Bhartha Mahasayulaku Wignyapthi Movie Review: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్, సత్య, తారక్ పొన్నప్ప, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: చెరుకూరి సుధాకర్
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫి: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
బ్యానర్: SLV సినిమాస్
రిలీజ్ డేట్: 2026-01-13
స్పెయిన్‌లో మానస (ఆషికా రంగనాథ్) వైన్ తయారీ కంపెనీకి యజమాని. రామ సత్యనారాయణ అలియాస్ రామ్ (రవితేజ) తన భార్య బాలమణి (డింపుల్ హయతి)తో కలిసి వైన్ తయారీ కంపెనీని హైదరాబాద్‌లో నిర్వహిస్తుంటారు. తాము తయారు చేసిన అనార్కలి అనే వైన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి స్పెయిన్‌లోని మానస కంపెనీతో భాగస్వామ్యం చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు. కానీ మానసను కలిసే క్రమంలో కొన్ని ఇబ్బందులను సాల్వ్ చేసుకొని ఆమెకు రామ్ చేరువ అవుతాడు. రామ్ మంచితనాన్ని చూసి అతడిని ఇష్టపడుతుంది. అంతేకాకుండా ఓ రాత్రి శారీరకంగా ఒక్కటవుతారు. ఆ తర్వాత బిజినెస్ పని మీద స్పెయిన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి రామ్‌ను కలుస్తుంది.

రామ్, బాలమణి మధ్య ఉండే అన్యోన్య దాంపత్య జీవితం ఎలా సాగింది? స్సెయిన్‌లో మానసను కలువడానికి రామ్‌కు విందా అలియాస్ బెల్లం (సత్య) ఎందుకు అడ్డంకులు కల్పించాడు? భార్య తప్ప మరో మహిళను కన్నెత్తి చూడని రామ్.. మానసకు ఎలా చేరువయ్యాడు? మానసతో రామ్ శారీరక సుఖాన్ని పంచుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఏకపత్నీవ్రతుడిగా భావించే రామ్‌పై బాలమణికి ఎలాంటి అనుమానాలు కలిగాయి? రామ్‌కు చేరువ కావడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అతడు వివాహితుడు అని తెలిసిన తర్వాత మానస రియాక్షన్ ఏమిటి? రామ్ చేసిన మోసానికి ఎలాంటి ప్రతీకారాన్ని మానస తీర్చుకోవాలని ఉంది. ఒకవైపు భార్య, మరోవైపు మానస మధ్య రామ్ ఎలా నలిగిపోయాడు? మానస ప్రేమను రామ్ అంగీకరించాడా? భర్త చేసిన పనికి బాలమణి ఎలా రియాక్ట్ అయింది? మానస ద్వారా ఎదురైన సమస్యను రామ్ ఎలా డీల్ చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ.
పవిత్రంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించే వ్యక్తి జీవితంలోకి యాక్సిడెంటల్‌గా మరో మహిళ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? వివాహేతర సంబంధం ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందనే చిన్న పాయింట్ చుట్టూ నలుగురైదుగురు కమెడియన్లను బలవంతంగా కథలోకి లాక్కొచ్చి చేసిన కసరత్తు ఈ సినిమాగా కనిపిస్తుంది. ఈ మూవీ కథ పాతదే. కానీ ఆ కథను చెప్పిన విధానం కొత్తగా లేకపోవడం రొటీన్, రెగ్యులర్‌గా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది. నాసిరకమైన కామెడీ, జబర్దస్త్ తరహా పేలవమైన డైలాగ్స్‌తో అనుక్షణం సహనానికి పరీక్ష పెట్టారనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో సత్య కామెడీతో కొంత బెటర్‌గా మూవీ మొదలైనప్పటికీ.. కథలోకి వెళ్లిన కొద్ది మరీ నాసిరకంగా మారింది. ఈ సినిమాకు రైటింగ్ అత్యంత బలహీనతగా కనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో కొంతలో కొంత ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది.
ఇక సెకండాఫ్‌లోనైనా ఏదైనా కొత్తగా, ఏదైనా ఉంటుందని ఎదురు చూసిన వారికి పూర్తిగా నిరాశే ఎదురవుతుంది. సెకండాఫ్‌లో సరైన కథ లేకపోవడం.. చిన్న సమస్యను లాగి లాగి చెప్పాల్సి రావడంతో.. చేసేది ఏమీ లేక..పాత సినిమా పాటలతో సినిమాను క్లైమాక్స్ వరకు లాగే ప్రయత్నం చేశారు. కార్తీకదీపం, పిన్ని పాటలపై డ్యాన్సులు ఊర్లలో రికార్డు డ్యాన్సుల కంటే దారుణంగా చిత్రీకరించారు. కనీసం క్లైమాక్స్‌లోనైనా కొత్తగా చెప్పి ఆడియెన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాడా? అని ఆశించిన వారికి పూర్తిగా నిరాశే మిగులుతుంది. వెరసీ ఈ సినిమా నాసిరకరమైన ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా ముగిసిందనే ఫీలింగ్ వెంటాడుతుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రవితేజ నుంచి కొత్తగా ఆశించే నటన ఏమీ లేదు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. కాబట్టి వేవ్‌లో కాకుండా ఫ్లోలో వెళ్లిపోయాడు. డింపుల్ హయతిది బలమైన పాత్రలా కనిపిస్తుంది. కానీ పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల ఆమె కూడా ఏమీ చేయలేకపోయింది. ఈ సినిమాలో పూర్తిగా ఫుల్ మార్కులను ఆషికా రంగనాథ్ కొట్టేశారు. పొట్టిదుస్తుల్లో అందాల ఆరబోతతో స్క్రీన్‌ను ఫుల్లుగా హీట్ ఎక్కించింది. గ్లామర్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకొన్నది. ఈ సినిమాలో ఏదైనా క్రెడిట్ ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే.. అది ఆషికాకే ఇవ్వాల్సి ఉంటుంది. సత్య ఉన్నంత సేపు ఫుల్లుగా నవ్వించాడు. ఓ దశ తర్వాత ఆయన కామెడీ కూడా ఓవరాక్షన్ మాదిరిగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ పంచ్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. సునీల్, మురళీధర్, రోహన్ కామెడీ ఆకట్టుకోలేకపోయింది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాలోని పేలవమైన సన్నివేశాలకు భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలాన్ని ఇచ్చింది. పాటలు ఆడియెపరంగానే కాకుండా సినిమాల్లోకూడా బాగున్నాయి. కానీ వాటి ప్లేస్‌మెంట్ సరిగా లేకపోవడం, వెంటవెంటనే పాటలు రావడం వల్ల అవీ తెర మీద మరింతగా ఆకట్టుకోలేకపోయాయి. విదేశీ అందాలను ప్రసాద్ మూరెళ్ల తన కెమెరాలో అద్బుతంగా బంధించాడు. కంటెంట్ లేకపోయినా సన్నివేశాలను కలర్‌ఫుల్‌గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఇంకా కంటెంట్‌పై కొంత ఫోకస్ చేసి ఉంటే ఈ సినిమా అవుట్‌పుట్ మరోలా ఉండేది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఎలాంటి కొత్తదనం లేని కామెడీపైనే పూర్తిగా ఆధారపడి రూపొందించిన రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా. బలమైన పాయింట్ లేకుండా చేసిన ప్రయత్నం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కామెడీ సీన్లు అక్కడక్కడ మాత్రమే వర్కువుట్ అయ్యాయి. పేలమైన సన్నివేశాలు, పొంతనలేని, ఆకట్టుకొలేనటువంటి కథనం ఈ సినిమాకు మైనస్. ఆషికా రంగనాథ్ అందాలను ఆస్వాదించడానికి , సత్య, వెన్నెల కిషోర్ కామెడీని ఎంజాయ్ చేయడానికి ఓసారి చూడొచ్చు.


Click it and Unblock the Notifications











