Don't Miss!
- News
ఈ టర్మ్‌లో ఇదే చివరిది- తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు..!!
- Sports
నేను అనుకున్న సవాల్ ఎదురవ్వలేదు.. అతి త్వరలోనే సెంచరీ కొడతా: రోహిత్ శర్మ
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Finance
Wipro Layoffs: ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. 452 మంది తొలగింపు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Thodelu Review వరుణ్ ధావన్ ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్.. 3D ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Rating: 2.75/5
నటీనటులు: వరుణ్ ధావన్, కృతిసనన్, దీపక్ దొబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, సౌరబ్ శుక్లా తదితరులు
దర్శకత్వం: అమర్ కౌశిక్
రచన: నిరేన్ భట్
నిర్మాత: దినేష్ విజన్
సినిమాటోగ్రఫి: జిష్ణు భట్టాచార్జి
ఎడిటింగ్: సంయుక్త కాజా
మ్యూజిక్: సచిన్- జిగర్
బ్యానర్: మాడోక్ ఫిల్మ్స్
నిడివి: 156 నిమిషాలు
రిలీజ్ డేట్: 2022-11-25

భాస్కర్ శర్మ (వరుణ్ ధావన్) రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన ఇంజినీర్.సహజ వనరులు పుష్కలంగా ఉన్న అటవీ ప్రాంతంలో హైవే రోడ్డు నిర్మాణానికి తన స్నేహితులు (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్)తో కలిసి అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్తారు. అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలకు స్థానికులు వ్యతిరేకిస్తారు. ఆ క్రమంలో వారిని ఒప్పించే పరిస్థితుల్లో భాస్కర్ తోడేలు కాటుకు గురైతే.. వెటర్నరీ డాక్టర్ అనైక మిట్టల్ (కృతి సనన్) వైద్యం చేస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో భాస్కర్‌కు ఎదురైన సవాళ్లు ఏమిటి? భాస్కర్ ప్రయత్నాలకు స్థానికులు ఎలా అభ్యంతరం చెప్పారు? అడవిని కొట్టేసి రోడ్డు నిర్మాణం చేపట్టడానికి స్థానికులను భాస్కర్ ఒప్పించాడా? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి ఎలాంటి సహకారం అందింది. అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా? అనే ప్రశ్నలకు సమాధానమే తోడేలు (Bhediya) సినిమా కథ.
తోడేలు మూవీకి సంబంధించి చిన్న పాయింట్‌ను ఆసక్తికరమైన పాయింట్‌గా విస్తరించిన తీరు బాగుంటుంది. ఫన్నీతో సినిమా జర్నీని ప్రారంభించి.. అరుణాచల్ ప్రదేశ్ అందాల మధ్య.. తోడేలు విన్యాసాలను బాగా తెరకెక్కించారు. అక్కడక్కడా గ్రాఫిక్ వర్క్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఒకట్రెండు సార్లు భయపడేలా చేస్తుంది. అయితే సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్టు ఉంటుంది. సింగిల్ పాయింట్ ఎజెండాతో కథ నడవడం.. కథనం మొత్తం క్లైమాక్స్ మినహాయిస్తే అంతా ఊహించినట్టుగా సాగిపోవడం కొంత మైనస్ అనిపిస్తుంది. దర్శకుడు ఎక్కడా బోర్ లేకుండా సినిమాను ఆసక్తిగా ముందుకు తీసుకుపోవడం పాజిటివ్ పాయింట్.
తోడేలు మూవీలో వరుణ్ ధావన్ ఫెర్ఫార్మెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్స్. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా, టపోరి హీరోగా వినోదాన్ని పంచిన వరుణ్.. తోడేలు సినిమాలో కొత్త నటుడిగా తనకు తాను ఆవిష్కరించుకొన్నాడు. తోడేలుగా మారే సమయంలోను, మారిన తర్వాత చూపించిన హావభావాలు బాగున్నాయి. ఇక దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్, వరుణ్ ధావన్ పండించిన ఫన్ అక్కడక్కడ కడుపుబ్బ నవ్విస్తుంది. వెటర్నరీ హాస్పిటల్ సీన్ హిలేరియస్‌గా ఉంటుంది. కృతిసనన్ కీలక పాత్రలో కనిపించింది. క్లైమాక్స్‌లో ప్రతీ ఒక్కరిని ఎమోషనల్‌గా మార్చే పాత్రలో ఆకట్టుకొన్నది.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గ్రాఫిక్ వర్క్ బాగుంది. త్రీడి ఎఫెక్ట్స్ మంచి అనుభూతిని కలిగిస్తుంది. తోడేలు వేటాడే సీన్లు స్క్రీన్‌పై అదిరిపోతాయి. అరుణాచల్ ప్రదేశ్ అందాలను సినిమాటోగ్రాఫర్ అద్బుతంగా చూపించాడు. కథ, సన్నివేశాలకు తగినట్టుగా సచిన్- జిగర్ అందించిన బీజీఎం బాగుంది. తంకేశ్వరి పాట జోష్‌ను పెంచుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పిల్లలతోపాటు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే చిత్రమని చెప్పవచ్చు. ఈ వీకెండ్లో తగినంత సమయం ఉండి.. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాను చూడాలంటే.. తోడేలు బెస్ట్ ఆప్షన్.