Bhartha Mahasayulaku Wignyapthi First Review: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫస్ట్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ తారలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరెలియో సంగీతం అందించారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. రొమాంటిక్, ఫన్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ముగించుకొని థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. ఈ సినిమాపై సెన్సార్ అధికారులు వెల్లడించిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఈ సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ విషయానికి వస్తే.. అప్పటికే పెళ్లైన రామ్ (రవితేజ) స్పెయిన్ పర్యటనలో మానస (ఆషికా రంగనాథ్)కు దగ్గరవుతాడు. భార్య బాలమణి (డింపుల్ హయతి)కి రామ్ మధ్య జరిగిన సంఘర్షణ ఏమిటి? మానస జీవితంలోకి వచ్చిన తర్వాత రామ్ లైఫ్‌లో చోటుచేసుకొన్న పరిస్థితులు ఏమిటి? భార్యను, ప్రేయసిని ఎలా హ్యాండిల్ చేశాడనే విషయం ఈ సినిమా కథ. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య తమ కామెడీతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. కథ కొత్తది కాకపోయినా కిషోర్ తిరుమల ట్రీట్‌మెంట్, కామెడీ ఈ సినిమా బలంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం సెన్సార్ రివ్యూ తర్వాత వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా కథలో వివాదాస్పదమైన అంశాలు, అభ్యంతరకరమైన సన్నివేశాలు లేకపోవడంతో సెన్సార్ ప్రతినిధులు, అధికారులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే కొన్ని డైలాగ్స్, సన్నివేశాలకు స్వల్ప మార్పులు సూచించగా ఈ చిత్ర యూనిట్ మార్పులు, చేర్పులు చేసి అధికారులకు చూపించగా ఈ మూవీకి యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు.
ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను 16 ఏళ్లు దాటిన ఆడియెన్స్ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 16 ఏళ్లకు దిగువన ఉండే ఆడియెన్స్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో నిబంధనల్లో పేర్కొన్నారు.
ఈ సినిమా కథ, కథనాల్లో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కానీ.. ఈ సినిమాను వినోదభరితంగా రూపొందించడంలో తమ మార్కు చూపించారు. దాంతో ఈ సినిమా ఫ్రెష్‌గా సంక్రాంతి ఆడియెన్స్‌ను జోష్ పుట్టించే విధంగా ఉంటుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాలు. అంటే 142 నిమిషాలు రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా గురించిన మరిన్నీ అప్ డేట్స్, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











