Bhimaa Review మాస్, కమర్షియల్ అంశాలే బలంగా భీమా.. గోపిచంద్ హిట్టు కొట్టాడా?
Rating: 2.75/5
నటీనటులు: గోపిచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర, సరయు, రఘుబాబు, నరేష్, పూర్ణ, నాజర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు
దర్శకత్వం: ఏ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
మ్యూజిక్: రవి బస్రూర్
సినిమాటోగ్రఫి: స్వామి జే గౌడ
ఎడిటర్: తిమ్మరాజు
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2024-03-08
పరుశురామ క్షేత్రంలో అక్రమ వ్యాపారాలు చేసే భవానీ ( ముఖేష్ తివారీ) ఆగడాలకు హద్దు, అదుపు ఉండదు. నిజాయితీతో కూడిన ఆఫీసర్లను దారుణంగా మట్టుబెడుతూ దందాను కొనసాగిస్తుంటాడు. అలాంటి సమయంలో భీమా (గోపిచంద్) ఆ ప్రాంతానికి ఇన్స్‌పెక్టర్‌గా వస్తాడు. భవానీ చేసే వ్యాపారాలపై ఉక్కుపాదం వేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆయుర్వేద వైద్యుడు రవీంద్ర వర్మ (నాజర్) ఆశ్రమంలో పరిశోధన చేసే టీచర్ విద్య (మాళవిక శర్మ) తో ప్రేమలో పడుతాడు.

భవానీ అక్రమ దందాలకు భీమా చెక్ పెట్టాడా? భవానీ చేసే చీకటి వ్యాపారాలు ఏమిటి? రవీంద్ర వర్మ చేతిలో భీమాకు, విద్యకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది. భీమా అనుకొన్న లక్ష్యాన్ని సాధించాడా? పరుశురామ క్షేత్రంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను భీమా ఎలా ఎదురించారనే ఈ సినిమా కథ.
పరుశురామ క్షేత్రం పవిత్రత, పురాణం, చరిత్రను చెప్పే విషయంతో ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం బాగుంది. కానీ తీరా కథలోకి వెళ్లిన తర్వాత రెగ్యులర్, రొటీన్ పోలీస్ కథ, భీమా, విద్య మధ్య నాసిరకమైన లవ్ ట్రాక్ మూవీపై పెంచుకొన్న అంచనాలపై నీళ్లు చల్లినట్టు అనిపిస్తాయి. కానీ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో మరోసారి భీమా కథ ఇది కాదు.. మరోటి ఉందనే విషయంతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా దర్శకుడు హర్ష చేసిన ప్రయత్నం బాగుంది.

ఇక సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తితో కూర్చున్న ప్రేక్షకులకు అదే పేలవమైన నరేష్ వీకే లవ్ ట్రాక్ సినిమాను నాలుగు అడుగులు వెనక్కి నెట్టేలా చేసింది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండింగ్ వరకు కథలో వచ్చిన ట్విస్టులు ప్రేక్షకులకు థ్రిల్ కలుగజేస్తాయి. మంచి ఎమోషనల్ పాయింట్‌లో సినిమాను మరోసారి ట్రాక్‌పైకి తెచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది.
పోలీస్ ఆఫీసర్‌గా గోపిచంద్ ఎప్పటిలానే తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశాడు. కామెడీ, లవ్ మిక్స్ చేసి నడిపించిన ట్రాక్.. ఆయనకు సూట్ కాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో గోపిచంద్ పాత్ర మరో కోణం సినిమాకు ప్లస్ అయిందనిపించేలా నటించాడు. క్లైమాక్స్‌లో గోపిచంద్ పెర్ఫార్మెన్స్ మరింత ఆకట్టుకొన్నది. విద్యగా మాళవిక, పరిగా ప్రియా భవానీ శంకర్ తమ పాత్రల పరిధి మేరకు అందం, అభినయంతో ఆకట్టుకొన్నారు.

భీమాలో మిగితా నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వెన్నెల కిషోర్, నరేష్, రఘుబాబు, చమ్మక్ చంద్ర కథలో భాగంగా వచ్చే కామెడీ సీన్లలో ఫర్వాలేదనిపించారు. పూర్ణ ఎమోషనల్ పాత్రలో కనిపించారు. సరయు ఫర్వాలేదనిపించారు. ఇక కీలక పాత్రలో ముఖేష్ తివారీ, నాజర్ కథను మలుపు తిప్పే పాత్రల్లో ఒదిగిపోయారు.
భీమా మూవీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి బాగుంది. పలు సన్నివేశాలను మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ బాగా ఎలివేట్ చేశాడు. పురాణాలకు సంబంధించి.. సెకండాఫ్‌లో బాదామి ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. క్లైమాక్స్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. కేకే రాధామోహన్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
పురాణాల్లోని ఓ ఎపిక్ పాయింట్‌ను తీసుకొని కమర్షియల్ హంగులు జోడించి అల్లుకొన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. మాస్ ఆడియెన్స్‌కు కిక్కెక్కించే అంశాలు కొన్ని ఉన్నాయి. కథ పాయింట్‌గా బాగుందనిపిస్తుంది. కానీ కథా విస్తరణలో కొన్ని లోపాలు సినిమాకు మైనస్‌గా మారాయి. కథపై మరింత కసరత్తు చేసి ఉంటే డెఫినెట్‌గా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అయి ఉండేదనిపిస్తుంది. పురాణాలు, దైవత్వం నేపథ్యంగా మాస్, కమర్షియల్ అంశాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











