Bhari Taraganam Review అలీ సోదరుడు హీరోగా భారీ తారాగణం.. సదన్ మెప్పించాడా?
Rating: 2.5/5
నటీనటులు: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష, కేదార్ శంకర్, తోటపల్లి మధు, ఆలీ, సరయు తదితరులు
నిర్మాత: బీవీ రెడ్డి
దర్శకత్వం: శేఖర్ ముత్యాల
సినిమాటోగ్రఫి: ఎంవీ గోపి
ఎడిటర్: మార్తండ్ కే వెంకటేశ్
మ్యూజిక్: సుక్కు
సహ నిర్మాత: చంద్రశేఖర్ గౌడ్.వి
కొరియోగ్రాఫర్: శ్రీవీర్ దేవులపల్లి
సాహిత్యం: సుక్కూ, సాహిత్య, కమల్ విహాస్, శేఖర్
ఆర్ట్: జెకె మూర్తి
స్టంట్స్: దేవరాజ్
బ్యానర్: బీవీఆర్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-06-23
విశ్వనాథ్ (కేదార్ శంకర్), రఘు (తోటమల్లి మధు) క్లోజ్ ఫ్రెండ్స్. విశ్వనాథ్ కొడుకు సదన్ (సదన్), రఘు కూతురు ధనలక్ష్మీ (రేఖ నిరోషా) కూడా బాల్య స్నేహితులు. సదన్, ధనలక్ష్మీ పెద్ద పెరిగిన తర్వాత వారిద్దరికి పెళ్లి చేయాలని విశ్వనాథ్, రఘు అనుకొంటారు. అయితే బీటెక్‌లో జాయిన్ అయిన సదన్ అదే కాలేజ్‌లో చదివే స్టూడెంట్ తార (దీపిక రెడ్డి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే కొన్ని సంఘటనల కారణంగా సదన్‌కు తార దూరమవుతుంది. తన లవ్‌ను రిజెక్ట్ చేసిందనే బాధతో సదన్ ఊరికి వస్తాడు.

సదన్, ధనలక్ష్మీకి పెళ్లి చేయాలనే నిర్ణయాన్ని విశ్వనాథ్, రఘు కొనసాగించారా? తారతో సదన్ లవ్ ట్రాక్ ఎలా నడిచింది? సదన్‌కు ఎందుకు తార ఎందుకు దూరమైంది. సదన్‌తో ధనలక్ష్మీ పెళ్లి జరిగిందా? తారతో ధనలక్ష్మీ పెళ్లి జరిగిందా? సదన్‌కు మరో ముగ్గురు అమ్మాయిలతో ఉన్న రిలేషన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భారీ తారాగణం సినిమా కథ.
భారీ తారాగణం సినిమా ద్వారా ప్రముఖ హాస్య నటుడు ఆలీ సోదరుడు కుమారుడు సదన్ టాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. సదన్ పేరుతో ఉన్న పాత్ర ద్వారా ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం చేశారు. పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రను చాలా సులభంగా పండించాడు. ఫైట్స్, డ్యాన్సుల విషయంలో కూడా మెప్పించాడనే చెప్పాలి.
ఇక దీపిక రెడ్డి, రేఖ నిరోషా, స్మైలీ, తోటపల్లి రమణ, కేదార్ శంకర్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. ఆలీ ఓ పాటలో స్టెప్పులేసి ఆకట్టుకొన్నాడు. డాబా ఓనర్‌గా సరయు ఫెర్ఫార్మెన్స్ బాగుంది. పొలిటిషియన్ పోసాని కృష్ణమురళి పర్వాలేదనిపించాడు. ఛత్రపతి శేఖర్, ఇతర నటులు కూడా తమ పాత్రలో ఒదిగిపోయారు.
దర్శకుడు శేఖర్ ముత్యాల ఊహించుకొన్న పాయింట్ బాగుంది. ఆ పాయింట్‌ను రకరకాల ట్విస్టులతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే ప్రయత్నం చేశారు. ఆయన కథ, పాత్రల డిజైన్‌పై మరికాస్త దృష్టి పెట్టాల్సిందనిపిస్తుంది. అయితే సినిమాలో ముఖ్యంగా భారీ తారాగాణాన్ని డీల్ చేసిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది.
భారీ తారాగణం సినిమాకు మ్యూజిక్ బలంగా కనిపిస్తుంది. ఎంవీ గోపి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్ వాడుకొన్న విధానం, కలర్ ప్యాటర్న్ సినిమాను రిచ్‌గా మార్చింది. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. బీవీ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా రూపొందించారు. కామెడీ, లవ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమాలను ఇష్టపడే వారికి భారీ తారాగణం నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











