Bharat Bhhagya Viddhaata First Review: భారత్ భాగ్య విధాత మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ నటించిన ఎమోషనల్ డ్రామా భారత్ భాగ్య విధాత. 26/11 ముంబై బాంబు పేలుళ్ల సంఘటనలో నర్సుల సేవలు బ్యాక్ డ్రాప్‌గా రూపొందింది. ఈ సినిమాలో గిరిజా ఓక్, స్మిత తాంబే, అమృత నామ్‌దేవ్, ఇషా డియో, సుహిత తట్టే తదితరులు నటించారు. ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస క్రియేషన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై డాక్టర్ జయంతిలాల్ గడా నిర్మించారు. కంగన రనౌత్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి మ్యూజిక్: అమన్ పంత్, ఎడిటర్: దేవ్ రావు జాదవ్, యాక్షన్ డైరెక్టర్: సునీల్ రోడ్రిగ్స్, సౌండ్ ఇంజినీర్: నిహార్ రంజన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి లభించిన సెన్సార్ సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్‌టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Bharat Bhhagya Viddhaata Review By Censor Board

ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడి, పేలుళ్ల సంఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ దుర్ఘటనలో గాయపడిన బాధితులకు ముంబైలోని పలు హాస్పిటల్స్‌లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్లు, నర్సులు విశేషమైన సేవలను అందించారు. కామా హాస్పిటల్‌పై జరిగిన దాడులను హస్పిటల్ స్టాఫ్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. హాస్పిటల్‌లో పని చేసే నర్సులు, హాస్పిటల్ స్టాఫ్ సుమారుగా 400 మంది ప్రజలను కాపాడారు. ఉగ్రదాడులు జరిగిన సమయంలో 20 మంది గర్బవతులకు సురక్షితంగా ప్రసవాన్ని చేశారు. ఇలాంటి హిస్టారికల్ కథను ఆధారంగా చేసుకొని థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఎమోషనల్ డ్రామాగా రూపొందించారు. ఈ సంఘటనలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన అంజలి కుల్తే జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో స్టాఫ్ నర్స్‌ అంజలిగా కంగన రనౌత్ నటించారు.

గుండెను పిండేసే భావోద్వేగాలతో నింపిన కథ, నర్సుల ధైర్య సాహసాలు నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. జాతీయభావం ఉప్పొంగేలా ఉగ్రవాదానికి ఎదురొడ్డిన నిలిచిన నర్సుల స్పూర్తిదాయకమైన జీవితాన్ని సినిమాగా రూపొందించినందుకు చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఈ చిత్రంలో పెద్దగా మార్పులు, చేర్పులు లేకుండానే ఈ సినిమాకు యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదా అనుమతితో చూడాల్సి ఉంటుంది అని సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎమోషనల్ డ్రామా కావడంతో కథను పిన్ పాయింట్‌గా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమాలో సన్నివేశాలను సాగదీయకుండా షార్ప్‌గా ఎడిటింగ్ చేశాం. దాంతో ఈ సినిమా నిడివి 2 గంటల 7 నిమిషాలు అంటే.. 127 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశాం. ఎక్కువ నిడివి ఉన్న సినిమాను చూశామనే అసంతృప్తిని ఈ సినిమా కలుగనివ్వదు అని చిత్ర యూనిట్ తెలిపింది.

భారత్ భాగ్య విధాత సినిమా సెన్సార్ తర్వాత కంగన రనౌత్ పెర్ఫార్మెన్స్, ఇతర నటీనటులు యాక్టింగ్‌పై ప్రశంసలు లభించాయి. దర్శకుడు రాసుకొన్న కథ, కథనాలు భావోద్వేగపూరితంగా ఉంటాయి. ఈ కథను నమ్మి నిర్మాతగా మారిన కంగన రనౌత్‌ అభిరుచిని అభినందించినట్టు సమాచారం. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X