Bheemla Nayak movie review.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగే.. రానా ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

Rating: 3.25/5

పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ అంటే అభిమానులకు గుండె నిండా పవర్. అలాంటి పవర్ స్టార్ పవర్‌పుల్ రోల్‌లో భీమ్లా నాయక్‌గా వస్తున్నాడంటే.. ప్రేక్షకుల్లో చెప్పలేనంత అనుభూతి పేరుకుపోతుంది. అయితే కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే కాకుండా రానా దగ్గుబాటి కలిసి రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 25 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ ఎలాంటి స్పందనను కూడగట్టుకొన్నదంటే..

భీమ్లా నాయక్ కథేమిటంటే..

భీమ్లా నాయక్ కథేమిటంటే..

కర్నూలు జిల్లాలో భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) నిజాయితీపరుడైన పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్. వరంగల్ మాజీ ఎంపీ (సముద్ర ఖని) కుమారుడైన డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఏపీ సరిహద్దులో మద్యపానంపై ఆంక్షలు ఉన్న ప్రదేశంలో పీకల దాకా తాగి భీమ్లా నాయక్‌కు పట్టుబడి అరెస్ట్ అవుతాడు. అయితే రాజకీయంగా పలుకుబడి ఉండటంతో సీఐ సూచన మేరకు డేనియల్ శేఖర్‌కు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు చేయడమే కాకుండా మద్యం సరఫరా చేస్తారు. ఫలితంగా భీమ్లా నాయక్, మరో లేడి కానిస్టేబుల్‌ సస్పెండ్‌కు గురవుతారు.

భీమ్లా నాయక్ మూవీలో ట్విస్టులు

భీమ్లా నాయక్ మూవీలో ట్విస్టులు

భీమ్లా నాయక్ ఏ పరిస్థితుల్లో సస్పెండ్‌కు గురవుతారు? సస్పెండ్ గురైన భీమ్లా నాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? భీమ్లా నాయక్‌ను డేనియల్ శేఖర్ ఎలాంటి కేసులో ఇరికించాడు? తనను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు? భీమ్లా నాయక్ భార్య సుగుణ (నిత్య మీనన్) కూడా డేనియల్ శేఖర్ ఫ్యామిలీ ఎలాంటి కేసులో ఇరికిస్తారు. తన భార్యను అరెస్ట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ రియాక్షన్ ఏమిటి? భీమ్లా నాయక్ నుంచి డేనియల్ శేఖర్‌ను ఆయన భార్య (సంయుక్త మీనన్) ఎలా దక్కించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే భీమ్లా నాయక్ కథ.

 ఫస్టాఫ్ ఎలా ఉందంటే

ఫస్టాఫ్ ఎలా ఉందంటే


అయ్యప్పనుమ్ కోషియం కథా సరిహద్దులను దాటకుండా అదనంగా ఎమోషనల్ పాయింట్స్ జోడించారనేది తొలి సీన్‌లోనే దర్శకుడు సాగర్ చంద్ర సంకేతం అందిస్తాడు. భీమ్లా నాయక్, డేనియల్ మధ్య ఇగో క్లాష్‌తో సినిమాలో ఇంటెన్సిటి పెరుగుతుంది. నిత్యమీనన్‌తో సరదా సన్నివేశాలతో కథ ఫీల్‌గుడ్‌‌గా సాగుతుంది. భీమ్లా నాయక్ సస్పెన్షన్ తర్వాత కథలో మాస్ ఎలిమెంట్స్ చోటు చేసుకోవడంతో సినిమా మరో రేంజ్‌కు వెళ్లినట్టు అనిపిస్తుంది. భీమ్లా నాయక్, డేనియల్ మధ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఫైట్స్‌ మంచి ట్విస్టుతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

 సెకండాఫ్‌లో

సెకండాఫ్‌లో

భీమ్లా నాయక్ సినిమాకు సెకండాఫ్ అత్యంత బలంగా మారిందని చెప్పవచ్చు. భీమ్లా నాయక్ ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కథకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మలయాళ చిత్రంలోని కంటెంట్ కాకుండా అదనంగా సిస్టర్ సెంటిమెంట్ జోడించడం కథలో ట్విస్టుగా మారుతుంది. సెకండాఫ్‌లో మాస్, క్లాస్ ప్రేక్షకులు ఊగిపోయేంతంగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్లు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్తాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అనిచెప్పవచ్చు.

 త్రివిక్రమ్, సాగర్ కాంబినేషన్

త్రివిక్రమ్, సాగర్ కాంబినేషన్

అయ్యప్పనుమ్ కోషియం సినిమా కథను బేస్ చేసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన స్క్రీన్, మాటలు భీమ్లా నాయక్‌కు ఎనర్జీని పెంచింది. తండాకు సంబంధించిన సీన్లు, అలాగే సెకండాఫ్‌లో ఫ్యాష్ బ్యాక్ సన్నివేశాలు.. అలాగే క్లైమాక్స్ ఫైట్‌ మాటల మాంత్రికుడి ప్రతిభకు మరోసారి అద్దం పట్టాయి. డ్రెస్ నీకు బలం కావొచ్చు.. కానీ నాకు అడ్డం.. అందుకే తీసేశా.. భయం గురించి చెప్పిన డైలాగ్స్, ఇంకా చాలా సంభాషణలు హృదయాన్ని కదిలిస్తాయి. త్రివిక్రమ్ వేసిన హైవే రోడ్డుపై దర్శకుడు సాగర్ చంద్ర తనదైన శైలిలో మెరుగులు దిద్దాడు. కథను ఎక్కడా ట్రాక్ తప్పకుండా సీన్ సీన్‌కు పెంచుకొంటూ పోయాడనిపిస్తుంది. కొన్ని చోట్ల కాస్త మసాల తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ మల్టీ స్టారర్ కావడంతో కొన్ని అంశాలను బ్యాలెన్స్ చేయడం ఆ ఫీలింగ్ కలుగుతుందనిపిస్తుంది.

పవన్ కల్యాణ్ ఫెర్ఫార్మెన్స్

పవన్ కల్యాణ్ ఫెర్ఫార్మెన్స్

భీమ్లా నాయక్‌గా పవన్ కల్యాణ్‌ రకరకాల కోణాలు ఉన్న పాత్ర. నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా, అలాగే తండాలో గిరిజన ప్రజల కోసం ప్రాణాలకు తెగించే యువకుడిగా. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్కారవంతుడిగా, పేదల కష్టం వస్తే తోడుంటే మనిసిగా ఇలా చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లలో, భావోద్వేగమైన సన్నివేశాల్లో తన మార్కు స్టయిల్‌ను చూపించాడు. లుంగీ కట్టిన భీమ్లా నాయక్‌లోని ఆవేశం తెర మీద ఫైర్ కనిపిస్తుంది.

రానా యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్

రానా యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్


రానా విషయానికి వస్తే.. అరికాలి నుంచి తల వరకు ఫుల్లుగా పొగరు ఉన్న రాజకీయ నేతగా డేనియల్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో పవన్ కల్యాణ్‌తో నువ్వా? నేనా అనే విధంగా చెలరేగిపోయాడు. డేనియల్ పాత్రలో పవర్‌ఫుల్ కనపడటంతో చుట్టు ఉన్న పాత్రలనీ యాక్టివ్‌గా కనిపిస్తాయి. ఒక మల్టీస్టారర్ సినిమాకు కావాల్సిన మసాలాను తన పాత్ర ద్వారా రానా ప్రేక్షకులకు చూపించాడు. కొన్నిసార్లు పవన్‌పై పైచేయి సాధించాడనిపిస్తుంది.

 సంయుక్త మీనన్, నిత్య మీనన్ గురించి

సంయుక్త మీనన్, నిత్య మీనన్ గురించి

మిగితా పాత్రల విషయానికి వస్తే.. సుగుణ పాత్రలో నిత్యమీనన్ కనిపించింది. కొన్ని రొమాంటిక్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఆమె తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. పాత్ర చిన్నదైనా గుర్తుండిపోయే ప్రతిభను తెరమీద చూపించారు. ఇక సంయుక్త మీనన్‌కు తన నటనతో అదరగొట్టింది. రానా, సముద్రఖనితో పోటాపోటిగా ఉండే సన్నివేశాల్లోను, అలాగే క్లైమాక్స్‌లో కథను మార్చివేసే సన్నివేశాల్లో సంయుక్త మీనన్ యాక్టింగ్ సూపర్ అనిపిస్తుంది. ఎప్పటి మాదిరిగానే సముద్రఖని పవర్‌ఫుల్‌గా నటించాడు. రఘుబాబు, నర్రా శ్రీనివాస్ తదితరులు తమ పాత్రల మేరకు బ్రహ్మండంగా రాణించారు.

 మరోసారి ఇరుగదీసిన తమన్

మరోసారి ఇరుగదీసిన తమన్


సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. భీమ్లా నాయక్‌కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్. అఖండ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా రీరికార్డింగ్‌తో అదరగొట్టాడు. తెర మీద పాటలు అద్భుతంగా ఉన్నాయి. మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. రవి కే చంద్రన్ సినిమా మరో ఆకర్షణ. యాక్షన్ సీన్లను సరికొత్తగా కెమెరాలో బంధించాడు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ పనితీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తండా సెట్, పోలీస్ స్టేషన్ సెట్స్ కథకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారాయి. నవీన్ నూలి ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమాణాలకు తగినట్టుగా నాగవంశీ అనసరించిన నిర్మాణ విలువలు భేష్ అనే స్థాయిలో ఉన్నాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

ఎమోషనల్, యాక్షన్ కంటెంట్‌తో భీమ్లా నాయక్‌ను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా తివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ అందించారు. నిజమైన మల్టీస్టారర్ అనిపించేలా పవన్ కల్యాణ్, రానా పాత్రలను బ్యాలన్ చేయడం ఈ సినిమాకు ప్లస్. నిత్యమీనన్, సంయుక్త మీనన్‌కు నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కేవలం పవన్ ఫ్యాన్స్‌కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు భీమ్లా నాయక్ పక్కాగా నచ్చే విధంగా అన్ని అంశాలు ఉన్నాయి. భారీ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుంఇడా ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్
పవన్ కల్యాణ్
రానా, నిత్య మీనన్ పెర్ఫార్మెన్స్
త్రివిక్రమ్ రైటింగ్
సాగర్ కే చంద్ర టేకింగ్
తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్
యాక్షన్ సీన్లలో ఓవర్ డోస్

Recommended Video

Bheemla Nayak Trailer Records భీమ్లా నాయక్ రికార్డుల బీభత్సం Pre Booking Status | Filmibeat Telugu
భీమ్లా నాయక్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

భీమ్లా నాయక్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, బ్రహ్మనందం, మురళీ శర్మ, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, పమ్మి సాయి తదితరులు
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, ఎస్ రాధాకృష్ణ
సినిమాటోగ్రఫి: రవి కే చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: తమన్ ఎస్
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2022-02-22

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X