఉండటంతో సినిమాపై పట్టు బిగుస్తుంది. ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో సినిమా ప్రథమార్థం ముగుస్తుంది.

    సెకండాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    సెకండాఫ్ స్క్రిప్టు అనాలిసిస్

    భరత్ అనే నేను సెకండాఫ్‌లో ప్రధానంగా రాష్ట్రంలోని సమస్యలు, వాటి పరిష్కారం అనే అంశాల దిశగా సినిమా ముందుకెళ్తుంది. అయితే రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు బలంగా లేకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. కానీ మహేష్‌బాబు నటన, కొరటాల మార్కు టేకింగ్ ఆ లోపాల నుంచి ప్రేక్షకులను బయటపడేయడానికి దోహద పడుతాయి. సెకండాఫ్‌లో ఉప ఎన్నికల ఎపిసోడ్‌ను మరింత బలంగా చెప్పే అవకాశం ఉన్నా దానిని దర్శకుడు సద్వినియోగం చేసుకోలేకపోయడానే ఫీలింగ్ కలుగుతుంది. రాజీనామా అనంతరం ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సన్నివేశాలు అతి సాధారణంగా ఉండటం, ఎమోషనల్ కంటెంట్ ఎక్కడా కనిపించకపోడం కొంత మైనస్‌గా కనిపిస్తుంది.

     కొరటాల శివ విజన్, టేకింగ్

    కొరటాల శివ విజన్, టేకింగ్

    ఎప్పటిలానే కొరటాల శివ సామాజిక అంశాలతో కథను అల్లుకొన్నాడు. కథ, కథనాలను పక్కగా రూపకల్పన చేసుకొన్నప్పటికీ.. అక్కడక్కడ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. సోషల్ ఇష్యూస్‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జొప్పించడంలో కొరటాల శివ తన మార్కు చూపించాడు. భావోద్వేగ సన్నివేశాలను చక్కగా రాసుకొన్నాడు. హీరోయిన్ వసుమతితో రొమాంటిక్ సీఎం భరత్ రొమాంటిక్ సన్నివేశాల విషయంలో హద్దు దాటలేదు. మహేష్ పాత్ర డిజైన్ కొరటాల పరిణతికి అద్దం పట్టింది. ప్రకాశ్ రాజ్ క్యారెక్టరైజేషన్‌పై ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొన్నట్టు కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన అంశాలను చక్కగా పేర్చుకోవడంలో కొరటాల సఫలమయ్యాడు.

     మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్

    మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్

    మహేష్‌బాబు కెరీర్‌లో భరత్ అనే నేను ఓ ప్రత్యేకమైన చిత్రమని చెప్పవచ్చు. భరత్‌గా ప్రిన్స్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ముఖ్యమంత్రి పాత్రకు సంబంధించిన మహేష్ హావభావాలు ఆకట్టుకొంటాయి. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ అభిమానులను అలరిస్తాడు. సామాజిక అంశాలకు సంబంధించిన సీన్లలో భావోద్వేగానికి గురిచేస్తాడు. మహేష్ గ్లామర్ విషయానికి వస్తే వంశీ, పోకిరి చిత్రాల్లో మాదిరిగా మహేష్‌బాబు కుర్రాడిలా కనిపించాడు. ప్రధానంగా మీసాలు పెట్టుకొన్న సన్నివేశాల్లో సూపర్‌స్టార్ కృష్ణలా కనిపించాడు. కొన్ని డైలాగ్స్ చెప్పినప్పుడు కృష్ణను గుర్తు చేస్తాడు.

     కియారా అద్వానీ గ్లామర్

    కియారా అద్వానీ గ్లామర్

    భరత్ అనే నేను సినిమాకు కియారా అద్వానీ గ్లామర్ అదనపు ఆకర్షణ. ఈ చిత్రంలో కియారాకు కొన్ని సన్నివేశాలే ఉన్నప్పటికీ తన పరిధిలో మంచి నటనను ప్రదర్శించింది. పాటల్లోను, భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆకట్టుకొన్నది. భవిష్యత్‌లో కియారా మంచి గ్లామర్ తారగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

     ప్రకాశ్ రాజ్ ఇతరుల ప్రతిభ

    ప్రకాశ్ రాజ్ ఇతరుల ప్రతిభ

    నానాజీగా ప్రకాశ్ రాజ్ మరోసారి అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఇలాంటి పాత్ర ప్రకాశ్ రాజ్‌కు కొట్టిన పిండే. కానీ ఈ సినిమాకు ప్రకాశ్ రాజ్ వెన్నముకగా నిలిచాడు. సెకండాఫ్‌లో ప్రకాశ్ రాజ్ పాత్ర హైలెట్‌గా ఉంటుంది.

     దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్

    దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్

    భరత్ అనే నేను సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం జీవం పోసింది. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగించేలా ఉంటుంది. భరత్ అనే నేను థీమ్ సాంగ్, వచ్చాడయ్యా సామీ పాటలు ఆడియోపరంగానే కాకుండా తెరపైన కూడా బాగా పండాయి. ఐ డోంట్ నో తెరమీద మెరుపులు మెరిపించింది. వసుమతి పాట కూడా ఆకట్టుకునేలా ఉంటుంది.

    రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ

    రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ

    భరత్ అనే నేను చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి మరో హైలెట్ అని చెప్పవచ్చు. లండన్ ఎపిసోడ్స్, ట్రాఫిక్ సమస్య, అసెంబ్లీ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించాడు. సెకండాఫ్‌లో కర్నూలు ఎపిసోడ్, జిల్లాల పర్యటన అంశాలు భావోద్వేగాన్ని కలిగించేలా తెరకెక్కించాడు. వచ్చాడయ్యో సాంగ్‌ను తెరమీద అద్భుతంగా కనిపిస్తుంది.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    మిగితా సాంకేతిక విభాగాల్లో ఆర్ట్ విభాగం పనితీరును మెచ్చుకోవాల్సిందే. అసెంబ్లీ సెట్, వచ్చాడయ్యో సాంగ్ కోసం ఆలయం సెట్‌ను కళ్లు చెదిరేలా రూపకల్పన చేశారు. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగానే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల ఎడిటింగ్‌కు స్కోప్ ఉంది. వీఎఫ్ఎక్స్ టీమ్ వర్క్ కూడా ఆకట్టుకొన్నది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    కొరటాల శివ, మహేష్‌బాబు కాంబినేషన్ అంటేనే బలమైన కథ ఉంటుంది. కథ డిమాండ్ మేరకు సినిమాను చాలా రిచ్‌గా రూపొందించడంలో నిర్మాత డీవీవీ దానయ్య సఫలమయ్యాడు. కొన్ని సీన్లను భారీగా, ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. ముఖ్యంగా అసెంబ్లీ, ఆలయం సెట్లు అద్భుతంగా ఉంటాయి. డీవీవీ బ్యానర్‌ నిర్మాణ విలువలు సూపర్ అని చెప్పవచ్చు.

     ఫైనల్‌ జడ్జిమెంట్

    ఫైనల్‌ జడ్జిమెంట్

    భరత్ అనే నేను సినిమాకు ప్రిన్స్ మహేష్, దర్శకుడు కొరటాల శివ ప్రధాన బలం. కొరటాల శివ కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంటాయి. భరత్‌గా మహేష్‌బాబు‌ నటన ఫ్యాన్స్ పండుగ వాతావరణాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కథ, కథనాల్లో కొన్ని లోపాలు ఉనప్పటికీ.. ప్రిన్స్ మహేష్ వాటిని కనిపించకుండా మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా మారే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల రికార్డులే ఈ సినిమా రేంజ్‌ను త్వరలోనే భయటపెట్టడం ఖాయం.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    • మహేష్ బాబు పెర్ఫార్మెన్స్
    • కొరటాల శివ టేకింగ్
    • కథ, కథనాలు
    • రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ
    • దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్
    • మైనస్ పాయింట్స్
      • సెకండాఫ్‌
      • ఎడిటింగ్
      • నిడివి
      తెర ముందు.. తెర వెనుక

      తెర ముందు.. తెర వెనుక

      నటీనటులు: మహేష్‌బాబు, కియారా అద్వానీ, ప్రకాశ్ రాజ్, ఆర్ శరత్‌కుమార్, పోసాని కృష్ణ మురళీ, జీవా, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, రామజోగయ్య శాస్త్రి తదితరులు
      కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ
      నిర్మాత: డీవీవీ దానయ్య
      సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
      సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్
      ఎడిటింగ్: ఏ శ్రీకర ప్రసాద్
      బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
      రిలీజ్ డేట్: 20 ఏప్రిల్ 2018
      నిడివి: 2 గంటల 53 నిమిషాలు

    English summary
    Bharat Ane Nenu cinema review: Maheshbabu's another Magic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X