Bhartha Mahasayulaku Wignyapthi Twitter Review: భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్విట్టర్ రివ్యూ

మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ తారలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరెలియో సంగీతం అందించారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. రొమాంటిక్, ఫన్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.

Bhartha Mahasayulaku Wignyapthi Twitter Review

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ విషయానికి వస్తే.. అప్పటికే పెళ్లైన రామ్ (రవితేజ) స్పెయిన్‌ పర్యటనలో మానస (ఆషికా రంగనాథ్)కు దగ్గరవుతాడు. భార్య బాలమణి (డింపుల్ హయతి)కి రామ్ మధ్య జరిగిన సంఘర్షణ ఏమిటి? మానస జీవితంలోకి వచ్చిన తర్వాత రామ్ లైఫ్‌లో చోటుచేసుకొన్న పరిస్థితులు ఏమిటి? భార్యను, ప్రేయసిని ఎలా హ్యాండిల్ చేశాడనే విషయం ఈ సినిమా కథ.

సినిమా చూడటం ఇప్పుడే పూర్తయింది. చాలా యావరేజ్ సినిమా. ఈ చిత్రంలో ఇంటర్వెల్ ఎపిసోడ్, సునీల్ ఎపిసోడ్స్, పంచ్ డైలాగ్స్, ఆషికా రంగనాథ్ గ్లామర్, సత్య కామెడీ పాజిటివ్ అంశాలు. రొటీన్ స్టోరి, ఈ సినిమా రన్ టైమ్ మైనస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ సినిమా చూసిన తర్వాత రవితేజకు నా నుంచి రిక్వెస్ట్. కొంచెం టైమ్ తీసుకొొని బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చేలా క్రాక్, ధమాకా లాంటి సినిమాలు చేయండి. ఈ సినిమా రవితేజకు కమ్ బ్యాక్ మూవీ. కానీ అప్ టూ ది మార్క్ సినిమా కాదు. ప్రాపర్ సినిమా నీ నుంచి వస్తే.. స్క్రీన్లు బ్లాస్ట్ అవుతాయి అని నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. ఫస్టాఫ్‌‌లో సత్య, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. స్క్రిప్టులో చాలా లోపాలు ఉన్నాయి. షాపింగ్ మాల్ ఎపిసోడ్ బాగుంది. వింటేజ్ రవితేజ వైబ్స్ బాగున్నాయి. ఓవరాల్ ఫస్టాఫ్ బాగుంది. ఇక సెకండాఫ్ కూడా బాగుంది. క్లైమాక్స్ వరకు ఫుల్లుగా ఫన్ మోడ్‌లో సినిమా సాగింది. కార్తీకదీపం, పిన్ని సాంగ్స్‌పై డ్యాన్స్‌లు బాగున్నాయి. సెకండాఫ్‌‌లో 30 నిమిషాల నాన్ స్టాప్ కామెడీ బాగుంది. రవితేజ ఖాతాలో హిట్ పడినట్టే అంటూ ఈ నెటిజన్ కామెంట్ చేశాడు.

మూవీ చూడటం పూర్తి అయింది. స్క్రీన్ పై రవితేజలో ఎనర్జీ కనిపించలేదు. పెర్ఫార్మెన్స్ బాగాలేదు. సత్య కామెడీ చాలా బాగుంది. సోషల్ మీడియా రెఫరెన్స్‌లు వాడిన తీరు చూస్తే రైటింగ్ అంత గొప్పగా అనిపించదు. క్లైమాక్స్ చాలా వీక్‌గా ఉంది. ఓటీటీ తరహాలో సినిమా ఇది. నా రేటింగ్ 5 పాయింట్లకు గాను 2 పాయింట్లు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ సినిమా కాన్సెప్ట్ చాలా రొటీన్‌గా ఉంది. సునీల్, వెన్నెల కిషోర్, రవి తేజ మధ్య వచ్చే కామెడీ సీన్లు పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అయ్యాయి. సినిమా చూస్తున్నంత సేపు బోర్ కొట్టదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫస్టాఫ్ చూడటం పూర్తయింది. కొన్ని సీన్లలో కామెడీ వర్కవుట్ అయింది. రవితేజ యాక్టింగ్ చాలా నిరాశపరిచింది. కొన్ని సీన్లలో మాత్రం రవితేజ మాత్రమే కనిపించాడు. బ్యాక్ టూ బ్యాక్ పాటలు ఇబ్బంది కరంగా ఉంటాయి. సెకండాఫ్‌పైనే సినిమా ఆశలు పెట్టుకోవాలి అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ సినిమా చూడటం ఇప్పుడే పూర్తయింది. సింపుల్‌గా ఉంది. ఓసారి చూడొచ్చు. ఈ సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా డీసెంట్‌గా ఉంది. సంతానలోపం గురించి జడ్జిమెంట్ పాస్ చేయకపోవడం బెటర్‌గా ఉంది. ఇప్పటికైనా రవితేజ యూనిక్ సబ్జెక్ట్‌లు ఎంచుకోవడం చేయాలి. అనుభవం ఉన్న డైరెక్టర్లతో పనిచేయండి. ఎప్పటిలానే కిషోర్ తిరుమల మంచి సినిమా అందించే ప్రయత్నం చేశారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

సినిమా చూడటం ఇప్పుడే పూర్తయింది. చాలా యావరేజ్ సినిమా. ఈ చిత్రంలో ఇంటర్వెల్ ఎపిసోడ్, సునీల్ ఎపిసోడ్స్, పంచ్ డైలాగ్స్, ఆషికా రంగనాథ్ గ్లామర్, సత్య కామెడీ పాజిటివ్ అంశాలు. రొటీన్ స్టోరి, ఈ సినిమా రన్ టైమ్ మైనస్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత పక్కా హాస్య చిత్రమని స్పష్టమైంది. మాస్ మహారాజ్ రవితేజ ఇలాంటి సినిమా కథలతో పూర్తిగా వినోదాన్ని అందిస్తారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాం అని మహేష్ బాబు ఫ్యాన్స్ ట్వీట్ చేశారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో కంటెంట్‌ను బయటపెట్టకుండా చాలా దాచిపెట్టాం. సత్య సాంగ్ రిలీజ్ చేశాం. ఈ సినిమాలో ఆయన కామెడీకి పగలబడి నవ్వడం ఖాయం. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. రెగ్యులర్ ధరకే ఈ సినిమా టికెట్లు అందుబాటులో ఉన్నాయి అంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ తెలిపింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి హిట్ టాక్ రావాలి దేవుడా.. మా ఆశలన్నీ కిషోర్ తిరుమలపైనే, రవితేజకు ఈ సినిమా కమ్ బ్యాక్ మూవీ అవ్వాలి. మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కోరుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X